Publish Date:Apr 15, 2026
హైదరాబాద్‌లో నిజాం కాలం నాటి ఆభరణాల పేరుతో 50 కోట్ల రూపాయల మోసం ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. బంజారాహిల్స్‌కు చెందిన వ్యాపారవేత్త రాజేష్ అగర్వాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
నగరానికి చెందిన మరో వ్యాపారవేత్త ఎండీ జాకీర్ ఉస్మాన్, బషీర్‌బాగ్‌కు చెందిన జువెలర్ సుఖేష్ గుప్తా కలిసి నిజాం కాలం నాటి విలువైన ఆభరణాల్లో వాటా ఇస్తామని చెప్పి తన నుంచి భారీగా డబ్బులు తీసుకున్నారని అగర్వాల్ ఆరోపిస్తున్నారు. ఈ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ నెల 9న కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా గుప్తా ఇప్పటికే మనీలాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తును ఎదుర్కొంటున్నాడు.
నిజాం కాలం నాటి ఐదు ఆభరణాల పెట్టెలు ప్రభుత్వ కస్టడీలో చిక్కుకుపోయాయనీ, చట్టపరమైన ఖర్చులు భరించి వాటిని విడుదల చేయిస్తామని నిందితులు హామీ ఇచ్చినట్లు అగర్వాల్ చెబుతున్నారు. దీంతో 2016 జూన్ నుంచి 2018 ఫిబ్రవరి మధ్య తాను రూ.50.8 కోట్లు వివిధ కంపెనీల ద్వారా బదిలీ చేశానని ఆయన పేర్కొన్నారు. కానీ ఆభరణాలు విడుదలకు దగ్గరపడిన సమయంలోనే అసలు కథ బయటపడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆభరణాల విడుదలకు ఇచ్చిన నిధులను ఇతర అవసరాలకు మళ్లించ డంతో పాటు, ఆభరణాలను స్వతంత్రంగా తమ పేర్లతో స్వాధీనం చేసుకుని విక్రయించే ప్రయత్నం చేశారని అగర్వాల్ ఆరోపించారు. ఈ విషయంపై ఇప్పటికే సివిల్ కోర్టులో కేసు వేసినట్టు తెలిపారు.
ఈ ఆభరణాలకు దాదాపు ఆరు దశాబ్దాల చరిత్ర ఉందని పోలీసులు చెబుతున్నారు. 1958లో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు నిజాం ఆభరణాలను వారసుల నుంచి రిజిస్టర్డ్ అసైన్‌మెంట్ డీడ్ ద్వారా కొనుగోలు చేసినట్లు రికార్డులు సూచిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ ఆభరణాలు ప్రభుత్వ కస్టడీలో ఉన్నాయని అధికారులు తెలిపారు. అయితే ఆ ఐదు పెట్టెల్లో అసలు ఏముంది? వాటి విలువ ఎంత? అన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉందని పోలీసులు చెబుతున్నారు. క్రిమినల్ బ్రిచ్ ఆఫ్ ట్రస్ట్‌కు సంబంధించిన ఐపీసీ సెక్షన్ 406, కామన్ ఇంటెన్షన్ సెక్షన్ 34 కింద ఉస్మాన్ మరియు గుప్తలపై కేసు నమోదు చేశారు. నిందితుల వాంగ్మూలాలను సేకరించి ఆర్థిక లావాదేవీలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. నిజాం ఆభరణాల పేరుతో ప్రారంభమైన ఈ భారీ డీల్… ఇప్పుడు భారీ మోసం కేసుగా మారి నగర వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/massive-50-crore-fraud-in-nizam-jewels-deal-36-217391.html
నగరంలోని వాణిజ్య సముదాయాలు, మార్కెట్లు, ప్రధాన కూడళ్ల వద్ద పార్కింగ్ స్థలం లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల రహదారులు ఇరుకుగా మారి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు కీలక ప్రాంతాలను గుర్తించి.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పీపీపీ పద్ధతిలో ఈ అత్యాధునిక పార్కింగ్ భవనాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.
