రోజు 10 నిమిషాల ధ్యానం.. ఆలోచనా శక్తినే మార్చేసే అద్భుత మార్గం.. !

Publish Date:Sep 15, 2026

Advertisement

రోజు 10 నిమిషాల ధ్యానం.. ఆలోచనా శక్తినే మార్చేసే అద్భుత మార్గం.. !

ఈనాటి ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, మానసిక అలసట, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు సర్వసాధారణమైపోయాయి. పరిగెత్తే కాలంతో పాటు ఆలోచనలు కూడా అంతే వేగంగా పరిగెడుతున్నాయి. ఇలాంటి సమయంలో  మనస్సుకు కాస్త విశ్రాంతినిచ్చి, ఆలోచనా శక్తిని పునర్నిర్మించుకోవడానికి రోజుకు పది నిమిషాల ధ్యానం ఒక దివ్యౌషధంగా పనిచేస్తుంది. ధ్యానం అనగానే గంటల తరబడి పద్మాసనంలో కూర్చోవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ కేవలం పది నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేయడం వల్ల  మెదడు పనితీరులో, ఆలోచనా సరళిలో ఊహించని మార్పులు వస్తాయని ఆధునిక సైన్స్ కూడా నిరూపించింది. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..

మెదడు మీద ప్రభావం..

మన మెదడులోని నాడుల నిర్మాణం నిరంతరం మారుతూ ఉంటుంది. దీనిని సైన్స్ భాషలో న్యూరోప్లాస్టిసిటీ అంటారు. రోజువారీ ధ్యానం ఈ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. క్రమం తప్పకుండా ప్రతిరోజూ పది నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల మెదడులో శ్రద్ధ, ఏకాగ్రత, నిర్ణయాధికారాన్ని నియంత్రించే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ భాగం బలపడుతుంది. దీనివలన క్లిష్టమైన సమస్యలను సహజంగా, వేగంగా పరిష్కరించే ఆలోచనా శక్తి పెరుగుతుంది. ఎటువంటి పరిస్థితిలోనైనా స్థిరంగా ఆలోచించే సామర్థ్యం అలవడుతుంది.
అలాగే, భయం, ఆందోళన, ఒత్తిడికి కారణమయ్యే మెదడులోని అమిగ్డాలా అనే భాగం యొక్క పరిమాణం ధ్యానం వల్ల తగ్గుతుంది. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందే అలవాటు పోయి, ప్రతి సమస్యను సానుకూల దృక్పథంతో చూడటం ప్రారంభమవుతుంది.

స్పష్టత..

ఆలోచనల్లో స్పష్టత వచ్చి, వ్యర్థమైన భావోద్వేగాలను తగ్గించుకోవడానికి ఇది ఎంతో సహాయపడుతుంది.
పది నిమిషాల ధ్యానం మన దృష్టి కేంద్రీకరించే సామర్థ్యాన్ని అద్భుతంగా మెరుగుపరుస్తుంది. నేటి డిజిటల్ యుగంలో అనేక విషయాల వల్ల  ఏకాగ్రత సులభంగా చెదిరిపోతుంది. రోజువారీ ధ్యాన సాధన వల్ల మైండ్ ఫుల్ నెస్ పెరుగుతుంది. అంటే చేసే ప్రతి పనిపై పూర్తి శ్రద్ధ పెట్టగలుగుతాం. ఇది పనిలో ఉత్పాదకతను, నాణ్యతను పెంచడమే కాకుండా, సృజనాత్మక ఆలోచనలు రావడానికి మార్గం సుగమం చేస్తుంది.

ఎమోషన్స్..

ధ్యానం వల్ల భావోద్వేగ స్థిరత్వం లభిస్తుంది. మన ఆలోచనలకు, శారీరక స్పందనలకు నడుమ ఉన్న సంబంధాన్ని ఇది బలోపేతం చేస్తుంది. కోపం, అసహనం, నిరాశ వంటి ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు వాటికి ప్రతిస్పందించే ముందు ఒక క్షణం ఆలోచించే విచక్షణ లభిస్తుంది. ఇది  సంబంధ బాంధవ్యాలను మెరుగుపరచడమే కాకుండా, మానసిక ప్రశాంతతను అందిస్తుంది.

ఈ అద్భుతమైన అలవాటును ప్రారంభించడం కూడా చాలా సులభం. ఉదయం నిద్ర లేవగానే లేదా రాత్రి పడుకునే ముందు ఒక ప్రశాంతమైన స్థలాన్ని ఎంచుకోవాలి. వెన్నుముక నిటారుగా ఉంచి కూర్చుని, కళ్ళు మూసుకుని శ్వాసపై మాత్రమే దృష్టి పెట్టాలి. గాలి లోపలికి వెళ్లడం, బయటకు రావడం గమనించాలి. మొదట్లో ఆలోచనలు చెల్లాచెదురుగా రావడం సహజం, కానీ వాటిని ఆపడానికి ప్రయత్నించకుండా కేవలం గమనిస్తూ మళ్లీ శ్వాసపై దృష్టి సారిస్తే సరిపోతుంది.

