రాజకీయపార్టీగా తెలంగాణ జాగృతి.. రిజిస్ట్రేషన్ కోసం కవిత దరఖాస్తు

Publish Date:Jan 27, 2026

Advertisement

తెలంగాణ జాగృతి ఇక రాజకీయపార్టీగా అవతరించనుంది. ఈ మేరకు తన కొత్త రాజకీయపార్టీ పేరును తెలంగాణ జాగృతిగా పెట్టాలని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కవిత నిర్ణయించారు. ఇందు కోసం ఆమె కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేయడమే కాకుండా.. సాధ్యమైనంత త్వరగా తన పార్టీకి అధికారిక గుర్తింపునకు ఆమె స్వయంగా ఢిల్లీ వెళ్లి మరీ అవసరమైన ప్రక్రియను పూర్తి చేసి వచ్చారు.

ఇక ఎన్నికల సంఘం నిబంధనల మేరకు తెలంగాణ జాగృతికి మూడు నెలల వ్యవధిలో రాజకీయపార్టీగా అధికారిక గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఇప్పటి వరకూ తెలంగాణ సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు, కార్యకలాపాలకే పరిమితమైన తెలంగాణ జాగృతి, ఇక పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మారనుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే.. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలలోనే తెలంగాణ జాగృతి అభ్యర్థులను పోటీలో నిలబెట్టాలని కల్వకుంట్ల కవిత భావిస్తున్నారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణ జాగృతి రాజకీయపార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు కవిత చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే  అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ ఉద్యమ కారులను ఏకం చేసే దిశగా ఆమె అడుగులు వేస్తున్నారు.  

By
en-us Political News

  
అనర్హత వేటు భయంతో పాటు.. ఇంకా అసెంబ్లీ బహిష్కరణ అంటే పార్టీ ఎమ్మెల్యేలు తన మాట వినకపోవచ్చన్న ఆందోళన కూడా జగన్ అసెంబ్లీ బాయ్ కాట్ విషయంలో తన వైఖరి మార్చుకోవడానికి కారణం కావచ్చని పరిశీలకులు అంటున్నారు.
తెలుగుదేశం చరిత్రలో ఈ రీతిగా కార్యకర్తలు రెచ్చిపోవడం ఇదే మొదటి సారని పరిశీలకులు సైతం చెబుతున్నారు. అయితే తెలుగుదేశం కార్యకర్తలు, నేతలలో ఆగ్రహం కట్టలు తెంచుకోవడానికి కారణం వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలంతో దూషించడమే కారణం అంటున్నారు. అదే సమయంలో మరో మాజీ మంత్రి జోగు రమేష్ కూడా మంత్రి నారా లోకేష్ పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా తెలుగుదేశం శ్రేణులు ఫైర్ అయ్యాయి.
అయితే వైసీపీ నేతలు మాత్రం సిట్ చార్జిషీట్ లో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు ఆనవాళ్లే లేవని పేర్కొందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్ర‌బాబు తాజాగా స్పందించారు.
అంబటి భాష సరికాదని పేర్కొంది. ఇష్టారీతిగా మాట్లాడతాం, రక్షణ కల్పించండి అంటే ఎలా అని పేర్కొంది. నేరాలను అదుపు చేయడం, శాంతిభద్రతలను పర్యవేక్షించడమే పోలీసుల పని కాదన్న కోర్టు, సమాజంలో శాంతిని, సామరస్యాన్ని పెంపొందించాల్సిన బాధ్యత కూడా పోలీసు వ్యవస్థపై ఉందని పేర్కొంది.
ఆ సందర్భంగా అంబటి రాంబాబు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసభ్య పదజాలంతో దూషించారు. ఆయన చేసిన వ్యాఖ్య వీడియో రికార్డులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వ్యాఖ్యలపై అంబటిపై తెలుగుదేశం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు అంబటి రాంబాబును ఆయన నివాసంలో శనివారం (జనవరి 31) అర్ధరాత్రి దాటిన తరువాత అదుపులోనికి తీసుకుని పోలీసు వాహనంలో నల్లపాడు పోలీసు స్టేషన్ కు తరలించారు.
ఇప్పటికే సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తెలుగుదేశం నాయకుల ఫిర్యాదు మేరకు అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ఇలా ఉండగా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు ఇంటిని తెలుగుదేశం కార్యకర్తలు, మహిళలు ముట్టడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 12,000కు పైగా గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అలాగే నియోజకవర్గ కేంద్రాలు, మునిసిపాలిటీలలో మోటార్‌సైకిల్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాలని నిర్ణయించారు.
ట్ జారీ చేసిన నోటీసులపై ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపై పలు కోణాల్లో వీరు చర్చించారు. ముఖ్యంగా సిట్ కేసీఆర్ వాంగ్మూలం రికార్డు చేయనున్న నేపథ్యంలో కేసీఆర్ తన వాంగ్మూలాన్ని ఎక్కడ, ఎలాంటి పరిస్థితుల్లో ఇవ్వాలన్న అంశంపై న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.
2023 అసెంబ్లీ ఎన్నికలలో కూడా పార్టీని విజయం దిశగా నడిపించి ముచ్చటగా మూడో సారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ తహతహలాడారు. అయితే ముచ్చటగా మూడో సారి సీఎం కావాలన్న కేసీఆర్ కలలు, ఆశలు నెరవేరలేదు. మరి ఇప్పుడు కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఏమిటనుకుంటున్నారా?
వైసీపీ 2024 ఎన్నికలలో ఘోర పరాజయం పాలవ్వడం, బూతు పురాణంతో డిఫేమ్ అయిన నేతలు ఒక్కరంటే ఒక్కరూ కూడా గెలవకపోవడం తెలిసిందే. ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీయులు దాదాపుగా నోరు కట్టేసుకున్నారు. కేసుల భయమైతేనేం.. జనం నోరు జారితే ఇక ఊరుకోరన్న బెరుకు అయితేనేం.. నోరు తెరిస్తే దూషణలు వినా మరోకటి మాట్లాడటం చేతగాని కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారంతా సైలెంట్ అయిపోయారు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్ మేరకు ఫిబ్రవరి 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో నంబర్ 11 తో నెటిజనులు మరో సారి వైసీపీని ట్రోల్ చేస్తున్నారు. 11 నుంచి ప్రారంభయమ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఆ 11 మందీ హాజరౌతారా? అంటూ సెటైర్లు పేలుస్తున్నారు.
అంబటి సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బూతు పురాణం విప్పారు. దీనిపై తెలుగుదేశం శ్రేణులు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబటి క్షమాపణకు డిమాండ్ చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.