అగ్రదేశాధినేత డొనాల్డ్ ట్రంప్ యుద్ధోన్మాదం ఇసుమంతైనా తగ్గలేదు. ఓ వైపు నాలుగు నెలల తరువాత ఇప్పుడిప్పుడే పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలు చల్లారి, ఉద్రిక్తతలు సడలుతున్న వేళ.. ట్రంప్ మరోసారి రణన్నినాదం చేశారు. నాటో సభ్య దేశాలు తగ్గించడానికి వీల్లేదనీ, ఆయా దేశాలు తమ రక్ణణ వ్యయాన్ని తమ జీడీపీలో 5శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వారంలో టర్కీ క్యాపిట్ అంకారా వేదికగా జరగనున్న నాటో శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ ఎజెండా ఇదేనని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. రక్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈ డిమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు.
కాగా నాటో సభ్య దేశాల శిఖరాగ్ర సమావేశం కోసం సోమవారం (జులై6) వాషింగ్టన్ నుంచి అంకారాకుబయలు దేరారు. మంగళవారం (జులై 7) అంకారాకు చేరుకుంటారు. అంకారాలో తొలుత టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఆ తర్వాత బుధవారం (జులై 8) నాటో దేశాల నేతల అత్యున్నత స్థాయి సమావేశాల్లో పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ, సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షారాలతో కూడా ట్రంప్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
ఇక రక్షణ బడ్జెట్ పెంపు విషయంలో పోలాండ్, నార్డిక్, బాల్టిక్ దేశాలు ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశాయి. యూరప్‌లోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన జర్మనీ కూడా 2029 నాటికి తన రక్షణ వ్యయ లక్ష్యాన్ని చేరుకునేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇవే కాకుండా నాటో సభ్య దేశాలన్నీ కూడా రక్షణ బడ్జెట్ పెంపు విషయంలో వేగంగా చర్యలు తీసుకోవాలని అమెరికా పట్టుబడుతోంది.
NATO Summit Turkey, Defense Spending Ultimatum, White House Foreign Policy, US Weapons Purchase, Global Defense Budget
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trumps-war-hysteria-shows-no-signs-of-abating-36-225133.html
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ (కన్నేపల్లి) పంప్ హౌస్ వేదికగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.