విజయ్ కన్నా ఎక్కువ...ఆస్తులు గల మహిళా అభ్యర్ధి ఎవరంటే?
Publish Date:Apr 8, 2026
Advertisement
మాములుగా దక్షిణాదిలో అత్యంత సంపన్న పొలిటీషియన్లలో విజయ్ కూడా ఒకరు. ఇటీవల ఆయన ప్రకటించిన ఆస్తుల వివరాలను బట్టీ చూస్తే.. తమిళనాట ఆయనే టాప్ అన్నారు. కానీ, కట్ చేస్తే లీమా రోజే అనే ఒక మహిళా అభ్యర్ధిని విజయ్‌ని మించిపోయారు. ఇంతకీ ఈ లీమా రోజ్ ఆస్తులెన్నో చూస్తే.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడుతున్న వారిలో అత్యంత ధనిక అభ్యర్థి మహిళ కావడం విశేషం ఆమె పేరే- లీమా రోజ్. తిరుచ్చి జిల్లా లాల్గుడి నియోజకవర్గం నుంచి అన్నా డిఎంకె పార్టీ నుంచి బరిలో వున్నారు. ఆమె కుటుంబ ఆస్తి విలువ అక్షరాలా రూ.5863 కోట్లు. ఆమె వ్యక్తిగత ఆస్తి 1049 కోట్లు. విజయ్ ఆస్తులు ఆరు వందల కోట్లకన్నా మించి లేవు. దీంతో ఈమె ఎన్నికలు జర్కుండానే విజయ్ ని ఆస్తుల పరంగా ఓడించేశారు. లాటరీ టికెట్ల విక్రయ సంస్థ అధినేత శాంటియాగో మార్టిన్ ఆమె భర్త. లీమా రోజ్ వయసు 58. ఇటీవలే ఆమె రాజకీయ ప్రవేశం చేశారు. అన్నాడిఎంకె పార్టీలో చేరారు. గతంలో ఆమె ఇండియ జననాయకన్ కట్చిలో ఉండేవారు. ఆ తర్వాత అన్నాడీఎంకే పార్టీకి వచ్చి.. ఈ పార్టీకి భారీ విరాళం కూడా ఇచ్చారు. నామినేషన్ అఫిడవిట్ లో ఆమె పేర్కొన్న ఆస్థుల వివరాల ప్రకారం చూస్తే...19 కిలోల బంగారం, 1217 క్యారట్ల వజ్రాభరణాలు, 13 కిలోల వెండి, 33 గ్రాముల ప్లాటినం ఉన్నట్లు సమాచారం. 139.63 కోట్ల చరాస్థులు, 909.94 కోట్ల స్థిరాస్థులు ఉన్నాయి. సహజంగా డబ్బున్నోళ్లకు అప్పులు ఎలాగూ ఉంటాయి కాబట్టి ఆమెకు కూడా 8.57 కోట్ల అప్పు కూడా ఉందట. భర్త మార్టిన్ పేరిట 4100 కోట్లు పైచిలుకు ఆస్థులు వున్నాయట. ఆయన పేరిట నగలు చూస్తే...281 గ్రాములు బంగారం, 9.83 క్యారెట్ల వజ్రాలు, 21 కిలోల వెండి, 321 గ్రాములు ప్లాటినం ఆభరణాలు ఉన్నట్లు వెల్లడించారు. ఇంతా చేస్తే ఆమె చదివింది ఆరవ తరగతి మాత్రమే. పైగా ఆమెపై నాలుగు కేసులు కూడా వున్నాయట. లాల్గుడి ఓటర్లు ఆమెపై పెద్ద ఆశలే పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఓటుకు కనీసం మూడు నుంచి ఐదు వేల వరకు ఇస్తున్నదని బెట్టింగులు వేసుకుంటున్నారట. మొత్తానికి లీమా గెలుపు ఖాయం అంటున్నారు. చట్టసభలోకి అడుగు పెట్టనివ్వండి. లాల్గుడి నియోజకవర్గం ఎలా అభివృద్ధి జరుగుతుందో చూడండి.. అని లీమా రోజ్ అంటున్నారు. ఆమె ప్రచార పర్వంలో వేలాదిమంది యువతకు ఉపాధి లభించింది. చదువు లేకున్నా డబ్బు వుంది కాబట్టి ఇలాంటి వారిని గెలిపిస్తే ఆ నియోజకవర్గం బాగుపడుతుంది. ఆమె మార్టిన్ చారిటీ ఫౌండేషన్ పేరిట ఎన్నో ఏళ్లుగా సేవ కూడా చేస్తుండటం విశేషం. అదండీ లీమా రోజ్ అనే ఈ లేడీ సడెన్ స్టార్ కథ. కమామిషు. ఇప్పటి వరకూ ఇన్ని కోట్ల ఆస్తులుండి కూడా ఉలుకూ పలుకూ లేకుండా ఉన్న ఈమె పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగుతూనే ఉంది. కారణం రాజకీయాల్లోకి రావడం. ఎన్నికల అఫిడవిట్లో తనకున్న వేల కోట్ల ఆస్తులను పొందుపరచడం వల్ల.. ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చేశారు లీమా రోజ్.
http://www.teluguone.com/news/content/dmk-party-candidate--lima-raj-36-216967.html





