బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం (జూన్ 5) రాత్రి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ముంబై నగరానికి ప్రయాణీకులతో బయలుదేరాల్సిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానానికి రన్‌వేపై ఊహించని విధంగా పక్షి ఢీకొట్టింది. టేకాఫ్ తీసుకునే సరిగ్గా ఆఖరి నిమిషంలో ఈ బర్డ్ హిట్ ఘటన జరగడంతో అందరూ తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. విమానం గాల్లోకి లేవడానికి ముందే ఈ ప్రమాదం జరగడం, పైలట్ అప్రమత్తతతో వ్యవహరించడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
వివరాలిలా ఉన్నాయి.. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన 6ఇ 6283 ఎయిర్‌బస్ ఏ321 నియో విమానం బెంగళూరు నుంచి ముంబైకి బయలుదేరాల్సి ఉంది. ప్రయాణికుల బోర్డింగ్ ప్రక్రియ అంతా ముగిసిపోయింది. విమానం రన్‌వే పైకి చేరుకుని, టేకాఫ్ కోసం వేగంగా దూసుకెళ్తున్న తరుణంలో ఒక పక్షి విమానాన్ని ఢీకొట్టింది. పక్షి ఢీ కొనడాన్ని గుర్తించిన పైలట్లు సమయస్ఫూర్తితో విమాన వేగాన్ని నియంత్రిస్తూ రన్‌వే పైనే నిలిపివేసి.. తిరిగి విమానాశ్రయ బే తరలించారు. విమానం ఒక్కసారిగా వెనక్కి తిరగడంతో లోపల ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు, భయాందోళనలకు గురయ్యారు.
ఏవియేషన్ నిబంధనల ప్రకారం ఇలాంటి బర్డ్ హిట్ ఘటనలు జరిగినప్పుడు విమానాన్ని క్షుణ్ణంగా పరీక్షించాల్సి ఉంటుంది. ముఖ్యంగా విమానం రెక్కలు, విండ్‌షీల్డ్‌తో పాటు అత్యంత కీలకమైన రెండు ఇంజన్లను నిశితంగా పరిశీలించాలి. ఎయిర్‌పోర్టుకు చెందిన నిపుణులైన సాంకేతిక, ఇంజనీరింగ్ బృందాలు రంగంలోకి దిగి దాదాపు గంటన్నర పాటు విమానాన్ని పూర్తిగా తనిఖీ చేశాయి.
విమాన ప్రయాణానికి ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని, ప్రయాణం సురక్షితమేనని నిర్ధారించుకున్న తర్వాతే ఆ విమానానికి ఎయిర్ వర్తీనెస్ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ తనిఖీల ప్రక్రియ అంతా పూర్తి అయిన తరువాత ఆ ఇండిగో విమానం ప్రయాణికులతో సురక్షితంగా ముంబైకి పయనమైంది. ఈ ప్రమాదం కారణంగా ప్రయాణికులు గంటన్నరకు పైగా విమానాశ్రయంలో వేచి చూడాల్సి వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/narrow-escape-for-indigo-flight-at-bengaluru-airport-36-222004.html
ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లో బౌలర్లు ఊచకోత కోశారు. మొదటి రెండు రోజుల్లోనే ఏకంగా 33 వికెట్లు కూలడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. కివీస్ ముందు 254 పరుగుల టార్గెట్ ఉండగా.. ఇప్పటికే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
తెలంగాణలో ప్రతిరోజూ రూ. 5 కోట్లు దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లు! హైదరాబాద్ పోలీసులు ఛేదించిన ₹150 కోట్ల స్కామ్, మరియు మీ బ్యాంక్ ఖాతాను సురక్షితంగా ఉంచుకోవడానికి హెల్ప్‌లైన్ 1930 ఎలా ఉపయోగపడుతుందో పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్‌లో ఘోరం జరిగింది. ఇంటి ముందు క్రికెట్ ఆడవద్దని చెప్పిన 42 ఏళ్ల ముద్దునూరు మంజుల అనే మహిళపై, ఆమె కుమారుడిపై కొందరు యువకులు ఇల్లు చొరబడి దాడికి తెగబడ్డారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
బెంగళూరు నమ్మ మెట్రో బ్లూ లైన్ ఎయిర్‌పోర్ట్ కారిడార్ కోసం మొదటి సరికొత్త రైలు సెట్ వచ్చేసింది. సిల్క్ బోర్డ్ నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు ట్రాఫిక్ కష్టాలు తీర్చే ఈ మెట్రో లైన్ ట్రయల్ రన్స్, రూట్ వివరాలు, రియల్ ఎస్టేట్ మార్పుల పూర్తి వివరాలు మీకోసం.
