అల్లుcడిదాడిలో అత్త మృతి చెందిన సంఘటన మేడ్చెల్ జిల్లాలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీలో నివాసముం టున్న కల్లా కావ్య, స్నేహిత్ అనే యువకుడిని ప్రేమించింది. పెద్దల అంగీ కారంతో ఏడాది క్రితం వీరికి వివాహం జరిగింది. వివాహం అనంత రం ఈ ప్రేమికులు అదే కాలనీలో నివాసం ఉంటున్నారు. కావ్య తల్లిదండ్రులు కూడా అదే కాలనీలో మరో వీధిలో నివాసం ఉంటున్నారు.
గత నెల 28న కావ్య అక్క తన తల్లి ఇంటికి వచ్చింది. దీంతో తల్లి కొల్లా అరుణ తన చిన్న కూతురు కావ్యను కూడా ఇంటికి పిలిచింది. అదే రోజు మధ్యాహ్నం సమయంలో కావ్య తన పుట్టింటికి వెళ్ళింది.
ఆరోజు రాత్రి సమయంలో స్నేహిత్ పలుమార్లు అత్త అరుణకు ఫోన్ చేసి కావ్య ప్రవర్తన పై అసభ్యంగా మాట్లాడినట్లు తెలిసింది. దీంతో అత్త అరుణ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. మరుసటి రోజు అంటే ఏప్రిల్ 29 మధ్యాహ్నం సమయంలో అత్త అరుణ బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చి మెట్లు ఎక్కుతున్న సమయంలో... అక్కడికి వచ్చిన అల్లుడు స్నేహిత్ అత్త అరుణతో గొడవపడడమే కాకుండా బలవం తంగా ఆమెను బైక్ పై ఎక్కించుకొని తీసుకువె ళ్లాడు.
కొద్దిసేపటి తర్వాత స్నేహిత్ తన భార్య కావ్య కు ఫోన్ చేసి అత్త అరుణకు ఫిట్స్ వచ్చి బైక్ పై నుండి కింద పడిందని తెలిపాడు. దీంతో అరుణను మొదటగా సమీపంలోని మెడి స్టార్ హాస్పిటల్ కి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బోడుప్పల్ ఆర్బీఎం హాస్పిటల్ కి తరలించారు. అయితే ఈ ఘటనపై కావ్య కు అనుమానం వచ్చి సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించింది. భర్త స్నేహిత్ బైక్పై వెళ్తున్న సమయంలో తన తల్లి అరుణతో వాగ్వివాదానికి దిగాడు. అనంతరం స్నేహిత్ వెనుక కూర్చున్న అత్త అరుణ తలపై హెల్మెట్తో గట్టిగా బాదాడు. దీంతో రన్నింగ్ లో ఉన్న బైక్ పై నుండి అత్త అరుణ రోడ్డుపై పడిపోయినట్లుగా సీపీ ఫుటేజీలో స్పష్టంగా ఉంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయప డిన అరుణ చికిత్స పొందుతూ ఏప్రిల్ 30 సాయంత్రం సమ యంలో మృతి చెందింది. కావ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు సిసిటీవీ ఫుటేజ్ ను ఆధా రంగా చేసుకుని నిందితుడు స్నేహిత్ పై కేసు నమోదు చేసుకొని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/motherinlaw-dies-36-218800.html
నారాయణ్‌పూర్ జిల్లాకు ఆనుకుని ఉన్న ఛోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌ని మార్చి 31న సాయుధ మావోయిస్టులు లేని రాష్ట్రంగా ప్రకటించారు. సాయుధ మావోలు లేని రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి పేలుడు ఇదే కావడం గమనార్హం.
సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో సూత్రధారిగా ఏకసభ్య కమిషన్ తేల్చిన ఈవో ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
గత కొద్ది కాలంగా మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితమే ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. అక్కడి సైన్స్ సెంటర్లు, ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. పుస్తకాల్లోని జ్ఞానానికి తోడుగా విద్యార్థులకు వాస్తవిక ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు ఆ యాత్ర ఎంతో దోహదపడింది. ఇప్పుడు ఉపాధ్యాయులను కూడా విదేశాలకు పంపడం ద్వారా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ల్లభనేని బాబూరావు మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాబూరావు మృతి పార్టీకి తీరని లోటని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. బాబూరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఏం జరిగిందో ఏమో కానీ కార్తీక్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా, మంజుల విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. వీరు ఉదయం నుంచి తలుపులు తెరవ కపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి. . కిటికీలోంచి చూడగా నవ దంపతులు విగతజీవులుగా కనిపించారు.
చిన్న తనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలిచివేసింది. ఆ విషాదమే ఆయనలో డాక్టర్ కావాలనే ఆలోచనకు బీజం వేసిందని సన్నిహితులు చెప్తుంటారు. మొదటి సారి మెడికల్ ఎంట్రన్స్‌లో మంచి మార్కులు రాకపోవడంతో.. తరువాత గుంటూరు ఎ.సి కళాశాలలో చేరి మళ్ళీ పీయూసీ చదివి మంచి మార్కులు తెచ్చుకుని కర్నూలు వైద్య కళాశాలలో చేరారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు ఒక్కొక్కరికి మూడు సెంట్ల భూమి బహుమతిగా ఇవ్వనున్నట్టు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు.
ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ఇన్‌స్టా గ్రామ్‌లో రీల్స్, ఫేక్ ప్రొఫైల్స్ ద్వారా పరిచయాలు పెంచుకుని యువతులను ప్రేమ, పెళ్లి పేరుతో ట్రాప్ చేసి భారీగా డబ్బులు దోచుకున్నట్లు వెల్లడైంది.
ప్రాథమిక సమాచారం ఆధారంగా ఐటి అధికారులు పలువురు నిందితులకు నోటీసులు జారీ చేయనున్నారు. దర్యాప్తులో భాగంగా ఈ అక్రమ డబ్బు మార్గాలను ట్రాక్ చేయడంపై ఐటీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉంచేందుకు.. డబ్బును ఒకచోట నుండి మరొక చోటకు తరలించేందుకు హవాలా మార్గాన్ని ఉపయోగించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తెలుగు ప్రజలు మంచి పారిశ్రామికవేత్తను కోల్పోయారని, రీజెన్సీ స్థాపనతో యువతకు ఉపాధి కల్పనలో జీఎన్ నాయుడు కృషి ఎనలేనిదని సీఎం అన్నారు.
విమాన టికెట్ బుక్ చేసుకుని విదేశీ ప్రయాణానికి సిద్ధమయ్యాడన్న సమాచారం అందడంతో వెంటనే రంగం లోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు అతని ప్రయా ణాన్ని అడ్డుకున్నారు. కేసు విచారణ కొనసాగుతున్నం దున దేశం విడిచి వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టంగా తెలిపారు.
పులివెందుల నియోజకవర్గంలో గురువారం రాత్రి వీచిన పెనుగాలి, అకాల వర్షం రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ప్రధానండా అరటి పంట తీవ్రంగా దెబ్బతింది. వేల ఎకరాల్లో పంట నేలమట్ట మైంది. ప్రాథమిక అంచనాల ప్రకారం వెయ్యి ఎకరాల్లో అరటి పంట ధ్వంసమై.. రూ.12 కోట్ల మేర నష్టం వాటిల్లింది.