డీసీ వర్సెస్ జీటీ మ్యాచ్ ఫిక్సయ్యిందా?
Publish Date:Apr 9, 2026
Advertisement
ఐపీఎల్ 2026 ఉత్కంఠభరిత పోరాటాలకు, వివాదాలకూ నిలయంగా మారింది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర చర్చకు దారితీసింది. గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ గుజరాత్ అనూహ్యంగా ఓడిపోవడం, ముఖ్యంగా వెటరన్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ ప్రవర్తించిన తీరు ఇప్పుడు ఫిక్సింగ్ అనుమానాలకు తావిస్తోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 70, జోస్ బట్లర్ 52, వాషింగ్టన్ సుందర్ 55 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌లతో జట్టు భారీ స్కోరు చేసింది. ఇక 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కూడా దీటుగా ఆడింది. ముఖ్యంగా కేఎల్ రాహుల్ 92 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ అద్భుత బ్యాటింగ్‌తో డీసీ విజయానికి చేరువగా వచ్చింది. కేవలం ఎనిమిది పరుగుల తేడాతో రాహుల్ సెంచరీ మిస్ అయ్యాడు. ఒక వైపు వికెట్లు క్రమం తప్పకుండా పడుతున్నా రాహుల్ మాత్రం మొక్కవోని పట్టుదలతో బ్యాటింగ్ కొనసాగించాడు. రాహుల్ అవుటైన తరువాత గుజరాత్ మళ్లీ గేమ్ లోకి వచ్చినట్లైంది. ఇరు జట్లతోనూ విజయం బంతిబంతికీ దోబూచుటాడినట్లుగా తయారైంది పరిస్థితి. అయితే చివరి ఓవర్ లో డీసీ బ్యాటర్ల తీరే ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలకు కారణమైంది. ఆ ఓవర్ లో మిల్లర్ కొట్టిన ఒక షాట్ బౌండరీ లైన్‌పై పడితే.. అది సిక్సా, ఫోరా అని పరిశీలించకుండానే అంపైర్లు ఫోర్‌గా ప్రకటించడం గమనార్హం. థర్డ్ అంపైర్ రీప్లేలను కూడా క్షుణ్ణంగా చూడకుండానే నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇక చివరి రెండు బంతుల్లో విజయానికి సులభంగా సింగిల్ తీసే అవకాశం ఉన్నప్పటికీ మిల్లర్ పరుగెత్తడానికి నిరాకరించడం మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలకు తావిస్తోంది. విజయానికి అత్యంత చేరువగా వచ్చి కూడా ఇలాంటి తప్పిదాలు చేయడం వెనుక ఏదైనా లోపాయికారీ ఒప్పందం ఉందా అని అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన అనుభవం ఉన్న మిల్లర్, ఇలాంటి తప్పులు చేయడం యాదృచ్ఛికం కాదని కొందరు వాదిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/--dc-vs-gt-match-fixing-allegations-36-216989.html





