Publish Date:Apr 30, 2026
కోహినూర్ వజ్రం భారత్‌కు తిరిగివ్వాలని అమెరికాలోని న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3ని వ్యక్తిగతంగా కలిసే అవకాశం వస్తే, కోహినూర్ వజ్రాన్ని భారత్‌కు తిరిగి ఇవ్వాలని కోరుతానని తెలిపారు. భారతీయ మూలాలను కలిగిన మమ్దానీ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. కింగ్ చార్లెస్-3 ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. న్యూయార్క్‌లోని 9/11 దాడుల స్మారక చిహ్మాన్ని సందర్శించారు.
ఒక కార్యక్రమంలో కాకుండా.. కింగ్ చార్లెస్-3ని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడే అవకాశం వస్తే కోహినూర్‌ను భారత్‌కు తిరిగి ఇచ్చెయ్యాలని కోరుతానని బుధవారం (ఏప్రిల్ 29)జరిగిన మీడియా సమావేశంలో మమ్దానీ తెలిపారు. ఆ తర్వాత కింగ్ చార్లెస్-3ని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడే అవకాశం మమ్దానీకి వచ్చింది. అయితే ఆయన కోహినూర్ గురించి కింగ్ చార్లెస్-3తో మాట్లాడారా, లేదా అనే విషయం గురించి సమాచారం బయటకు రాలేదు. కాగా, న్యూయార్క్ మేయర్ వ్యాఖ్యలపై స్పందించేందుకు లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్ నిరాకరించింది.
కాగా, 1849లో మహారాజ్ దులీప్ సింగ్ 108 క్యారెట్ల కోహినూర్ వజ్రాన్ని విక్టోరియా మహారాణికి ఇచ్చేశారు . అప్పట్నుంచి ఆ వజ్రం బ్రిటన్ రాజకుటుంబం ఆధీనంలోనే ఉంది. ఆ వజ్రాన్ని వెనక్కి తీసుకురావాలని భారత ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా దౌత్య మార్గాల ద్వారా ప్రయత్నిస్తోంది. అయితే అందుకు బ్రిటన్ నుంచి సానుకూల స్పందన రావడం లేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kohinoor-must-be-returned-to-india-36-218637.html
శంషాబాద్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఒక తెలుగు యువకుడు చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగం దొరక్క.. కుటుంబానికి భారమయ్యానన్న వేదనతో అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ నూతన డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి అవినాష్ మహంతి బాధ్యతలు స్వీకరించారు.
నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు నిర్వహణకు కసరత్తులు వేగవంతమయ్యాయి.
కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్రంలో లేబర్ అడ్డాలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు.
సంగారెడ్డి జిల్లాలో టీజీఆర్టీసీ అధికారుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ హైకోర్టు, సివిల్ కోర్టులో మెరిట్స్‌పై విచారణ పూర్తయ్యే వరకు ఆమె పరువుకు భంగం కలిగించే కథనాలు ప్రచురించవద్దని మీడియా సంస్థలు, కంటెంట్ క్రియేటర్లు, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులతో సంబంధం లేకుండా సివిల్ కోర్టు పిటిషన్ విచారణ కొనసాగిం చాలని కూడా హైకోర్టు స్పష్టం చేసింది.
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. అమరావతి ప్రాంతంలో ఆధునిక వైద్య సదుపాయాలను విస్తరిం చేందుకు కీలకంగా భావి స్తున్న ఈ ఆస్పత్రిని అమ రావతి సమీపంలోని తుళ్లూరు వద్ద 21 ఎకరాల విస్తీర్ణంలో రూ.750 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు.
తాజా పెంపు ప్రకారం, 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరపై ఏకంగా రూ. 993 మేర పెరిగింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలైన హైదరాబాద్, ఢిల్లీ, ముంబైలలో కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు 3వేల రూపాయలు దాటింది.
2026 విద్యా సంవత్సరానికి సంబంధించి విడుదలైన టెన్త్ ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా 85.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
పాలకొండ నుంచి సీతంపేట వైపు వెళ్లే ఘాట్ రోడ్డులో ప్రయాణి స్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్నవారిలో నలుగురు సంఘటనాస్థలంలోనే మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు.