కేజ్రీవాల్ ని రనవుట్ చేసే పనిలో సిద్దూ!

Publish Date:Sep 3, 2016

Advertisement


సవజ్యోత్ సింగ్ సిద్దూ... ఈ పేరు ఇండియన్ క్రికెట్లో ఎంత పాప్యులరో అంతే వివాదాస్పదం కూడా! అసలు ఆయన ఎలా ఆడేవాడో ఈ కాలం క్రికెట్ లవ్వర్స్ కి పెద్దగా తెలియదు! కాని, విచిత్రం ఏంటంటే, ఆయన క్రికెట్ ఎలా ఆడేవాడో తెలియకపోవటమే కాదు పాలిటిక్స్ ఎలా ఆడతాడో కూడా జనానికి అర్థం కావటం లేదు ప్రస్తుతం! ఎవరికి మేలు చేసి ఎవరికి కీడు చేస్తాడో, ఎవరి కొంప కొల్లేరవుతుందో అస్సలు తెలియటం లేదు...

 

సిద్దూ అద్భుతమైన బ్యాట్సమన్ అయినా పెద్దగా పాలిటిక్స్ తెలిసిన వ్యక్తి కాదు. అందుకే, చాలా రోజులు ఇండియా కోసం ఆడినా క్యాప్టెన్ అవ్వలేకపోయాడు. రిటైర్మెంట్ అయ్యాక బీజేపిలో చేరి ఒకింత సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఆ పార్టీ సిద్దూకి తగినంత గుర్తింపు ఇచ్చింది. ఎంపీగా పోటీ చేయించింది. రాజ్యసభ  సీటు కూడా ఇచ్చింది. అయినా ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా రాజకీయం నిజంగా ఒంటబట్టని సిద్దూ ఎందుకోగాని ఈ సారి మొత్తం అతలాకుతలం చేసుకున్నాడు!

 

పార్టీ మీద అలిగో, లేదంటే ఇతర పార్టీల్లోంచి వస్తున్న టెంప్టింగ్ ఆఫర్ల వల్లో నవజ్యోత్ సింగ్ సిద్దూ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఎవ్వరూ చేయని సాహసం చేసి బంగారం లాంటి రాజ్యసభ సీటు వదులుకున్నాడు. రాజీనామా చేసి కొన్ని రోజులుగా ఖాళీగా కూర్చున్నాడు! అందరూ అనుకున్నట్టు ఆప్ లో చేరిపోలేదు...

 

సిద్దూ ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిగా చక్రం తిప్పేందుకే బీజేపి ఇచ్చిన రాజ్యసభ సీటు వద్దనుకున్నాడని అంతా భావించారు. ఆయన వెళ్లి కేజ్రీవాల్ ని కలిసి ఆ అంచనాల్ని నిజం కూడా చేశాడు. కాని, ఏమైందో ఏమోగాని ఆప్ క్రీజులోకి సిద్దూ వెళ్లలేదు. పెవెలియన్ లోనే వుండిపోయి ... హఠాత్తుగా స్వంత పార్టీ ప్రకటన చేశాడు!

 

పంజాబ్ లోని మరికొంత మంది చిన్నా, చితకా నేతలతో కలిసి ఆయన ఆవాజ్ ఏ పంజాబ్ అనే ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నట్టు తాజాగా ప్రకటించాడు! ఇది ఎవ్వరూ ఊహించని పరిణామం. పైగా ఈ ఫ్రంట్ పెట్టటం ద్వారా ఇటు ఆకాళీదల్, బీజేపి కూటమిని, అటు కాంగ్రెస్ ను, మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీని సిద్దు ఎదుర్కొని ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది! అంత పోటీలో ఈ ఆవాజ్ ఏ పంజాబ్ ఊడబొడిచేదేం లేదంటున్నారు క్రిటిక్స్! అయినా సిద్దూ ఇలాంటి సాహసం చేయటానికి కారణం ఏంటి?

