ఆడకుండా వెళ్లిపోయిన మెస్సీ... కోల్‌కతా ఫ్యాన్స్ వీరంగం
Publish Date:Dec 13, 2025
Advertisement
భారత ఫుట్‌బాల్ అభిమానులు ఎంతోగానో ఎదురుచూస్తోన్న రోజు రానే వచ్చింది. అర్జెంటీననా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సి ఇండియాలో అడుగుపెట్టాడు. ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’ పేరుతో సాగనున్న ఈ పర్యటనలో భాగంగా.. ఇప్పటికే మెస్సి కోల్‌కతా చేరుకున్నాడు. కోల్‌కతా అంతా ఇప్పుడు అంతా మెస్సి జపమే చేస్తోంది. 2011 తర్వాత ఈ స్టార్ ఆటగాడు ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో అభిమానులంతా భారీ ఎత్తున ఇప్పటికే స్టేడియానికి చేరుకున్నారు. అయితే మెస్సీ మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. గోట్ టూర్ ఆఫ్ ఇండియాపేరుతో సాగుతున్న ఫుట్ బాట్ దిగ్గజం కోల్‌కత్తా సాల్ట్ లేక్ స్టేడియం సందర్శన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఓ లేడీ ఫ్యాన్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మంది వీరాభిమానులు మెస్సిన చూడటం కోసం ఎంతో ఆసక్తిగా, ఉత్సుకతతో ఎదురుచూశారు. ఒక్కొక్కరు తమ అభిమానాన్ని ఒక్కో రకంగా వెల్లడించారురు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే మెస్సీ కోల్ కత్తా స్టేడియంలో మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోవడం వివాదాస్పదమైంది. మెస్సీని దగ్గర నుంచి చూడాలని అతడి ఆటను వీక్షించాలని కొన్ని రోజులుగా అభిమానులు ఎదురు చూశారు. ఇలాంటి తరుణంలో అతను అలా వచ్చి, ఇలా స్టేడియం నుంచి వెళ్లిపోవడాన్ని అభిమానులు తట్టుకోలేకపోయారు. స్టేడియంలో పట్టుమని 10 నిముషాలు కూడా ఉండలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేసి తమ అసహనం వ్యక్తం చేశారు. తెల్లవారుజామున కోల్‌కతాలో దిగిన మెస్సి ఉదయం 11.30 గంటల సమయంలో సాల్ట్ లేక్ స్టేడియానికి వెళ్లాడు. అప్పటికే భారీస్థాయిలో అభిమానులు అక్కడకి చేరుకున్నారు. రాజకీయ నేతలు, పుట్ బాల్ మాజీ క్రీడాకారులు, కోచ్‌లు, ఇతర సభ్యులు ఆయన్ను చుట్టుముట్టడంతో స్టాండ్స్ నుంచి ఆ స్టార్‌ను చూసే అవకాశం అభిమానులకు లభించలేదు. అతడి చుట్టూ ఉన్నవారిని దూరం జరిపే ప్రయత్నాలు జరిగినప్పటికీ అవికూడా ఫలించలేదు. ఈ గందరగో పరిస్థితుల వల్ల ముందుగా నిర్ణయించి రెండు ఈవెంట్లను నిర్వహించలేకపోయారు. భద్రతాకారణాల దృష్ట్యా 10 నిమిషాల్లోనే అతడిని నిర్వాహకులు స్టేడియం నుంచి తీసుకెళ్లి పోయారు. అతడు వెళ్లిపోవడాన్ని చూసిన అభిమానులు సహనం కోల్పోయి ఆగ్రహం వెళ్లగక్కారు. అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లు , ఇతర తాత్కాలిక నిర్మాణాలను ధ్వంసం చేశారు. ఈ ఈవెంట్ కోసం ఒక్కొక్కరూ రూ.4,500 నుంచి రూ. పదివేల వరకు వెచ్చించారని తెలుస్తోంది. మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోయాడని ఫ్యాన్స్ అంతా స్టేడియంలో కుర్చీలు విరగ్గొడుతూ నిరసన తెలిపారు. శనివారం కోల్‌కతాలో పర్యటించిన మెస్సీ బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌తో కలిసి తన 70 అడుగుల విగ్రహాన్ని మెస్సి ఆవిష్కరించాడు. అయితే ఈ సందడి నడుమ ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఉన్నట్టుండి మెస్సి అభిమానులంతా ఆగ్రహానికి గురయ్యారు మెస్సి.. ప్రపంచ స్థాయిలో ఎంతో మంది అభిమానులు ఆయన సొంతం. ఈ క్రమంలో ఎన్నో ఏళ్ల తర్వాత భారత్‌లో పర్యటిస్తుండటం.. ఇటీవలే ఫిఫా ప్రపంచ కప్ సొంతం చేసుకోవడంతో మెస్సిని చూడాలని అభిమానులు తహతహలాడారు. ఆయన కోసం గంటలు గంటలుగా ఎదురు చూశారు. కానీ ఆయన ఎంతో సేపు అక్కడ లేకపోవడంతో అభిమానులకు నిరాశే ఎదురైంది. మ్యాచ్ ఆడుతానని చెప్పి ఆడకుండా వెళ్లిపోయాడని ఫ్యాన్ అంతా నిరసన తెలిపారు. మెస్సి కోసం ఎంతో సేపటి నుంచి ఎదురు చూస్తున్నామని.. మ్యాచ్ కూడా ఆడకుండా వెళ్లిపోయాడని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. స్టేడియంలో కుర్చీలు విరగ్గగొట్టారు. కోల్‌కతా స్టేడియంలో రచ్చ రచ్చ చేశారు. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయలేదని, స్టేడియంలో మెస్సీ అభిమానులు గందరగోళం సృష్టించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/lionel-messi-salt-lake-stadium-36-210934.html





