ఐపీఎల్ 2026.. కొనసాగుతున్న కోల్ కతా పరాజయాల పరంపర
Publish Date:Apr 15, 2026
Advertisement
ఐపీఎల్ 2026 లో కోల్ కతా నైట్ రైడర్స్ పరాజయ పరంపర కొనసాగుతోంది. ఈ సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్ లు ఆడింది. అయితే ఒక్క మ్యాచ్ లో కూడా విజయం సాధించలేదు. నాలుగు మ్యాచ్ లలో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఒక మ్యాచ్ వర్షార్పణమైంది. దీంతో పాయింట్ల పట్టికలో అడుగు నుంచి తొలి స్థానంలో నిలిచింది. ఈ సీజన్ లో మంగళవారం (ఏప్రిల్ 14) కేకేఆర్ 32 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. 193 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 160 పరుగులు మాత్రమే చేసింది. కాగా ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. చెన్నై ఇప్పటి వరకూ ఆడిన ఐదు మ్యాచ్ లలో రెండింటిలో విజయం సాధించింది. మూడు మ్యాచ్ లలో పరాజయం పాలైంది. అయితే.. చెన్నై వరుసగా రెండో మ్యాచ్ గెలవడం, ఆ జట్టు స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ ఫామ్ లోకి రావడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.
http://www.teluguone.com/news/content/kolkata--losing-streak-continues-36-217399.html