ఈ భారీ ప్రాజెక్టును వీఎంఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్ 2041లో భాగంగా చేర్చారు. ఈ సెమీ రింగ్ రోడ్డు అనకాపల్లి, పెందుర్తి, ఆనందపురం వంటి కీలక ప్రాంతాలను కలుపుతూ సాగుతుంది. దీనివల్ల నగర ప్రధాన ప్రాంతాల్లోకి ప్రవేశించాల్సిన అవసరం లేకుండానే వాహనాలు ఒక వైపు నుంచి మరో వైపుకు సులభంగా చేరుకుంటాయి. ముఖ్యంగా భారీ రవాణా వాహనాలు నగరం వెలుపలి నుంచే వెళ్లేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
బండి భగీరథ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. జ్యోతినగర్‌కు చెందిన ఒక యువతితో అతనికి స్నేహం ఏర్పడింది. కొంతకాలానికి ఆ యువతి అతనిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. అయితే.. భగీరథ్ పెళ్లికి నిరాకరించడంతో పరిస్థితి మలుపు తిరిగింది. ఆ యువతి, ఆమె తల్లిదండ్రులు కలిసి అతనిపై క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించారు.
పసిఫిక్ మహాసముద్రంలోని తూర్పు, మధ్య ప్రాంత ఉపరితల ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయనీ, దీనివల్ల దేశంలో వర్షపాతం గణనీయంగా తగ్గి.. కరువు పరిస్థితులు ఏర్పడే ముప్పు ఉందని తెలిపింది. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందనీ, అందువల్ల సాగునీటి కొరత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
మన దేశానికి చెందిన ఆరు విభిన్నమైన వంటకాలు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో స్థానం సంపాదించుకోవడం గమనార్హం. కేవలం రుచితోనే కాకుండా, భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటిచెప్పే ఈ వంటకాలు ఇప్పుడు ప్రపంచ స్థాయి గుర్తింపును దక్కించుకున్నాయి.
గోదావరి జలాల పంపిణీ అంశాన్ని పునఃసమీక్షించేందుకు ఒక ప్రత్యేక ట్రైబ్యునల్‌ను నియమించాలని చంద్రబాబు ఈ భేటీలో కేంద్ర మంత్రిని కోరనున్నారు. అలాగే గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న సమ్మక్క సారలమ్మ బ్యారేజీ నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఆయన విజ్ఞప్తి చేయనున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. నెలరోజులలోనే రెండు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం నిజంగా చారిత్రాత్మకమని చెప్పవచ్చు.
సత్యవేడులో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన యూనిట్‌ను ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చంద్రబాబు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన ఆసక్తికర పోస్టు ఇప్పుడు తెగ వైరల్ అయ్యింది.
మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ముసాయిదా నివేదికను (డీపీఆర్) ఈ సందర్భంగా అధికారులు మంత్రుల ముందు ఉంచారు.
మనుషులు, స్తంభాలు, ఇతర నిటారుగా ఉన్న వస్తువుల నీడలు వాటి పాదాల కిందకే పరిమితమై.. బయటకు కనిపించవు. ఈ పరిస్థితి ఒకటి రెండు నిముషాల పాటు ఉంటుంది.
ఈ కాల్పుల విరమణ ఒప్పందం విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా తన సామాజిక మాధ్యవ మేదిక ట్రూత్ ద్వారా ప్రకటించారు. ఈ ఓప్పందం యుద్ధం ముగింపు దిశగా కీలక పురోగతి అని ఆయన పేర్కొన్నారు.
Fin Allen Sixers Fest in Delhi, easy, win, over, dc, ipl2026, 4th, concicutive
ఘటన సమయంలో ఇంటి పై అంతస్తులో ఇద్దరు పిల్లలు ఉండగా, తనూజ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒంటరిగా ఉన్నారు.
ఇంట్లో పని చేసే కల్పన అనే మహిళ బయట వ్యక్తులతో సంప్రదింపులు జరిపి ఈ నేరానికి సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.