ఈవీ, సెమీకండక్టర్ హబ్ గా ఏపీ.. దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ కీలక ఒప్పందాలు. !

Publish Date:Jul 7, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్  ను  సరికొత్త పారిశ్రామిక విప్లవం వైపు నడిపించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రాన్ని గ్లోబల్ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగానికి   హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్  మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు.  సియోల్ నగరంలో పెట్టుబడుల వేట ప్రారంభించిన మంత్రి లోకేష్, ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ, ఆటోమోటివ్ దిగ్గజ సంస్థల ఉన్నత స్థాయి ప్రతినిధులతో వరుస  సమావేశాలు నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు.  

 ప్రపంచ ఆటోమోటివ్ విడిభాగాల తయారీ దిగ్గజం హ్యుందాయ్ మోబిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యంగ్ బిన్ కిమ్‌తో లోకేష్ జరిపిన భేటీలో   రాష్ట్రంలో భారీ ఎత్తున ఎలక్ట్రిక్ వెహికల్స్,  అలాగే సెమీకండక్టర్స్ హబ్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని కోరారు. అందకు హు్యందాయ్ సానుకూలంగా స్పందించింది. 

ఈ భేటీలో మంత్రి లోకేష్ కొన్ని   వ్యూహాత్మకమైన ప్రతిపాదనలను హ్యుందాయ్ ముందుంచారు. తిరుపతి లేదా అనంతపురం నగరాల సమీపంలో ఈవీ కాంపోనెంట్స్, అత్యాధునిక బ్యాటరీ సిస్టమ్స్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలనీ,   విశాఖపట్నంలో హ్యుందాయ్ మోబిస్ తరఫున ఒక ప్రతిష్టాత్మక రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్&డీ), గ్లోబల్ ఇంజనీరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. భవిష్యత్ సాంకేతికతలపై యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఐఐటీ తిరుపతి భాగస్వామ్యంతో  సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తీసుకురావాలని కోరారు. అలాగే అనంతపురాన్ని పూర్తిస్థాయి ఆటోమొబైల్ హబ్‌గా మార్చేలా టైర్-1 సరఫరాదారుల గ్లోబల్ మీట్ నిర్వహణకు ఏపీ ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ ప్రతిపాదనలపై హ్యుందాయ్ ప్రతినిధి సానుకూలంగా స్పందిస్తూ.. త్వరలోనే ఉన్నత స్థాయి బృందంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అలాగే ఈ పర్యటనలో నారా లోకేష్ మరో అద్భుత విజయం కూడా సాధించారు.   సెమీకండక్టర్ అసెంబ్లింగ్, ప్యాకేజింగ్, టెస్టింగ్ (ఓఎస్ఏటీ) రంగంలో గ్లోబల్ లీడర్ అయిన  అపాక్ట్ కంపెనీ సీఈవో సియాంగ్ డాంగ్ లీతో భేటీలో ఆ కంపెనీ ఏపీలో భారీ పెట్టుబడికి అంగీకరించింది.  ఏఎస్ఐపీ టెక్నాలజీస్‌తో జతకట్టి, విశాఖపట్నంలో ఓఎస్ఏటీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఇండియా సెమీకండక్టర్ మిషన్  ద్వారా అనుమతులు లభించినట్లు అపాక్ట్ సీఈవో వెల్లడించారు.

విశాఖలో దాదాపు  468 కోట్ల రూపాయల  పెట్టుబడితో ఈ ప్లాంట్‌ను నిర్మించనున్నారు.   ఈ యూనిట్ ద్వారా ఏడాదికి  96 మిలియన్ల సెమీకండక్టర్ పరికరాలను తయారుచేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ ప్రతిష్టాత్మక ఫ్యాక్టరీ నిర్మాణ పనులు విశాఖపట్నంలో అతి త్వరలోనే ప్రారంభం కానున్నాయి. అపాక్ట్ కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంపై మంత్రి లోకేష్ సంతోషం వ్యక్తం చేస్తూ..  ఏపీ యువతకు ఈ రంగంలో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు వీలుగా ఏపీఎస్ఎస్‌డీసీతో చేతులు కలపాలని కోరారు. హనా మైక్రాన్ వంటి ఇతర అంతర్జాతీయ సెమీకండక్టర్ సంస్థలు కూడా ఏపీకి వచ్చేలా అపాక్ట్ సహకరించాలని లోకేష్ కోరగా, దానికి కూడా అపాక్ట్  అంగీకరించింది. ఈ కొరియా పర్యటనతో ఏపీకి వేల కోట్లలో పెట్టుబడులు, లక్షలాదిగా ఉపాధి అవకాశాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Nara Lokesh South Korea tour, Andhra Pradesh investments, AP semiconductor hub, Hyundai Mobis AP, Apact Visakhapatnam plant

