శ్రీవారికి కొప్పెర హుండీ కానుక
Publish Date:Oct 17, 2025
Advertisement
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారికి భక్తులు అనేక రకాలుగా కానుకలు సమర్పించుకుంటారు. ధనం.. బంగారం.. వెండి.. ఇంకా అనేకంగా ముడుపులు కట్టి భక్తితో సమర్పించుకుంటారు. అయితే తిరపతి సమీపంలోని కొప్పెరవాండ్లపల్లె కొప్పెర వంశస్థలు మాత్రం శ్రీవారికి హుండీ సమర్పించడం వంశపారపర్యంగా వస్తున్న ఆచారం. అందులో భాగంగానే శ్రీవారికి శుక్రవారం (అక్టోబర్ 17) కొప్పెర హుండీ విరాళంగా అందించారు. కొప్పెరవాండ్లపల్లెకు చెందిన కొప్పెర సాయిసురేష్ ఈ హుండీని ఆలయంలో పోటు పేష్కార్ మునిరత్నంకు అందజేశారు. రాగి, ఇత్తడితో కలిపి తయారుచేసిన ఈ హుండీ బరువు 70 కిలోలు ఉంటుంది. దీని విలువ రెండున్నర లక్షల రూపాయలు ఉంటుంది. 1821 నుంచి వంశపారంపర్యంగా స్వామివారికి తమ వంశస్థులు కొప్పెరహుండీలను కానుకగా సమర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కొప్పెర హుండీ తయారీకి 20 రోజులు పడుతుంది.
http://www.teluguone.com/news/content/koppera-hundi-kanuka-to-tirumala-srivaru-36-208111.html





