నమో అంటే నాయుడు.. మోడీ కాంబినేషన్.. నారా లోకేష్

Publish Date:Feb 27, 2026

Advertisement

పారిశ్రామికవేత్తలు తమ పెట్టుబడులకు గమ్య స్థానంగా ఆంధ్రప్రదేశ్ ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం.. రాష్ట్రంలో  అద్భుతమైన ట్రాక్ రికార్డు కలిగిన, అనుభవజ్జుడైన ముఖ్యమంత్రి నారాచంద్రబాబు కారణమని నారా లోకేష్ అన్నారు. చంద్రబాబు దార్శనికత, ఆయనపై ఉన్న విశ్వసనీయత కారణంగానే   పారిశ్రామిక వేత్తలు ఏపీవైపు చూస్తున్నారని నారా లోకేష్ చెప్పారు.  ఎబిపి నెట్ వర్క్ ఆధ్వర్యంలో ఐడియాస్ ఆఫ్ ఇండియా -2026 పేరిట నిర్వహించిన సదస్సులో మాట్లాడిన లోకేష్ కేవలం 17నెలల్లో దేశంలోనే అతిపెద్దదైన ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు అన్ని అనుమతులు ఇచ్చామనీ,  మార్చి 3వవారంలో ఆ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేయబోతున్నామనీ చెప్పారు.  

 డిల్లీలో ప్రధాని మోడీ, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబునాయుడు  కాంబినేషన్ ను లోకేష్  నమో (నాయుడు-మోడీ)గా అభివర్ణించారు.   మొత్తం భారతదేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25.3శాతం ఎపికి రావడానికి నమో నాయకత్వమే ప్రధాన కారణమన్నారు.  కాంపిటీటివ్ అడ్వంటేజ్ లో భాగంగా మేం ఎకరా 99పైసలకే ప్రధాన కంపెనీలకు భూములిస్తున్నామన్న లోకేష్..  ఫార్చూన్ 500 కంపెనీలను రప్పించేందుకు  ప్రత్యేక పాలసీ రూపొందించామన్నారు.  

 ఇచ్చే భూమి కంటే ఆ కంపెనీలు సృష్టించే ఎకోసిస్టమ్ చాలా రెట్లు పెద్దదని వివరించారు. ఇక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఉదాహరణగా ఆయన..   కాగ్నిజెంట్ సిఇఓ రవికుమార్ తో దావోస్ లో కలిసి మాట్లాడాననీ, తాను   రెండోసారి దావోస్ వెళ్లేటప్పటికీ విశాఖలో ఆ కంపెనీ భూమిపూజ చేసిందనీ,  వచ్చే ఏడాది మూడోసారి దావోస్ కు వెళ్లే సమయానికి భవనాలు కూడా పూర్తవుతాయనీ చెప్పారు. దీని ద్వారా విశాఖపట్నంలో   యువతకు సుమారు 25,000 ఉద్యోగాలు వస్తాయి. ఆ కంపెనీ రాకతో ప్రతిఏటా 1500 కోట్ల ఆర్థిక కార్యకలాపాలు వస్తాయి. భూమి విలువకంటే ఆ కంపెనీ ద్వారా రాష్ట్రానికి లభించే ప్రయోజనం ఖచ్చితంగా పెద్దదని క్లారిటీ ఇచ్చారు.    

