ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆదివాకం (ఏప్రిల్ 5) తెల్లవారుజామున భూమి కంపించింది. జనం అంతా గాఢ నిద్రలో ఉన్నవేళ ఒక్కసారిగా భూమి కంపించడంతో క ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రకంపనల ప్రభావం పొరుగున ఉన్న విశాఖపట్నంలో కూడా కనిపించింది. భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగుతు తీశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఉలిక్కిపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్ సమాచారం ప్రకారం, ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.7గా నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని హుకుంపేట మండలం జోగులపుట్టు గ్రామాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. భూ అంతర్భాగంలో సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు సంభవించాయి.
తెల్లవారుజామున సుమారు 4:19 గంటల సమయంల విశాఖపట్నంలోని అరిలోవ, మాధవధార, ఆక్కయ్యపాలెం, ఎంవీపీ కాలనీ, గాజువాక వంటి ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. నిద్రలో ఉన్న వారు ఒక్కసారిగా మంచాలు కదలడం, గృహోపకరణాలు కిందపడటంతో తీ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగలేదు.
ఉత్తరాంధ్ర ప్రాంతంలో గతంలోనూ ఇటువంటి స్వల్ప ప్రకంపనలు అక్కడక్కడా సంభవించిన దాఖలాలు ఉన్నాయి. భూమి లోపల ఉండే ప్లేట్ల కదలికల వల్ల ఇలాంటి స్వల్ప భూకంపాలు సంభవిస్తాయని భూగర్భ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/earthquake-in-ap-36-216694.html
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది.
ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సాధించిన ఘటన వెలుగులోకి రావడంతో విద్యుత్ శాఖలో కలకలం రేగింది.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు.. ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్తుపై నీలి నీడలు- ఇదీ ప్రస్తుతం ఏపీ అంతటా ఉన్న ఇంజినీరింగ్ స్టూడెంట్స్ నోటి వెంట వినిపిస్తోన్న మాట.
యుద్దం ముంగిపునకు ఇరాన్‌పై వత్తిడి తెచ్చేలా అమెరికా పలు షరతులు విధిస్తూ డెడ్ లైన్ విధించింది.
అమరావతికి తాము కట్టుబడి లేమంటూ బొత్స చేసిన వ్యాఖ్యల వెనక సారమేంటి? అయితే వైసీపీ తిరిగి మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నట్టా?
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ ప్రజలపై మోయలేని భారం పడుతోంది.
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు విపరీతంగా పెరగడంతో శ్రీలంకకు మళ్లీ ఆర్థిక కష్టాలు చుట్టుముడుతున్నాయి.
రఘురామకృష్ణం రాజుపై రాజద్రోహం కేసు ఎవరు పెట్టమన్నదెవరు? రాతపూర్వకంగా ఆదేశాలు ఉన్నాయా? ఉంటే ఎవరిచ్చారు? సాక్ష్యాలు ఫేకా అన్న విషయం పరిశీలించారా?
ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, హోర్ముజ్ జలసంధి గుండా భారత్ స్థిరమైన సముద్ర రవాణాను కొనసాగించింది. అమెరికా-ఇజ్రాయెల్ ఇరాన్‌పై జరిపిన దాడులు పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసిన ఫిబ్రవరి 28 నుండి, భారత నౌకలకు చెందిన కనీసం ఎనిమిది నౌకలు ఈ కీలకమైన జలసంధి గుండా ప్రయాణించాయి.
తాజా నిబంధనల ప్రకారం, వాహనదారులు టోల్ రుసుమును ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా మాత్రమే చెల్లించాలి. ఒకవేళ వాహనానికి ఫాస్టాగ్ లేకపోతే, యూపీఐ ద్వారా సాధారణ రుసుము కంటే 1.25 రెట్లు అధికంగా చెల్లించాల్సి వస్తుంది.
చరిత్రలో అమెరికాకు తగిలిన అతిపెద్ద మిలిటరీ సెట్ బ్యాక్ ను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చరిత్ర పునరావృతమవుతుంది అని పేర్కొంటూ.. 1980లో అమెరికా ఎదుర్కొన్న ఘోర పరాజయాన్ని ఆ పోస్టులో ఇరాన్ పేర్కొంది.