ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
Publish Date:Dec 18, 2025
Advertisement
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో సుప్రీంకోర్టు వారం రోజులపాటు ప్రభాకర్ రావును కస్టడీలోకి తీసుకొని విచారణ చేసేందుకు అనుమతించిన విషయం తెలిసిందే... ఈ మేరకు మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుపై వారం రోజులపాటు సాగిన కస్టోడియల్ విచారణ ఈరోజుతో ముగిసింది. ఈ మేరకు రేపు సుప్రీంకోర్టుకు పూర్తి స్థాయి నివేదికను సమర్పించేందుకు సిట్ అధికారులు సిద్ధమవు తున్నారు. అయితే అధికారులు ప్రభాకర్ రావు ను కస్టడీలోకి తీసుకుని విచారణ చేసిన సమయంలో ప్రభాకర్ రావు కీలక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని, నోరు మెదపలేదని అధికా రులు పేర్కొంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి అత్యంత కీలక అంశాలను ఆయన దాటవేస్తున్నారని సిట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు మరికొన్ని రోజుల పాటు కస్టోడియల్ విచారణకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును మరోసారి కోరే అవకాశ ముందని సమాచారం....ఈ కేసులో నిజాలు వెలుగులోకి రావాలంటే ప్రభాకర్ రావును ఇంకా కస్టడీలో ఉంచి విచారణ కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు అభిప్రాయ పడుతున్నారు. సిట్ సమర్పించనున్న నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు జారీ చేయనుంది. ఆదేశాలు వచ్చే వరకు ప్రభాకర్ రావు పోలీసుల కస్టడీలోనే కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం రాజకీయంగా, పరిపాలనాపరంగా కీలకంగా మారనుంది.
http://www.teluguone.com/news/content/phone-tapping-case-36-211231.html