By
en-us Political News

  
కడప జిల్లా మద్యం బాంబులు తెగ తాగేశారు. జిల్లాను మద్యం మత్తులో ముంచేశారు.
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో సంచలనం సృష్టించిన చౌడేశ్వరి పరువు హత్య కేసులో పోలీసు యంత్రాంగం దిద్దుబాటు చర్యలకు దిగింది.
హైదరాబాద్ తారామతి రిసార్ట్‌లో ఈగల్ ఫోర్స్ దాడులు.. ఆరుగురికి డ్రగ్ పాజిటివ్
ఇటీవలి పరిణామాలు సంప్రదాయ పోరాటాల నుండి ఇరాన్ యొక్క వ్యూహాత్మక సైనిక మౌలిక సదుపాయాలను, ముఖ్యంగా దాని క్షిపణి మరియు అణు సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుని దెబ్బతీయడం వైపు దృష్టి మళ్లుతున్నట్లు సూచిస్తున్నాయి.
ప్రస్తుతం దేవీపట్నం మండలంలోని నేలకోట కొండ ప్రాంతాన్ని ఈ పులి తన ఆవాసంగా మార్చుకున్నట్లు అధికారులు గుర్తించారు. గత నాలుగు రోజులుగా ఈ పరిసరాల్లోనే పులి తిరుగుతున్నట్లు స్థానికులు గుర్తించారు. పశువుల కాపరులు, కొండపైకి వెళ్లే గ్రామస్థులు పులిని నేరుగా చూడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. రామదుర్గం కొండపై పులి కదలికలను కొందరు సెల్ ఫోన్లలో చిత్రీకరించారు కూడా.
రిసార్ట్‌లో జాక్ అండ్ జాన్సన్ పేరిట నిర్వహిస్తున్న ఓ ఈవెంట్‌లో విచ్చలవిడిగా మాదకద్రవ్యాల వాడకం జరుగుతున్నట్లు అధికారులకువిశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ఈగల్ బృందం, హైదరాబాద్ సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్ సమాచారం ప్రకారం, ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.7గా నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని హుకుంపేట మండలం జోగులపుట్టు గ్రామాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. భూ అంతర్భాగంలో సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు సంభవించాయి.
జానీ అనే వ్యక్తి రేడియో టవర్ ఎక్కి ముఖ్యమంత్రితో మాట్లాడే వరకు దిగనే దిగను అంటు హల్ చల్ చేశాడు. జానీ ఆటో నడుపుకుంటూ జీవనోపాధి కొనసాగి స్తున్నాడు. గ్యాస్ సమస్య కారణంగా ఆటో సరిగా నడపలేకపోతున్నానని దీంతో తాను తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటు న్నానొ ఆవేదన వ్యక్తం చేశాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తన క్లాసిక్ ఇన్నింగ్స్ తో గెలిపించాడు. అయితే కోహ్లీపై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. లండన్‌లో నివాసం ఏర్పరుచుకున్న విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరఫున ఐదో విదేశీ ఆటగాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ శ్రేయ్యస్ అయ్యర్‌‌తో పాటు పంజాబ్ ఆటగాళ్లపై జరిమానా పడింది. అది రెండో సారి కావడంతో శ్రేయస్‌పై ఐపీఎల్ కమిటీ ఏకంగా రూ.24 లక్షల ఫైన్ విధించింది. ప్లేయర్లకు రూ.6లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో పాతిక శాతం జరిమానా విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు.
యుద్ధం వల్ల ఇరాన్ ప్రత్యక్ష నరకాన్ని, భారీ నష్టాన్ని చవిచూస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ ఇంధన కేంద్రాలు, సైనిక స్థావరాలు.. దారుణంగా దెబ్బతింటున్నాయి. ఇరాన్ కరెన్సీ- రియాల్ విలువ దారుణంగా పడిపోయింది. ద్రవ్యోల్బణం 40శాతం దాటిపోయింది, దీనివల్ల సామాన్యులకు నిత్యావసర వస్తువులు అందనంత భారమయ్యాయి.
నాటోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారతదేశానికి ఒక ముఖ్యమైన అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
అమెరికా సైనిక కార్యకలాపాలకు సాంకేతిక సహకారం అందిస్తున్నాయంటూ.. ఇరాన్ ఇప్పుడు టెక్‌ దిగ్గజాలైన అమెజాన్, ఒరాకిల్ వంటి సంస్థల డేటా సెంటర్లపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. బహ్రెయిన్‌లోని అమెజాన్ డేటా సెంటర్‌తో పాటు దుబాయ్‌లోని ఒరాకిల్ కేంద్రాలపై ఇరాన్ దాడులు చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.