బిట్‌కాయిన్ విలువ భారీగా పడిపోయింది. 2024 ట్రంప్ విజయం తర్వాత తొలిసారిగా $60,000 మార్కు కిందకు చేరింది. క్రిప్టో పతనానికి గల ముఖ్య కారణాలు మరియు ఎథేరియం, సోలానా వంటి కాయిన్ల తాజా పరిస్థితి ఇక్కడ చదవండి.
భారత స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, నిఫ్టీ 50 ప్రస్తుత స్థాయిల నుండి డబుల్ డిజిట్ (రెండంకెల) లాభాలను ఎలా సాధించగలదో ఒమ్నిసియెన్స్ క్యాపిటల్ నిపుణులు అశ్విని షామీ వివరించారు. ముడి చమురు ధరల తగ్గింపు మరియు ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన టాప్ 5 రంగాల గురించిన పూర్తి విశ్లేషణ మీకోసం.
పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఎల్ నినో తీవ్ర ప్రభావం చూపనుందన్న ఐఎండీ చేసింది. 2026 సంవత్సరానికి సంబంధించిన రుతుపవనాల అంచనాలను సవరించింది. ఈ ఏడాది దేశంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతంలో 90 శాతం కంటే తక్కువ నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
భారత స్టాక్ మార్కెట్లో రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ షేర్లు వరుసగా లోయర్ సర్క్యూట్ తాకుతున్నాయి. ₹15.15 లక్షల కోట్ల ఆదాయాన్ని తప్పుగా చూపించారంటూ సెబి (SEBI) మోపిన సంచలన ఆరోపణలు, నిధుల మళ్లింపు వివాదం మరియు జెన్సాల్ ఇంజనీరింగ్ తో పోలికల వెనుక ఉన్న అసలు కారణాలను ఈ వెబ్ స్టోరీలో పూర్తిగా తెలుసుకోండి.
జూన్ 6న దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా కుప్పకూలాయి. 100 గ్రాములపై రూ. 30,000 వరకు తగ్గిన లేటెస్ట్ 22 క్యారెట్లు, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లను ఇక్కడ క్లిక్ చేసి పూర్తిగా తెలుసుకోండి!
ఫిఫా వరల్డ్ కప్ 2026 లో 60 ఏళ్ల నిరీక్షణకు తెరదించేందుకు ఇంగ్లాండ్ జట్టు సరికొత్త వ్యూహాలతో సిద్ధమైంది. కోచ్ థామస్ టుచెల్ సంచలన నిర్ణయాలు, వాతావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు వేసిన మాస్టర్ ప్లాన్ వివరాలు ఇక్కడ చదవండి
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి నేటి వ్యాపారవేత్తలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా బిజినెస్ మొదలుపెడితే ఎందుకు నష్టపోతారో, మార్కెట్లోని నకిలీ ఆర్థిక సలహాదారుల వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
భారత స్టాక్ మార్కెట్‌లో నిఫ్టీ 50 పతనం తర్వాత తిరిగి డబుల్ డిజిట్ లాభాలు ఎలా రాబోతున్నాయి? ప్రముఖ మార్కెట్ నిపుణుడు అశ్విని షామీ షేర్ చేసిన బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ టిప్స్ మరియు టాప్ 5 రంగాలు ఇవే
భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద నార్వే చెస్ 2026 టోర్నీలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. మాగ్నస్ కార్ల్‌సన్‌ను రెండుసార్లు ఓడించి, 18 పాయింట్లతో ఛాంపియన్‌గా నిలిచిన తొలి భారతీయుడిగా రికార్డు కెక్కాడు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.