కేసీఆర్ జాతీయ పార్టీ సరే.. టీఆర్ఎస్ సంగతి ఏమిటి?

Publish Date:Jun 15, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దృష్టి పూర్తిగా జాతీయ రాజకీయాలపై కేంద్రీకరించారు. జాతీయ స్థాయిలో తనకు ఏ పార్టీ నుంచీ, ఏ నేత నుంచీ సానుకూల స్పందన రాకపోవడంతో ఇప్పుడు జాతీయ పార్టీ అంటే కొత్త పల్లవి ఎత్తుకున్నారు. అంతే కాకుండా జాతీయ పార్టీ ఏర్పాటుపై సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు. కొత్త పార్టీకి పేరు కూడా నిర్ణయించేశారు. భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అంటే టీఆర్ఎస్ ను స్ఫురింప చేసేలా పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. సరే జాతీయ పార్టీ ఏర్పాటు అన్నది ఆయన అభీష్టం.. నెరవేర్చుకందామనుకుంటే అభ్యంతరం ఎవరికి ఉంటుంది. అయితే కేసీఆర్ నిర్ణయాలకు, ఆలోచనలకూ సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి. టీఆర్ఎస్ నేతగా జాతీయ స్థాయిలో పార్టీలను కలుపుకుని కేంద్రంలో మోడీ సర్కార్ పై పోరాడటం వరకూ అయితే ఓకే.. కానీ  ఏకంగా జాతీయ పార్టీ అంటే.. టీఆర్ఎస్ ను ఏం చేయదలుచుకున్నారు. జాతీయ పార్టీ పెడితే ఆయనకు మద్దతు ఎక్కక నుంచి వస్తుంది. ఉండవల్లితో భేటీ ఆంతర్యమేమిటి?  తెలంగాణ సెంటిమెంటే తెరాసకు రాష్ట్రంలో రెండు సార్లు అధికార పగ్గాలు అందుకునే అవకాశాన్ని ఇచ్చింది.  ఇప్పుడా సెంటిమెంట్ అక్కరకు రాకుండా పోయిందా? జాతీయ పార్టీ నెపంతో ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వేలు పెడదామనుకుంటున్నారా?  ఉండవల్లి లాంటి హార్డ్ కోర్ సమైక్యవాదితో మంతనాల సారాంశమిదేనా? ప్రస్తుతం తెరాస శ్రేణులను తొలిచేస్తున్న ప్రశ్నలివే.

ఈ సందర్భంగా వారు గతంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని కూలదోసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టాలని చేసిన ప్రయత్నం గురించి గుర్తు చేసుకుంటున్నారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి కావాలన్న ప్రయత్నం విఫలం కావడం వల్లనే కేసీఆర్ మలి దశ తెలంగాణ ఉద్యమం ప్రారంభించి సారథ్యం వహించారని గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా ఇదే అంశాన్ని కేసీఆర్ సన్నిహితుడొకరు ప్రస్తావించడాన్ని తెరాస శ్రేణుల చర్చల్లో నలుగుతోంది. కాగా కేసీఆర్ ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి కల గురించి చెప్పిన వ్యక్తి మామూలు వ్యక్తి అయితే కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు కేబినెట్ లో కేసీఆర్ తో కలిసి పని చేసిన మాజీ మంత్రి చంద్రశేఖర్  అటు తరువాత టీఆర్ఎస్ లో చేరారు.

