Publish Date:Oct 16, 2025
ఆపరేషన్ కగార్ మావోయిస్టు పార్టీకి తేరుకోలేని దెబ్బ కొట్టింది. కొడుతోంది. అర్ధ శతాబ్దపు చరిత్ర ఉన్న మావోయిస్టు పార్టీ కేడర్, లీడర్ కకావిలకమౌతోంది. వరుస ఎన్‌కౌంటర్‌లతో మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఒక్కొక్కరుగా నేలకొరుగుతున్న నేపథ్యంలో ఇంకా మిగిలిన కీలక నేతలు లొంగు బాట పడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరుగా మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయారు. రో అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న లొంగుబాట పట్టారు. తాజాగా తెలంగాణ పోలీసుల ఎదుట మరో మావోయిస్టు నేత బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ దాదా అలియాస్ క్రాంతి అలియాస్ ప్రభాత్ అలియాస్ బీపీ లొంగిపోయారు. సింగరేణి కార్మిక సమాఖ్య కార్యదర్శిగా కొనసాగిన ప్రభాత్.. అనారోగ్య సమస్యలతో పోలీసులకు లొంగిపోయినట్లు చెబుతున్నారు. ఇక మావోయిస్టుగా బండి ప్రకాష్ ప్రస్థానం చూస్తే..
బండి ప్రకాష్ మంచిర్యాల జిల్లా మందమర్రి గ్రామానికి చెందిన వారు. ఆయన తండ్రి రామారావు సింగరేణి కార్మికుడే. ప్రకాష్ 1982-84 మధ్య అప్పటి పీపుల్స్ వార్ అనుబంధ విద్యార్థి సంఘమైన రాడికల్ స్టూడెంట్ యూనియన్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవాడు. 1984లో స్థానిక ఏఐటీయూసీ నేత వీటీ అబ్రహం హత్య కేసులో నిందితుడు కావడంతో పోలీసులు అరెస్టు చేసి ఆదిలాబాద్ సబ్ జైలు తరలించారు. అయితే మావోయిస్టు నేతలు హుస్సేన్, నల్లా ఆదిరెడ్డిలతో కలిసి ప్రకాష్ సబ్ జైలు నుంచి తప్పించు కుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి బండి ప్రకాష్ అజ్ఞాతంలోనే గడిపారు. ఎప్పుడు ఎన్ కౌంటర్ జరిగినా బండి ప్రకాష్ పేరు వినిపించేది. పలుమార్లు ఆయన ఎన్ కౌంటర్ల నుంచి తృటిలో తప్పించుకున్నారు. మావోయిస్టు పార్టీ బండి ప్రకాష్ కు సింగరేణి కార్మిక సమాఖ్య పునరుద్ధరణ బాధ్యతను అప్పగించింది. దీంతో ఆయన సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) పునరుద్దరించడం కోసం రిక్రూట్ మెంట్ సైతం చేపట్టారు. పోలీసుల ఎన్ కౌంటర్ల కారణంగా ఆయన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. అయితే మంచిర్యాల జిల్లా లో జరుగు తున్న పరిణామాలపై సికాస పేరుతో లేఖలు విడుదల చేయడం ద్వారా ఆయన సికాస ఉనికిని కాపాడారని అంటారు.
ఇక పోతే వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం లో మావోయిస్టుల తో శాంతిచర్చల నేపథ్యంలో ఆసిఫాబాద్ సమీపంలోని మోవాడ్‌లో మావోయిస్టులు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు బండి ప్రకాష్ ప్రకాష్ అధ్యక్షత వహించాడు. అయితే శాంతి చర్చలు విఫలం కావడంతో ప్రకాష్ మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లాడు.
ఆయన ఆధ్వర్యంలో సింగరేణి కార్మిక సమాఖ్య ఒక వెలుగు వెలిగింది. సింగరేణిలో కార్మికులు ఎన్నో హక్కులు సాధించడంలో బండి ప్రకాష్ ది కీలకపాత్ర. దాదాపు 41 ఏళ్ల కిందట అజ్ణాతంలోకి వెళ్లిన బండి ప్రకాష్ పై పై తెలంగాణ ప్రభుత్వం రూ. 25 లక్షల రివార్డు ప్రకటించింది. బండిప్రకాష్ పేర్లతో
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/key-maoist-leader-bandi-prakash-surrendered-36-208069.html
నారాయణ్‌పూర్ జిల్లాకు ఆనుకుని ఉన్న ఛోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌ని మార్చి 31న సాయుధ మావోయిస్టులు లేని రాష్ట్రంగా ప్రకటించారు. సాయుధ మావోలు లేని రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి పేలుడు ఇదే కావడం గమనార్హం.
సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో సూత్రధారిగా ఏకసభ్య కమిషన్ తేల్చిన ఈవో ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
గత కొద్ది కాలంగా మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితమే ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. అక్కడి సైన్స్ సెంటర్లు, ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. పుస్తకాల్లోని జ్ఞానానికి తోడుగా విద్యార్థులకు వాస్తవిక ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు ఆ యాత్ర ఎంతో దోహదపడింది. ఇప్పుడు ఉపాధ్యాయులను కూడా విదేశాలకు పంపడం ద్వారా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ల్లభనేని బాబూరావు మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాబూరావు మృతి పార్టీకి తీరని లోటని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. బాబూరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
వివాహం అనంత రం ఈ ప్రేమికులు అదే కాలనీలో నివాసం ఉంటున్నారు. కావ్య తల్లిదండ్రులు కూడా అదే కాలనీలో మరో వీధిలో నివాసం ఉంటున్నారు.
గత నెల 28న కావ్య అక్క తన తల్లి ఇంటికి వచ్చింది. దీంతో తల్లి కొల్లా అరుణ తన చిన్న కూతురు కావ్యను కూడా ఇంటికి పిలిచింది. అదే రోజు మధ్యాహ్నం సమయంలో కావ్య తన పుట్టింటికి వెళ్ళింది.
ఏం జరిగిందో ఏమో కానీ కార్తీక్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా, మంజుల విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. వీరు ఉదయం నుంచి తలుపులు తెరవ కపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి. . కిటికీలోంచి చూడగా నవ దంపతులు విగతజీవులుగా కనిపించారు.
చిన్న తనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలిచివేసింది. ఆ విషాదమే ఆయనలో డాక్టర్ కావాలనే ఆలోచనకు బీజం వేసిందని సన్నిహితులు చెప్తుంటారు. మొదటి సారి మెడికల్ ఎంట్రన్స్‌లో మంచి మార్కులు రాకపోవడంతో.. తరువాత గుంటూరు ఎ.సి కళాశాలలో చేరి మళ్ళీ పీయూసీ చదివి మంచి మార్కులు తెచ్చుకుని కర్నూలు వైద్య కళాశాలలో చేరారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు ఒక్కొక్కరికి మూడు సెంట్ల భూమి బహుమతిగా ఇవ్వనున్నట్టు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు.
ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ఇన్‌స్టా గ్రామ్‌లో రీల్స్, ఫేక్ ప్రొఫైల్స్ ద్వారా పరిచయాలు పెంచుకుని యువతులను ప్రేమ, పెళ్లి పేరుతో ట్రాప్ చేసి భారీగా డబ్బులు దోచుకున్నట్లు వెల్లడైంది.
ప్రాథమిక సమాచారం ఆధారంగా ఐటి అధికారులు పలువురు నిందితులకు నోటీసులు జారీ చేయనున్నారు. దర్యాప్తులో భాగంగా ఈ అక్రమ డబ్బు మార్గాలను ట్రాక్ చేయడంపై ఐటీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉంచేందుకు.. డబ్బును ఒకచోట నుండి మరొక చోటకు తరలించేందుకు హవాలా మార్గాన్ని ఉపయోగించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తెలుగు ప్రజలు మంచి పారిశ్రామికవేత్తను కోల్పోయారని, రీజెన్సీ స్థాపనతో యువతకు ఉపాధి కల్పనలో జీఎన్ నాయుడు కృషి ఎనలేనిదని సీఎం అన్నారు.
విమాన టికెట్ బుక్ చేసుకుని విదేశీ ప్రయాణానికి సిద్ధమయ్యాడన్న సమాచారం అందడంతో వెంటనే రంగం లోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు అతని ప్రయా ణాన్ని అడ్డుకున్నారు. కేసు విచారణ కొనసాగుతున్నం దున దేశం విడిచి వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టంగా తెలిపారు.