రోజుకు కేవలం పది నిమిషాల సమయం మన జీవితంలో చాలా చిన్నది. కానీ ఈ చిన్న సమయం మన మానసిక ఆరోగ్యంలో, ఆలోచనా విధానంలో, మొత్తం జీవన నాణ్యతలో తీసుకొచ్చే మార్పు మాత్రం వర్ణించలేనిది. ప్రశాంతమైన జీవితం, స్పష్టమైన ఆలోచనలు కావాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ పది నిమిషాల సాధనను తమ జీవితంలో భాగం చేసుకోవడం ఎంతో మంచిది.


                   *రూపశ్రీ.

 

By
en-us Political News

  
మనిషి జీవితం సక్సెస్ గా ఉండటానికి, కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగడానికి ఆచార్య చాణక్య చెప్పిన విషయాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
చర్మ సౌందర్యానికి డ్రాగన్ ఫ్రూట్ ఎలా ఉపయోగపడుతుంది? మెరిసే, మృదువైన చర్మాన్ని సొంతం చేసుకోవడానికి సింపుల్ DIY ఫేస్ మాస్క్‌లు మరియు అద్భుతమైన బ్యూటీ బెనిఫిట్స్ పూర్తి వివరాలు.
ప్రతిరోజూ తలస్నానం చేయడం వల్ల జలుబు వస్తుందనే అపోహ నిజమేనా? చల్లటి నీరు, తడి జుట్టు మరియు రోజూ షాంపూ వాడకం గురించి ఆరోగ్య నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి.
కాలుష్య గాలిలో ఒక గంటపాటు ఆరుబయట వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులు, గుండె మరియు మెదడుపై పడే తీవ్ర ప్రభావం గురించి నిపుణులు ఏమి చెబుతున్నారో తెలుసుకోండి.
చలికాలంలో గాలిలో తేమ తగ్గి పెదవులు పగిలిపోవడం సర్వసాధారణం. పెదవులను మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మరియు పొడిబారకుండా కాపాడుకోవడానికి 7 సులభమైన దినచర్య అలవాట్లు మరియు నిపుణుల చిట్కాలను తెలుసుకోండి.
షుగర్ పేషెంట్లు రాత్రి పూట డిన్నర్ లోకి రైస్ తినాలా లేదా చపాతీ తినాలా? ప్రముఖ డాక్టర్ దీప్తి కరేటి చెప్పిన ఆరోగ్యకరమైన చిట్కాలు మరియు కార్బోహైడ్రేట్ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
మాంసం కూరలను తలదన్నే రుచితో, రైతన్నల బలానికి రహస్యమైన పచ్చి కూరగాయల రోటి పచ్చడిని ఎలా తయారు చేయాలో తెలుసుకోండి. సులభమైన పదార్థాలతో విలేజ్ స్టైల్ పచ్చడి తయారీ విధానం.
విద్య లేని వాడు వింత పశువు అన్నారు. కానీ నేటికాలంలో చదువు ప్రతి వ్యక్తికి ప్రాథమిక హక్కుగా మారింది
జపాన్‌కు చెందిన ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ హిదేకి వాడా రచించిన ది 80 ఇయర్ వాల్ పుస్తకం ఆధారంగా వృద్ధుల మానసిక మరియు శారీరక ఆరోగ్యం కోసం అందించిన 44 విలువైన సూచనలు, ఆరోగ్య చిట్కాలు మరియు విశేషాల పూర్తి సమాచారం.
భారతీయ వంటింట్లో కొబ్బరి ప్రధాన ఆహార పదార్థం. కూరలో వేయడమే కాకుండా పచ్చళ్ళు, పొడులు, స్వీట్లు .. ఇలా చాలా రకాలుగా కొబ్బరిని వినియోగిస్తారు.
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తులు కలసి ఒకే ఇంట్లో ఉండటం మాత్రమే కాదు. కాలంతో పాటు ఉద్యోగ బాధ్యతలు,
పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే పవిత్రమైన బంధం. ఈ బంధం ప్రేమ, నమ్మకం మీద గట్టిగా నిలబడుతుంది.
జీవితంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఏ విషయాలను ఎవరితో పంచుకోవాలి అనే అంశంపై ఆచార చాణక్యుడు చెప్పిన విషయాలు ఎప్పటికీ ఎంతో విలువైనవిగా నిలుస్తాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.