హైదరాబాద్ నగర పరిధి లోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి బహదూర్‌పల్లి గ్రీన్ హిల్స్ కాలనీలో గురువారం (ఏప్రిల్ 9) ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. డెకరేషన్ సామాగ్రి నిల్వ ఉంచిన గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగి స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాయి. గోదాములో ఉన్న ప్లాస్టిక్ డెకరేషన్ వస్తువులు, ఫ్లెక్సీలు, థర్మాకోల్ సామాగ్రి పెద్ద మొత్తంలో ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి.
పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతూ కొద్దిసేపటికే గోదాం పక్కనే ఉన్న నివాస గృహానికి కూడా వ్యాపించడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఆ గోదాములో ఉన్న ప్లాస్టిక్ సామాగ్రి కాలిపోవడంతో దట్టమైన నల్లటి పొగ కాలనీ మొత్తం వ్యాపించి స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసిం ది. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/massive-fire-accident-in-dundigal-36-216980.html
ఒప్పందంలో లెబనాన్ పై దాడులు జరపకూడదని లేదంటూ ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడులకు తెగబడటమే. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్.. హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసేసింది. ఇజ్రాయెల్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇరాన్ అంటుంటే.. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్‌ను చేర్చలేదని చెప్పుకు వస్తున్నది.
ఒకే ఒక్క పరుగు తేడాతో విజయం గుజరాత్ టైటాన్స్ ను వరించింది. స్టేడియంలో చూస్తున్న ప్రేక్షకులే కాదు.. టీవీల ముందు కూర్చుని ఈ మ్యాచ్ ను తిలకించిన వీక్షకులను సైతం మునివేళ్ల మీద నిలబెట్టేసేంత ఉత్కంఠగా ఈ మ్యాచ్ సాగింది. అయితే.. ఇదే మ్యాచ్ పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి.
రూ.72,000 కోట్ల గ్రేట్ నికోబార్ పోర్ట్ ప్రాజెక్ట్ ఒక ప్రధాన రాజకీయ వివాదాంశంగా మారింది. హిందూ మహాసముద్రంలో చైనా నౌకాదళ ఉనికిని ఎదుర్కోవడానికి ఇది ఒక కీలకమైన వ్యూహాత్మక ఆస్తి అని బీజేపీ ప్రచారం చేస్తుండగా, సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్, ఇది తీవ్రమైన పర్యావరణ విధ్వంసానికి, స్థానిక గిరిజన హక్కులకు హాని కలిగించే ఒక ప్రణాళికాబద్ధమైన దుస్సాహసం అని వ్యతిరేకిస్తోంది.
సైబర్ క్రైమ్ బృందం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నెట్‌వర్క్ నిఘా, ఐఎంఈఐ ట్రేసింగ్ వంటి పద్ధతులను వినియోగించి ఈ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకుంది.
మొజ్తబా ఖమేనీ.. కుటుంబంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అత్యంత విషాదకరంగా, గందరగోళంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఉన్న సమాచారాన్ని బట్టీ చూస్తే.. ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో.. ఇరాన్ సీనియర్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ.. చనిపోయిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ గా ఖమేనీ కుమారుడు మోజ్తబా ఖమేనీ ఉన్నారు. అయితే ఆయన ప్రస్తుతం కోమ్ నగరంలోని ఒక ఆస్పత్రిలో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది.
ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బుధవారం (ఏప్రిల్ 8) రాష్ట్ర సచివాలయంలో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా ఆ బృందం అమరావతి నిర్మాణ ప్రగతిని ప్రశంసించింది.
జాబిల్లి యాత్రలో ఐఫోన్ల సందడి.. అంతరిక్షంలో ఆపిల్ స్మార్ట్‌ఫోన్ల ప్రయోగం సక్సెస్!
అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిస్వా శర్మ భార్యపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల
రేణుక, మంద కృష్ణ ఇద్దరూ ఫైర్ బ్రాండ్లు కులం మెచ్చిన సామాజిక వీరులు
సోషల్ మీడియా వేదికలో అభ్యంతరకరంగా, దూషణాత్మకంగా వ్యాఖ్యలు పోస్టు చేసిన వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం జలవిహార్ వద్ద ఉన్న నీటి సరఫరా ఆర్వో ప్లాంట్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త అందించింది.
మాములుగా దక్షిణాదిలో అత్యంత సంపన్న పొలిటీషియన్లలో విజయ్ కూడా ఒకరు.