By
en-us Political News

  
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI బ్యాంకింగ్ రంగంలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ వినియోగంపై కొత్త డ్రాఫ్ట్ రూల్స్ తెచ్చింది. మోడల్ రిస్క్ మేనేజ్‌మెంట్ కోసం తెచ్చిన ఈ నిబంధనలతో బ్యాంకింగ్ రంగంలో ఏఐ గవర్నెన్స్, మోడల్ వాలిడేటర్ ఉద్యోగాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
జూలై 7న దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 100 గ్రాముల 24 క్యారట్ల బంగారంపై ఏకంగా రూ. 13,600 తగ్గింది. హైదరాబాద్, విజయవాడ సహా మీ నగరంలో నేటి 22K, 24K పసిడి లేటెస్ట్ రేట్లను ఇప్పుడే తెలుసుకోండి!
జపాన్ వెళ్లే భారతీయ ప్రయాణికులకు అలర్ట్. కొత్త వీసా నిబంధనలు, ఈ వీసా ప్రాసెస్, మారిన ఫీజుల వివరాలు మరియు ట్రాన్సిట్ వీసా రద్దు గురించిన పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
సీనియర్ సిటిజన్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకులు భారీగా వడ్డీ రేట్లను పెంచాయి. SBI, HDFC, PNB మరియు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో 7.50% నుండి 9.00% వరకు లభిస్తున్న గరిష్ట వడ్డీ రేట్లు, కాలపరిమితి మరియు పన్ను ఆదా వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఈ నెల 1న ఆయన ఎక్స్  వేదికగా   ఆంధ్రప్రదేశ్‌లో సమాజ శాంతిని దెబ్బతీసేలా, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కొన్ని శక్తులు ఉద్దేశపూర్వకంగా కుట్రలు పన్నుతున్నాయని  ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి పోకడలు ఏ మాత్రం మంచివి కావన్నారు. 
నోయిడాకు చెందిన సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ క్రాటికల్ టెక్ Kratikal Tech BSE SME ప్లాట్‌ఫామ్‌పై గ్రాండ్‌గా లిస్ట్ అయింది. ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ట్రేడింగ్ నిబంధనలు, పెట్టుబడి వివరాలు మరియు థ్రెట్‌కాప్ ThreatCop సాస్ ప్లాట్‌ఫామ్ భవిష్యత్తుపై పూర్తి విశ్లేషణ ఇక్కడ చూడండి.
ఫిఫా వరల్డ్‌కప్‌ రౌండ్ 16లో అమెరికాకు ఘోర పరాజయం. 4 1 గోల్స్ తేడాతో అమెరికాను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన బెల్జియం. చార్లెస్ డీ కెటిలేరి అద్భుతమైన డబుల్ గోల్స్ హైలైట్.
నాసిక్ టీసీఎస్ యూనిట్‌లో టెలికాలర్‌గా పనిచేసిన నిదాఖాన్, యూనిట్ లో మతమార్పిడులు, లైంగిక వేధింపుల వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత పరారయ్యారు. దాదాపు 42 రోజుల పాటు అజ్ఝాతంలోకి వెళ్లిన ఆమెను పోలీసులు మేలో అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ ఆటపై భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లండ్ సిరీస్ మరియు టీమిండియా భవిష్యత్తు ప్రణాళికల గురించిన పూర్తి వివరాలు మీకోసం.
ప్పందాన్ని బేఖాతరు చేస్తూ.. ఇరాన్ దళాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఈ పరిణామం మళ్లీ ఒక్కసారిగా శాంతి ఆశలను ఆవిరి చేసేసింది. ఒమన్ తీరానికి సమీపంలో ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ రెండు వాణిజ్య నౌకలను లక్ష్యంగా క్షిపణి దాడులకు తెగబడింది.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ప్రాజెక్ట్ 17 సిరీస్‌లో ఆరవ స్టెల్త్ యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి అధికారికంగా నౌకాదళంలో చేరబోతున్నది. విశాఖపట్నం వేదికగా.. ఈ నెల 11న అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిని నౌకాదళంలోకి కమిషన్ చేయనున్నారు.
ప్రత్యేకంగా వివాహ ఆహ్వాన పత్రికలు అంటే శుభలేఖలు ముద్రించి, వాటిని బంధువులు, గ్రామస్థులకు పంచి పెళ్లికి రండంటూ ఆహ్వానించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పూజారుల సమక్షంలో మంగళసూత్రం కట్టించడం, తలంబ్రాలు పోయించడం, హారాలు మార్చించడం వంటి అన్ని వివాహ తంతులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు.
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.