కోమాలో మోజ్తబా ఖమేనీ?
Publish Date:Apr 9, 2026
Advertisement
మొజ్తబా ఖమేనీ.. కోమాలో ఉన్నారా? ఇప్పటికే ఆయన తన తండ్రి కొడుకుతో సహా ఎందర్ని కోల్పోయారు? ఆయన బంధు మిత్రుల్లో చనిపోయిన వారెవరు? ఆయన సమాధి పనులు జరుగుతున్నాయా? ఈ విషయంలో ప్రస్తుతం ఉన్న సమాచారమేంటి? అని అన్వేషించగా.. ఇంటెలిజెన్స్ రిపోర్టులు కొన్ని కీలకమైన విషయాలను వెలుగులోకి తెస్తున్నాయి. మొజ్తబా ఖమేనీ.. కుటుంబంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అత్యంత విషాదకరంగా, గందరగోళంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఉన్న సమాచారాన్ని బట్టీ చూస్తే.. ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో.. ఇరాన్ సీనియర్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ.. చనిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ గా ఖమేనీ కుమారుడు మోజ్తబా ఖమేనీ ఉన్నారు. అయితే ఆయన ప్రస్తుతం కోమ్ నగరంలోని ఒక ఆస్పత్రిలో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన లేక పోతున్నారనీ.. ప్రస్తుతానికి పరిపాలన అంతా తెరవెనకే జరుగుతోందని అంటున్నారు. ఫిబ్రవరి 28న టెహ్రాన్ పై జరిగిన వైమానిక దాడుల్లో ఖమేనీ కుటుంబం భారీ ప్రాణ నష్టం చవి చూసినట్టు తెలుస్తోంది. మోజ్తబా ఖమేనీ తన సన్నిహిత బంధువులను కోల్పోయినట్టు తెలుస్తోంది. తండ్రి ఖమేనీతో పాటు.. భార్య జహ్రా హద్దాత్ సైతం ఈ దాడుల్లో చనిపోయినట్టు తెలుస్తోంది. ఇక మోజ్తబా టీనేజ్ కుమారుడు మొహమద్ బాకర్ సైతం చనిపోయినట్టు సమాచారం. ఆయన సోదరి, ఆమె భర్త వారి పధ్నాలుగు నెలల చిన్నారి కూడా ఈ దాడుల్లో ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఒకే రోజున మోజ్తబా తన తండ్రి, భార్య, కుమారుడు, సోదరి కుటంబాన్ని కోల్పోవడం అత్యంత పెద్ద విషాదం. సాధారణంగా ఇరాన్ నాయకులను మషద్ అనే నగరం లో ఖననం చేస్తారు. కానీ, ప్రస్తుతం అందుతున్న నివేదికల ప్రకారం కోమ్ నగరంలో భారీ ఎత్తున సమాధి పనులు జరుగుతున్నాయి. అక్కడ కేవలం ఒకరి కోసమే కాకుండా, కుటుంబ సభ్యులందరినీ ఒకే చోట ఖననం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు శాటిలైట్ చిత్రాలు, ఇతర ఇంటెలిజెన్స్ నివేదికలు సూచిస్తున్నాయి. మొజ్తబా ఖమేనీ పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో, ఆయన కోసం కూడా ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అప్పటికీ మోజ్తబా ఖమేనీ క్షేమంగా ఉన్నారని చూపించడానికి ఇరాన్ ప్రభుత్వం ఇటీవల కొన్ని వీడియోలను విడుదల చేసింది. అయితే, అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రూపొందించిన నకిలీ వీడియోలని గుర్తించారు, దీంతో ఆయన ఆరోగ్యంపై అనుమానాలను మరింత పెరిగాయి. ప్రస్తుతానికి ఇరాన్ ప్రభుత్వం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అందుతున్న సమాచారం ప్రకారం ఆయన ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నట్టు తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/ayatollah-mojtaba-khamenei-in-koma-36-216979.html





