భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ ధర.. సిలెండర్ పై రూ.993 రూపాయలు

Publish Date:May 1, 2026

Advertisement

దేశీయంగా చమురు విక్రయ సంస్థలు వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్‌పీజీ  సిలిండర్ల ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపు శుక్రవారం (మే1) నుంచే అమల్లోకి వచ్చాయి. తాజా పెంపు ప్రకారం, 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరపై ఏకంగా రూ. 993 మేర పెరిగింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలైన హైదరాబాద్, ఢిల్లీ, ముంబైలలో కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు 3వేల రూపాయలు దాటింది.  హోటళ్లు, రెస్టారెంట్లు,  చిరు వ్యాపారులపై ఈ పెరిగిన భారం నేరుగా పడుతోంది.  

2026 జనవరి 1 నుంచి ఇప్పటివరకు వాణిజ్య సిలిండర్‌‌‌‌‌‌‌‌ ధరలు పెరగడం ఇది ఆరో సారి కావడం గమనార్హం. తాజా పెంపుతో హోటళ్లు, రెస్టారెంట్లు, పరిశ్రమలపై తీవ్ర ప్రభావం పడనుంది. అయితే గృహ అవసరాలకు వాడే సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు చేయకపోవడం సామాన్యులకు కొంత ఊరట కలిగించే అంశం.  వాణిజ్య గ్యాస్ ధరల పెంపు ప్రభావం రానున్న రోజుల్లో ఆహార రంగంపై పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులుచెబుతున్నారు. పెరిగిన సిలిండర్ ధరల వల్ల హోటల్ లో సరుకుల ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.   

By
en-us Political News

  
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తృతంగా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కలలో పర్యటించారు
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్న వాహనాలను సీజ్ చేయొద్దన్న కోర్టు ఆదేశాల అమలుపై తీవ్రంగా స్పందించిన తెలంగాణ హైకోర్టు కీలక అధికారులకు నోటీసులు జారీ చేసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సీతారాం ఆత్మహత్య కేసులో రోజుకో కొత్త మలుపు వెలుగులోకి వస్తోంది.
అమెరికా అధ్యక్షుడి మానసిక స్థితి సరిగ్గానే ఉందా.. అన్న అంశం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న హెన్రిచ్ క్లాసెన్ ప్రదర్శనపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ప్రశంసలు కురిపించాడు.
మామూలుగా టెన్త్, ఇంటర్ వంటి రిజల్ట్స్ అంటే వార్తా పత్రికల్లో మరుసటి రోజంతా ఆ హడావుడే కనిపిస్తుంది.
శంషాబాద్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఒక తెలుగు యువకుడు చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగం దొరక్క.. కుటుంబానికి భారమయ్యానన్న వేదనతో అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ నూతన డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి అవినాష్ మహంతి బాధ్యతలు స్వీకరించారు.
నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు నిర్వహణకు కసరత్తులు వేగవంతమయ్యాయి.
కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్రంలో లేబర్ అడ్డాలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.