పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అద్భుతమైన ఫలితాలు : సీఎం రేవంత్
Publish Date:Dec 18, 2025
Advertisement
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు అఖండ విజయం సాధించడంపై సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 7,527 స్థానాల్లో విజయం సాధించగా, మరో 808 చోట్ల కాంగ్రెస్ రెబల్స్ గెలుపొందారని తెలిపారు. బీఆర్‌ఎస్ 3,511, బీజేపీ 710 చోట్లు గెలిచినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ విజయం ప్రభుత్వ ప్రజాపాలనకు నిదర్శనమని, గ్రామాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. 66% ఫలితాలు కాంగ్రెస్ పార్టీకే వచ్చాయిని రేవంత్ పేర్కొన్నారు. ఈ ఫలితాలు మా రెండేళ్ల పాలనకు నిదర్శనమని ముఖ్యమంత్రి తెలిపారు. 2029 లో కూడా కాంగ్రెస్ పార్టీదే అధికారం అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ 1/3 స్థానాలు మాత్రమే గెలిచిందని ఇప్పటికైనా అహంకారం, అసూయ తగ్గించుకోవాలని సీఎం హితవు పలికారు . ఈ ఫలితాలతోనైనా బీఆర్‌ఎస్ వాళ్లకి కనువిప్పు కలగాలని కోరుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించడం దారుణమని సీఎం అన్నారు. కేంద్రంలోని బీజేపీ.. రాహుల్‌గాంధీపై కోపంతో రాజకీయం చేస్తోందన్నారు. గాంధీ అనే పేరు ఎక్కడా కనిపించకూడదని కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ దురాలోచన చేస్తోందని విమర్శించారు.
http://www.teluguone.com/news/content/congress-party-36-211221.html





