Publish Date:May 13, 2026
ఐపీఎల్ లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకున్నాడు. బుధవారం రాయ్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తో జరిగిన మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ కోహ్లీకి 279వ మ్యాచ్. దీనితో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ పేరు మీద సంయుక్తంగా ఉండేది. వీరిద్దరూ తలో 278 మ్యాచ్‌లతో కోహ్లీతో సమానంగా ఉండగా, తాజా మ్యాచ్‌తో విరాట్ వీరిద్దరినీ అధిగమించాడు.
ఐపీఎల్ అంటేనే రికార్డుల వేదిక, అలాంటిది ఈ మెగా టోర్నీలో మోస్ట్ క్యాప్డ్ ప్లేయర్‌గా నిలవడం సామాన్యం కాదు. ఎంఎస్ ధోనీ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ స్క్వాడ్‌లో ఉన్నప్పటికీ ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ మైదానంలోకి దిగలేదు. మరోవైపు రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు. వీరిద్దరినీ వెనక్కి నెట్టి విరాట్ కోహ్లీ ఈ సరికొత్త శిఖరాన్ని చేరుకున్నాడు. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ కోహ్లీ కెరీర్‌లో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. కేవలం ఒకే ఫ్రాంచైజీ తరపున ఇన్ని మ్యాచ్‌లు ఆడటం కోహ్లీ అంకితభావానికి నిదర్శనంగా చెప్పవచ్చు.
ఇక పోతే ఇదే మ్యాచ్ లో కోహ్లీ అజేయ సెంచరీతో విశ్వరూపం చూపాడు. ఈ క్రమంలో మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. టి20 హిస్టరీలోనే 14 వేల పరుగులు చేసిన తొలి ఇండియన్ క్రికెటర్ గా నిలిచాడు. మొత్తంగా టీ20ల్లో 14 వేల పరుగులు పూర్తి చేసిన ఆరవ బ్యాటర్ గా కోహ్లీ నిలిచాడు. ఇక పోతే అత్యంత వేగంగా టి20 14 వేల పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కోహ్లీ ఈ మార్క్ ను 409 ఇన్నింగ్స్ లో సాధించాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/king-kohli-breaks-yet-another-record-36-219712.html
ప్పందాన్ని బేఖాతరు చేస్తూ.. ఇరాన్ దళాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఈ పరిణామం మళ్లీ ఒక్కసారిగా శాంతి ఆశలను ఆవిరి చేసేసింది. ఒమన్ తీరానికి సమీపంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ రెండు వాణిజ్య నౌకలను లక్ష్యంగా క్షిపణి దాడులకు తెగబడింది.
సెమీకండక్టర్ అసెంబ్లింగ్, ప్యాకేజింగ్, టెస్టింగ్ (ఓఎస్ఏటీ) రంగంలో గ్లోబల్ లీడర్ అయిన అపాక్ట్ కంపెనీ సీఈవో సియాంగ్ డాంగ్ లీతో భేటీలో ఆ కంపెనీ ఏపీలో భారీ పెట్టుబడికి అంగీకరించింది. ఏఎస్ఐపీ టెక్నాలజీస్‌తో జతకట్టి, విశాఖపట్నంలో ఓఎస్ఏటీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఇండియా సెమీకండక్టర్ మిషన్ ద్వారా అనుమతులు లభించినట్లు అపాక్ట్ సీఈవో వెల్లడించారు.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ప్రాజెక్ట్ 17 సిరీస్‌లో ఆరవ స్టెల్త్ యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి అధికారికంగా నౌకాదళంలో చేరబోతున్నది. విశాఖపట్నం వేదికగా.. ఈ నెల 11న అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిని నౌకాదళంలోకి కమిషన్ చేయనున్నారు.
ప్రత్యేకంగా వివాహ ఆహ్వాన పత్రికలు అంటే శుభలేఖలు ముద్రించి, వాటిని బంధువులు, గ్రామస్థులకు పంచి పెళ్లికి రండంటూ ఆహ్వానించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పూజారుల సమక్షంలో మంగళసూత్రం కట్టించడం, తలంబ్రాలు పోయించడం, హారాలు మార్చించడం వంటి అన్ని వివాహ తంతులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు.
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.