ఈయన పప్పులు చంద్రబాబు దగ్గర ఉడకడంలేదట....

Publish Date:Nov 25, 2017

Advertisement


టీడీపీ చిత్తూరు ఎంపీ శివ ప్రసాద్ స్టైల్ గురించి అందరికీ తెలిసిందే. ఈయన ఏదైనా సమస్య గురించి చెప్పాలంటే దానికి తగినట్టుగా వేషదారణ వేసుకుంటూ... బుర్ర కథలు చెబుతూ మరీ.. ప్రజా సమస్యలను చూపిస్తుంటారు. ఇప్పటికే ఎన్నో వేషధారణలు.. బుర్ర కథలు వేసిన శివప్రసాద్ గారి.. బుర్రగాథలు మాత్రం చంద్రబాబుగారు వినిపించుకునే పరిస్థితిలో లేరట. దీనికి కారణం గతంలో ఎంపీగారు రెచ్చిపోవడమే. నిజానికి శివప్రసాద్ చంద్రబాబుకి బాగా సన్నిహితుడు. దీంతో చంద్రబాబే ఆయన్ని రాజకీయంగా చాలా ప్రోత్సహించారు. ముందు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆ తరువాత ఏకంగా...  ఎంపీ గా గెలిపించి చేయి అందించారు. అంతే ఎంపీ గారికి కొమ్ములొచ్చినట్టు ఉన్నాయి. అందుకే సొంత పార్టీపైనే విమర్శలు చేసే స్థాయికి ఎదిగారు. 2014 ఎన్నికల్లో గెలిచిన కొద్ది కాలానికే.. వ్యక్తిగత డిమాండ్స్ తీరలేదన్న కోపంతో పార్టీ ని ఇబ్బంది పెట్టే చర్యలకు దిగారు. కొన్ని సభలు , వేదికల మీదే పార్టీ కి నష్టం చేసే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను బుజ్జగించడానికి ప్రయత్నించిన నేతల మీద కూడా ఫైర్ అయ్యారు. ఈ విషయం బాబు చెవిన పడడంతో ఆయన కూడా శివ ప్రసాద్ తో మాట్లాడినా ఎంపీ గారి ధోరణి మారలేదు సరికదా వైసీపీ కి వెళుతున్నట్టు పార్టీని బెదిరించే సంకేతాలు ఇచ్చారు.

 

ఇప్పుడు ఏమైంది.. ఎంపీగారికి బాగా తెలిసొచ్చినట్టు ఉంది. ఒక్క నంద్యాల ఉపఎన్నికతో అటు చాలా మంది నేతలకు, బీజేపీకి, టీడీపీని ఎదురిస్తున్న వారికి బాబు సమాధానం చెప్పారు. అంతే అందరూ తోక ముడుచుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం వైసీపీ పరిస్థితి ఏంటో అందరికీ అర్దమయింది. సొంత పార్టీ నేతలే పార్టీని వీడుతున్నారు. ఇప్పుడు ఎంపీ గారికి కూడా బాగా తెలిసొచ్చి బాబు గారిని కాక పట్టే పనిలో పడ్డారట. అందుకే టీడీపీ హైకమాండ్ తో అంటే చంద్రబాబు గుడ్ లుక్స్ లో పడేందుకు ఆయన నానా పాట్లు పడుతున్నారంట. కానీ బాబు గారు ఒక్కసారి పక్కన పెడితే వాళ్ల వైపు చూడటం కష్టమైన పనే. అందుకే శివప్రసాద్ చేసిన హంగామాతో.. ఎప్పటికప్పుడు దూరంగా వుంటూ వస్తున్నారట. అయ్యగారు చెప్పే హరికథలు, బుర్ర కధలు వినడానికి ఆసక్తి చూపడం లేదట. దీంతో సీన్ అర్ధం చేసుకున్న శివప్రసాద్ బాబు సన్నిహితులతో సారీ లు చెబుతూ ఆయన కోపం తగ్గేలా చూడమని ప్రాధేయపడుతున్నారంట. మరి ఆవేశంతో ఎగరడం ఎందుకు.. మళ్లీ కాళ్లు పట్టుకోవడం ఎందుకు..

By
en-us Political News

  
రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ.. రెండూ కూడా రైతుల కష్టాలను ప్రధాన అస్త్రంగా చేసుకుని రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత మార‌నున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను బ‌ట్టి తెలంగాణలో ఈ రాజకీయ వేడి మరింత రాజుకునే అవకాశం క‌నిపిస్తోంది.
లోకేష్‌తో పాటు ఇటీవల ప్రకటించిన 252 మందితో కూడిన జాతీయ, రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గం కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసింది. కీలక నేతలందరూ పార్టీ పట్ల తమ విధేయతను ప్రకటిస్తూ బాధ్యతలు స్వీకరించారు.
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.