కేసీఆర్ దళిత ముఖ్యమంత్రిని చేస్తాను అని చెప్పింది కూడా ఈ చంద్రశేఖర్ గురించే. ఆ తరువాత కేసీఆర్ మాట తప్పారనుకోండి. అది వేరే సంగతి.  కేసీఆర్ మాట తప్పడంతో కినుక వహించిన చంద్రశేఖర్ టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేశారు.   ప్రస్తుతం ఆయన బీజేపీలో  ఉన్నప్పటికీ ఉమ్మడి రాష్ట్రం నుంచీ కూడా కేసీఆర్ కు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. దీంతో ఉమ్మడి ముఖ్యమంత్రి పదవి కోసం కేసీఆర్ ప్రయత్నించి భంగపడ్డారన్న ఆయన వ్యాఖ్యలు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ  సంచలనం సృష్టించాయి. ఇప్పుడు జాతీయ పార్టీ అంటూ కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలపై ఈ కారణంగానే తెరాస శ్రేణుల్లోనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. తెలంగాణ సెంటిమెంట్ ను పక్కన పెట్టి పక్కా సమైక్య వాదితో మంతనాలు జరపడంతో ఆయన తెలుగు రాష్ట్రాలు మళ్లీ విలీనం కావడం ద్వారా తన జాతీయ పార్టీకి మద్దతు బలంగా లభిస్తుందని వ్యూహరచన చేశారు. ఒక వేళ జాతీయ పార్టీతో కేంద్రంలో చక్రం తిప్ప లేకపోయినా... తెలుగు రాష్ట్రాలలో బలపడి.. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి కల సాకారం చేసుకుందామని భావిస్తున్నారా? అందుకు అనుగుణంగా రాజకీయ ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నారా అన్న అనుమానాలను పార్టీ శ్రేణులే వ్యక్తం చేస్తున్నాయి.

ప్రస్తుతం తెలంగాణలో తెరాసకు వ్యతిరేక గాలులు బలంగా వీస్తున్నాయన్న  నేపథ్యంలో తెలంగాణ సెంటిమెంటును పట్టుకుని వేళాడితే మరోసారి అధికారం అంత తేలిక కాదని అవగతమైన కారణంగానే.. కేసీఆర్ తనకు అచ్చొచ్చిన సెంటిమెంట్ నే మరి కొంత విస్తృతం చేసి దక్షిణాది సెంటిమెంట్ ను పండించాలన్నది కేసీఆర్ వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   రాష్ట్రంలో వ్యతిరేకత పెల్లుబుకుతున్నా.. తెలంగాణ అభివృద్ధిని గమనించి ఆంధ్రులు తనకు మద్దతుగా నిలుస్తారని కేసీఆర్ ఆశాభావంతో ఉన్నారు.

 తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా కొన్ని స్థానాలను కోల్పోయినా ఆ మేరకు ఏపీలో లబ్ధి పొందే అవకాశాలుంటాయన్న అంచనాతో ఆయన జాతీయ పార్టీ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి రావడం వల్ల మాత్రమే సాకారం కాలేదనీ, వందల మంది తెలంగాణ బిడ్డల ఆత్మత్యాగం అందుకు కారణమని పార్టీ శ్రేణులు గట్టిగా చెబుతున్నాయి.   జాతీయ పార్టీ అంటూ తెరాసను గాలిలో దీపంగా వదిలేస్తే సహించేది లేదని గట్టిగా  చెబుతున్నాయి. కేసీఆర్ జాతీయ పార్టీ ఆలోచనను, ప్రయత్నాలను తెరాస శ్రేణులే వ్యతిరేకిస్తున్నాయి. ఆ దిశగా ఇప్పటికే ఏదో ఒక రూపంలో తమ నిరసన వ్యక్తం చేస్తున్నాయి.  రానున్న రోజులలో తెరాసలో కేసీఆర్ పట్ల వ్యతిరేకత  మరింత బలోపేతమై బహిరంగ నిరసనల రూపంలో వ్యక్తమైనా ఆశ్చర్య పోవలసిన అవసరం లేదని పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
పుట్టా మహూష్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులోతెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా స్పందించి.. పుట్టా మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాని ఆదేశించింది.
ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ అంటే తన తండ్రి కేసీఆర్ అని, చిన్న మోదీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు.
ఒకప్పుడు అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, ఆయన కుటుంబ బంధువుగా బాలినేని శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు. అయితే గత ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో బాలినేని పరిస్థితి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.