ఎల్ నినో ఎఫెక్ట్.. తాగు, సాగునీటికి తీవ్ర కొరత!

Publish Date:May 9, 2026

Advertisement

ఎల్‌నినో ప్రభావం ఇండయాపై తీవ్రంగా ఉండనుంది.   ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సమతుల్యతను దెబ్బతీసే  ఎల్ నినో ఈ సారి ఇండియాపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఇన్ కాయిస్) పేర్కొంది.   పసిఫిక్ మహాసముద్రంలో చోటుచేసుకుంటున్న అసాధారణ మార్పుల వల్ల కారణంగా ఏర్పడే ఎల్ నినో ప్రభావం ఇండియాపై వచ్చే ఏడాది జనవరి వరకూ ఉంటుందని పేర్కొంది.  

పసిఫిక్ మహాసముద్రంలోని తూర్పు,  మధ్య ప్రాంత ఉపరితల ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయనీ,   దీనివల్ల దేశంలో వర్షపాతం గణనీయంగా తగ్గి..  కరువు పరిస్థితులు ఏర్పడే  ముప్పు ఉందని తెలిపింది.  ముఖ్యంగా నైరుతి రుతుపవనాలపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందనీ, అందువల్ల   సాగునీటి కొరత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 

ఈ అంచనాలను రూపొందించడానికి   అత్యంత అధునాతనమైన  బేయేసియన్ కన్వల్యూషనల్ న్యూరల్ నెట్‌వర్క్  (బీసీఎన్ఎన్) అనే డీప్ లెర్నింగ్ మోడల్‌ను ఉపయోగించారు. ఈ టెక్నాలజీ సహాయంతో వాతావరణంలో వచ్చే మార్పులను దాదాపు రెండేళ్ల ముందే పసిగట్టవచ్చు. ఈ మోడల్ విశ్లేషణ ప్రకారం..  రాబోయే రెండున్నరేళ్ల పాటు ఎల్‌నినో ప్రభావం కొనసాగుతుంది. ఇది గతంలో ఎన్నడూ లేని విధంగా వాతావరణ పరిస్థితులను అస్తవ్యస్తం చేసే ప్రమాదం ఉంది. 

సముద్ర మట్టంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కేవలం భూమిపైనే కాకుండా, సముద్ర గర్భంలోనూ పెను మార్పులు చోటు చేసుకుంటాయి. ఉత్తర హిందూ మహాసముద్రంలో సుదీర్ఘమైన  మెరైన్ హీట్ వేవ్స్ వస్తాయి.  దీనివల్ల సముద్ర పర్యావరణ వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా, చేపల వేటపై ఆధారపడే మత్స్యకారుల జీవనోపాధికి కూడా గండి పడుతుంది.  

గతంలో ఎల్‌నినో ప్రభావం వల్ల దేశంలో వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతిన్న సందర్భాలు ఉన్నాయి. 2023లో కూడా వర్షపాతం తగ్గడం వల్ల వరి, పప్పుధాన్యాల సాగుపై ప్రభావం పడింది. ప్రస్తుతం దేశంలోని ప్రధాన జలాశయాల్లో నీటి మట్టాలు ఆశాజనకంగా లేకపోవడంతో ఎల్ నినో ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందన్న ఆందోళన వ్యక్తమౌతోంది.   2027 వరకు ఇదే పరిస్థితి కొనసాగితే సాగునీటితో పాటు తాగునీటి ఎద్దడి కూడా ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వాలు,  రైతులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ నీటితో పండే పంటలను ప్రోత్సహించడం, నీటి పొదుపు చర్యలు చేపట్టడం వంటి ముందస్తు జాగ్రత్తలు అవసరమని పేర్కొంటున్నారు.  

By
en-us Political News

  
. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ కోహ్లీ కెరీర్‌లో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. కేవలం ఒకే ఫ్రాంచైజీ తరపున ఇన్ని మ్యాచ్‌లు ఆడటం కోహ్లీ అంకితభావానికి నిదర్శనంగా చెప్పవచ్చు.
మెదక్ జిల్లా మరోసారి శిశు విక్రయ ఘటనతో కలవరపాటుకు గురైంది.
సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJ) జస్టిస్ లీసా గిల్‌ కు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను పెంచింది.
గత కొద్ది కాలంగా ఇరాన్‌పై అమెరికా చేపట్టిన సైనిక చర్య ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆ ఆపరేషన్ పెద్దగా ఫలించలేదు. పైపెచ్చు అమెరికా వ్యూహాల డొల్లతనం ప్రపంచానికి ప్రస్షుటమంది. దీంతో ఈ ఆపరేషన్ పేరు మార్చి మరింత పదునైన వ్యూహాలతో, మరింత తీవ్రమైన దాడులను చేపట్టాలని అగ్రరాజ్యాధినేత ట్రంప్ నిర్ణయించారు
ఉష చిలుకూరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన వడ్లూరు గ్రామం. ఆమె తల్లిదండ్రులు ఉన్నత విద్యావంతులు కావడంతో, చిన్నతనం నుంచే ఆమెకు చదువుపై మక్కువ పెరిగింది. అమెరికాలోనే పుట్టి పెరిగినప్పటికీ, ఉషా చిలుకూరి భారత సంస్కృతిని, విలువలను ఎప్పుడూ మర్చిపోలేదు. యేల్ యూనివర్సిటీలో లా చదువుతున్న సమయంలోనే ఆమెకు జేడీ వాన్స్‌తో పరిచయం ఏర్పడింది.
స్టార్ బ్యాటర్ విరాట్ కింగ్ కోహ్లీ అద్భుత శతకంతో చెలరేగడంతో కేకేఆర్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఆర్సీబీ మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ విజయంతో బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
ముఖ్యమైన విషయం ఏమిటంటే ట్రంప్ కు స్వాగతం పలికేందుకు చైనా ఉపాధ్యక్షుడు హన్ జెంగ్ స్వయంగా విమానాశ్రయానికి రావడమే చైనా అగ్రరాజ్యాధినేత పర్యటనకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నదన్నది అవగతమౌతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఉద్యోగాల లక్ష్య సాధనలో ఎంఎస్ఎంఈల పాత్ర అత్యంత కీలకమని ఐటీ, ఎలక్ట్రానిక్స్ , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ పెవిలియన్‌లో మెగా గ్రోత్ కారిడార్ ప్రణాళికలపై ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సూచన మేరకు సీఎం చంద్రబాబు తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించారు.
రాష్ట్రాన్ని ఆర్ధికంగా మరింత పటిష్ట పరిచేందుకు వ్యవస్థలో సామర్ధ్య పెంపు జరగాలని, ఇందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు.
ప్రజాస్వామ్యం వచ్చింది. పాలకుండలాంటి ఓటు హక్కును తెచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.