మళ్లీ హెర్మూజ్ మూసివేత.. ఇజ్రాయెల్ లెబనాన్ మెలికే కారణం!
Publish Date:Apr 9, 2026
Advertisement
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధానికి ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో బ్రేక్ పడింది. అయితే హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకునేలోగానే.. కాల్పుల విరమణ ప్రకటన వెలువడి 24 గంటలు గడవక ముందే.. పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఇందుకు కారణం.. ఈ ఒప్పందంలో లెబనాన్ పై దాడులు జరపకూడదని లేదంటూ ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడులకు తెగబడటమే. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్.. హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసేసింది. ఇజ్రాయెల్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇరాన్ అంటుంటే.. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్‌ను చేర్చలేదని చెప్పుకు వస్తున్నది. ఇక్కడ అగ్రరాజ్యాధినేత.. ట్రంప్ కూడా ఇజ్రాయెల్ కు వంతపాడుతుండటంతో మళ్లీ పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో కీలకమైన హర్మూజ్ జల సంధిని ఇరాన్ మూసివేసింది. ఈ విషయాన్ని అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది. ఇరాన్, అమెరికాలు రెండు వారాల కాల్పుల విరమణపై బుధవారం (ఏప్రిల్ 9) ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ విరమణలో ప్రధాన కండీషన్ ప్రపంచ చముర సరఫరాకు అత్యంత ముఖ్యమైన హర్మూజ్ జలసంధిని తెరవడమే. ఇందుకు ఇరాన్ కూడా అంగీకరించింది. ఆ మేరకు ప్రకటన కూడా చేసింది. ఇరాన్‌తో కాల్పుల విరమణకు అమెరికా తీసుకున్న నిర్ణయానికి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు బహిరంగంగా మద్దతు ప్రకటించాడు. అలా ప్రకటిస్తూనే లెబనాన్ మెలిక పెట్టారు. ఆ మెలికే ఇప్పుడు పరిస్థితి మరోసాకి మొదటికి రావడానికి కారణమైంది. మళ్లీ హెర్మూజ్ జలసంధి మూతపడటంతో చమురు రవాణా గొలుసు తెగిపోయినట్లైంది.
http://www.teluguone.com/news/content/strait-of-hormuz-closure-again-36-216992.html





