పార్వతీపురం మన్యం జిల్లాలో శుక్రవారం (మే1) ఉదమం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పాలకొండ నుంచి సీతంపేట వైపు వెళ్లే ఘాట్ రోడ్డులో ప్రయాణి స్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్నవారిలో నలుగురు సంఘటనాస్థలంలోనే మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రమాద సమయంలో ఆటోలో పరిమితికి మించిన ప్రయాణీకులు ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగిందని అంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీ సులు దర్యాప్తు చేపట్టారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/four-dead-in-road-accident-36-218700.html
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సీతారాం ఆత్మహత్య కేసులో రోజుకో కొత్త మలుపు వెలుగులోకి వస్తోంది.
అమెరికా అధ్యక్షుడి మానసిక స్థితి సరిగ్గానే ఉందా.. అన్న అంశం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న హెన్రిచ్ క్లాసెన్ ప్రదర్శనపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ప్రశంసలు కురిపించాడు.
మామూలుగా టెన్త్, ఇంటర్ వంటి రిజల్ట్స్ అంటే వార్తా పత్రికల్లో మరుసటి రోజంతా ఆ హడావుడే కనిపిస్తుంది.
శంషాబాద్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఒక తెలుగు యువకుడు చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగం దొరక్క.. కుటుంబానికి భారమయ్యానన్న వేదనతో అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ నూతన డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి అవినాష్ మహంతి బాధ్యతలు స్వీకరించారు.
నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు నిర్వహణకు కసరత్తులు వేగవంతమయ్యాయి.
కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్రంలో లేబర్ అడ్డాలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు.
సంగారెడ్డి జిల్లాలో టీజీఆర్టీసీ అధికారుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ హైకోర్టు, సివిల్ కోర్టులో మెరిట్స్‌పై విచారణ పూర్తయ్యే వరకు ఆమె పరువుకు భంగం కలిగించే కథనాలు ప్రచురించవద్దని మీడియా సంస్థలు, కంటెంట్ క్రియేటర్లు, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులతో సంబంధం లేకుండా సివిల్ కోర్టు పిటిషన్ విచారణ కొనసాగిం చాలని కూడా హైకోర్టు స్పష్టం చేసింది.