 

కొందరి టాక్ ప్రకారం... నవజ్యోత్ సింగ్ సిద్దూ బీజేపిలో అసంతృప్తిగా వుండటం చూసి కేజ్రీవాల్ వల వేశాడట! ఆయన తన పంజాబ్ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తానని అనటంతో సిద్దూ బీజేపి టీమ్ లోంచి ఆప్ టీమ్ లోకి జంప్ అవుదామనుకున్నాడు. కాని, తీరా రాజ్యసభ సీటు కూడా వదిలేసి వచ్చాక అరవింద్ కేజ్రీవాల్ తన కేడీ వేషాలు మొదలు పెట్టాడట! సీఎం అభ్యర్థిగా ఛాన్స్ ఇచ్చేంత లేదని స్పష్టమైపోయింది. దాంతో సిద్దూకి తిక్కరేగిపోయింది...

 

అటు బీజేపికి, ఇటు ఆప్ కి కాక సతమతం అవుతోన్న సిద్దూపై కాంగ్రెస్ కూడా ఓ కర్చీఫ్ వేసింది. కాని, పంజాబ్ లో ప్రస్తుతం ప్రతి పక్షం అయిన కాంగ్రెస్ కి గెలిచేటంత సీన్ లేదని డౌట్స్ వున్నాయి. కాబట్టి కాంగ్రెస్ లో కాలేయకుండా ఆప్ దిమ్మతిరిగిపోయేలా సిద్దూ స్వంత ఫ్రంట్ ఆలోచన చేశాడంటున్నారు!

 

ఆవాజ్ ఏ పంజాబ్ ని కూడా షార్ట్ గా పిలిస్తే ఆప్ అనే అనాల్సి వస్తుంది. పైగా పంజాబ్ లో చెప్పుకోదగ్గ స్థాయిలో బీజేపి, అకాళీదల్ కూటమికి డ్యామేజ్ చేయాలని చూస్తోంది ఆప్. ఇలాంటి సమయంలో సిద్దూ తన దుకాణం ఒకటి కొత్తగా తెరవటంతో ప్రతి పక్షాలన్నిటి మధ్యా ఓట్లు చీలి అధికార కూటమికి లాభం చేకూరే సూచనలు కనిపిస్తున్నాయి! చూడాలి మరి.... పంజాబ్ ఎన్నికల మ్యాచ్ లో సిద్దూ బ్యాటింగ్ ఎలా వుంటుందో! రన్స్ కొట్టి బీజేపిని గెలిపిస్తాడో...బాల్స్ వేస్ట్ చేసి ఆప్ నో, కాంగ్రెస్ నో గెలిపిస్తాడో! ఏది ఏమైనా సిద్దు కలలు కన్నట్టు పంజాబ్ సీఎం ఆయనే అయ్యే అవకాశాలు మాత్రం పెద్దగా లేవంటున్నారు రాజకీయ విశ్లేషకులు!

By
en-us Political News

  
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం, ఏదైనా న్యాయస్థానం ప్రజాప్రతినిధులకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తేనే వారిపై అనర్హత వేటు పడుతుంది. అయితే ఈ నిబంధనను మరింత కఠినతరం చేస్తూ కేవలం 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఉన్నా పదవి కోల్పోయేలా మార్పులు చేయాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో సానుభూతిని తిరిగి సంపాదించుకోవడానికి, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని శాంతిభద్రతల విషయంలో ఇరకాటంలో పెట్టడానికే వైసీపీ ఈ బాట ఎంచుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ప్లస్ అవ్వడం అటుంచి బూమరాంగ్ అవుతూ.. ఆ పార్టీకి మరింత వ్యతిరెకత జనంలో కలగడానికి మాత్రమే దోహదపడుతున్నదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు గుప్పించే కేటీఆర్.. తాజాగా చంద్రబాబు పాలనా దక్షత, ఆయన ముందుచూపును అభినందించారు. కేటీఆర్ చంద్రబాబును అభినందించడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో జగన్ మాట్లాడిన మాటలు అసలాయనకు చట్టాలు తెలుసా? ఈ వ్యక్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం చెలాయించింది అన్న అనుమానాలు కలగక మానవు.
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేదికపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది.
హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.
ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది.
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.