జాతీయం నాటకం.. థర్డ్ ఫ్రంట్ బూటకం

Publish Date:Jun 15, 2022

Advertisement

ఎన్నికలు అన్నాక ఎన్నో ఉంటాయి. అందులోనూ  ఎన్నికలు ఎప్పుడో తెలియకుండానే రాష్ట్ర రాజకీయం వేడెక్కిన నేపధ్యంలో తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచే ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే ఎత్తులు పై ఎత్తులకు పదును పెడుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రస్తుతానికి అయితే  మూడు పార్టీల నడుమ ముక్కోణపు పోటీ అనివార్యంగానే కనిపిస్తోంది.

ఓ వంక అధికార తెరాస ముచ్చటగా మూడవ సారి గెలిచి హట్రిక్ సాధించాలనే పట్టుదలతో పావులు కదుపుతోంది. ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు ఇంతకు ముందెన్నడూ లేని విధంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎదురు దెబ్బలు తగులుతున్నా, తగ్గేదే లే అంటూ ముందుకు సాగుతున్నారు.  

నిజానికి, ఎన్నికల వ్యూహరచనలో కేసీఆర్ మహా దిట్ట. ఆయనకు మరొకరు సాటి రారు. అంతే కాకుండా, రాష్ట్ర విభజన అనంతరం, నిన్న మొన్నటి వరకు కూడా తెలంగాణలో ఆయనే టాలెస్ట్ లీడర్. ఇతర పార్టీలలో జానారెడ్డి వంటి కొందరు సీనియర్ నాయకులు ఉన్నా తెలంగాణ ఉద్యమ సారధి కిరీటం ఆయన ఎత్తును పెంచింది. నిజం అయినా కాకపోయినా, ప్రజలు తెలంగాణ సాధించిన నేతగా ఆయనకే బ్రహ్మరథం పట్టారు. రెండు సార్లు తెరాసను గెలిపించారు. 

అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అంటే లేదని వేరే చెప్పనక్కరలేదు. ఎన్నికల వ్యూహకర్త  ప్రశాంత్ కిశోర్ ను అరువు తెచ్చుకోవడంలోనే, కేసీఆర్ పరువు పలచనైంది. ఆయన డొల్లతనం బయట పడింది. ఇప్పుడు ఏకంగా పొరుగు రాష్ట్రం నుంచి, కరుడు కట్టిన సమైక్యవాది,సమాఖ్య వాదానికి, తెలంగాణ వ్యతిరేకతకు మానవ రూపం అనదగిన, కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్, సేవలు వినియోగించుకునే స్థితికి వచ్చారంటే, కేసీఆర్ ఆత్మవిశ్వాసం ఎంతగా దిగజారిందో వేరేగా చెప్పవలసిన అవసరం లేదు. 

కేసీఆర్ పైకి ఎన్ని బింకాలు పోయినా, జాతీయ రాజకీయాలు, జాతీయ పార్టీ ఏర్పాటు వంటి ఎన్ని, మాటలు చెప్పినా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడమే ఆయన ముందున్న ప్రధాన లక్ష్యం. ఈ ప్రధాన లక్ష్య సాధన కోసమే కేసీఆర్ టక్కు టమార గజకర్ణ విద్యలను ప్రదర్శిస్తున్నారు, అనేది.. నిన్నటిదాకా అనుమానం అయినా, రాష్ట్రపతి ఎన్నికలలలో అటూ ఇటూ కానీ, తటస్థ వైఖరి తీసుకోవడంతో ఆయనకు, రాష్ట్రపతి ఎన్నిక ముఖ్యం కాదు.

జాతీయ రాజకీయాలు కీలకం కాదు. రాష్ట్రంలో అధికారాన్ని నిలుపు కునేందుకే కేసీఆర్, శ్రమిస్తున్నారు అనే విషయం స్పష్టమవుతోందని విశ్లేషకులు అంటున్నారు. అందుకే అటు బీజేపీ అభ్యర్థి లేదా ఇటు విపక్ష కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చే విషయంలో కిందా మీద అవుతున్నారనే మాట రాజకీయ చర్చల్లో ప్రముఖంగా వినవస్తోంది.   బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ బలపరిచే అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేస్తే.. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే అని బీజేపీ ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసినా.. లేక ఓటింగ్‌కు దూరంగా ఉన్నా.. బీజేపీ అభ్యర్థిని గెలిపించడం కోసమే కేసీఆర్ అండ్ టీమ్ ఈ రకమైన నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించే అవకాశం లేకపోలేదు.

అందుకే రాష్ట్ర రాజకీయాలలో పట్టు నిలుపుకుని మూడవ సారి అధికరంలోకి వచ్చేందుకే, కేసీఆర్ జాతీయ రాజకీయలకు సంబంధించి అత్యంత కీలకమైన రాష్ట్రపతి ఎన్నికలలో అటూ, ఇటూ కానీ, వైఖరి అవలంబిస్తున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. అందుకే, రాష్ట్రంలో అధికారం చేజారకుండా కాపాడుకునేందుకే కేసేఅర్ జాతీయ రాజకీయ డ్రామా  నడుపుతున్నరని విశ్లేషకులు భావిస్తున్నారు.

By
en-us Political News

  
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
పుట్టా మహూష్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులోతెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా స్పందించి.. పుట్టా మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాని ఆదేశించింది.
ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ అంటే తన తండ్రి కేసీఆర్ అని, చిన్న మోదీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు.
ఒకప్పుడు అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, ఆయన కుటుంబ బంధువుగా బాలినేని శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు. అయితే గత ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో బాలినేని పరిస్థితి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.