వైసీపీ నేతలకు జగన్ భయంపోయిందా?

Publish Date:Jan 27, 2026

Advertisement

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  తీరుపై ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తి కనిపిస్తున్నది. పార్టీలో వన్ నుంచి హండ్రడ్ వరకూ అన్నీ ఆయనే అన్న చందంగా వ్యవహరిస్తుండటం, సీనియారిటీకి తగిన గుర్తింపు లేకపోవడం పట్ల వైసీపీయులు అసంతృప్తితో రగిలిపోతున్నారన్న వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అయితే జగన్ హయాంలో అధికారం అండ చూసుకుని ఇష్టారీతిగా చెలరేగిపోయి, అప్పటి ప్రతిపక్ష, ప్రత్యర్థి పార్టీలపై ఇష్టారీతిగా నోరు పారేసుకున్న వైసీపీ నాయకులకు మరో పార్టీలోకి వెళ్లే అవకాశం లేక, తప్పని సరి పరిస్థితుల్లో వైసీపీలో కొనసాగాల్సిన పరిస్థితి. అందుకే అధికారంలో ఉండగా నోటిని ఒక దూషణల కర్మాగారంగా మార్చుకుని మరీ చెలరేగిపోయిన వారంతా ఇప్పుడు నోరు కట్టేసుకున్నారు. మాట్లాడడానికే జంకుతూ సైలెంటైపో యారు. 

అదలా ఉంచితే.. వైసీపీ ఎకో సిస్టమ్ లో ప్రత్యర్థి పార్టీల నేతలతో మాట్లాడకూడదన్న అనధికార బ్యాన్ ఉంటుంది. అది జగన్ గీసిన లక్ష్మణ రేఖగా ఆ పార్టీ నేతలు భావిస్తారు. అందుకే ఇప్పటికీ అంటే.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్న ఘోర పరాజయం తరువాత కూడా  వైసీపీయులెవరూ కూటమి నేతలు తెలుగుదేశం కూటమి పార్టీల చెందిన నాయకులను కనీసం పలకరించను కూడా పలకరించరు. అయితే మౌనం, లేకుంటే తిట్ల పురాణం అన్నట్లుగా వారీ తిరు ఉంటుంది.  అయితే ఇప్పుడిప్పుడే పార్టీలో ఆ పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తున్నది. జగన్ భయం నుంచి  వైసీపీ నేతలు ఒక్కరొక్కరుగా బయటపడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

తాజాగా రిపబ్లిక్ డే సందర్బంగా సోమవారం (జనవరి 26) గవర్నర్ ఇచ్చిన తేనీటి విందు (ఎట్ హోం) కార్యక్రమానికి శాసనమండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. అలా హాజరైన బొత్స సత్యనారాయణ.. ఈ కార్యక్రమానికి హాజరైన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి,  మంత్రి లోకేష్ వద్దకు స్వయంగా వెళ్లి, కరచాలనం చేసి ఆత్మీయంగా పలకరించి ముచ్చటించారు. రెండు నిముషాలకు పైగా బొత్స సత్యనారాయణ నారా లోకేష్ తో సరదాగా సంభాషించారు. లోకేష్, బొత్స ఇరువురూ నవ్వుతూ సరదాగా మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి.  

ఇదే ఇప్పుడు జగన్ అంటే వైసీపీ నేతలకు భయం పోయిందా అన్న అనుమానాలు వ్యక్తం కావడానికి కారణమయ్యాయి. ఎందుకంటే.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తమ పార్టీ నేతలు ప్రత్యర్థులతో మాట్లాడటం అసలు రుచించదు. రాజకీయ ప్రత్యర్థులు వ్యక్తిగత శత్రువులేనన్నట్లుగా జగన్ భావిస్తారు. వారితో తమ పార్టీ నేతలు ఎవరు మాట్లాడినా,  వాళ్లని దూరం పెడతారు. ఈ విషయం బొత్స సత్యనారాయణకు తెలియంది కాదు.  గతంలో ఒక సారి జనసేనాని పవన్ కల్యాణ్ తో మాట్లాడి సందర్భంగా ఆయన ఆ పరిస్థితి ఎదుర్కొన్నారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. అయినా కూడా బొత్స సత్యనారాయణ లోకేష్ తో ఆత్మీయంగా పలకరించడం చూస్తుంటే.. జగన్ లెక్కేమిటన్నట్లుగా ఆయన వ్యవహరించినట్లు కనిపిస్తోందని వైసీపీ వర్గాలే అంటున్నాయి. అంతే కాదు.. ఇటీవల నియోజకవర్గ మార్పు విషయంలో మాజీ మంత్రి విడదల రజని సైతం తన అసంతృప్తిని ఒకింత బాహాటంగానే వ్యక్తం చేసిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవలసి ఉంటుంది. అలాగే పేర్ని నాని సైతం తమ పార్టీ అధికారంలో ఉండగా పాలనా పరంగా విఫలమవ్వడమే ఘోర పరాజయానికి కారణమని ఇటీవల వ్యాఖ్యానించారు. ఇవన్నీ చూస్తుంటే.. వైసీపీపై జగన్ పట్టు సడలుతోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
జోగి రమేష్ అరెస్టు భయంతో అజ్ణాతంలోకి వెళ్లడానికి కారణం ఏమిటంటే.. నారా లోకేష్ పై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసే కారణమంటున్నారు. ఆ కేసులో అనుచిత వ్యాఖ్యలే కాకుండా, జోగి రమేష్ కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారనీ, శాంతి భద్రతలకు భంగం కలిగే వ్యాఖ్యలు చేశారనీ పోలీసులు పేర్కొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు నేతృత్వంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు ఖమ్మం, వరంగల్‌ జాతీయ రహదారిపై బైఠాయించారు. ఆ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధానికి వారు ప్రయత్నించారు.
మునిసిపల్ ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థి మంచివాడు కాకపోయినా కేసీఆర్ ముఖం చూసి ఓటేయాలంటూ కేటీఆర్ అనడాన్ని తప్పుపట్టారు. ఇది ఆయన నియంతృత్వ ధోరణికి నిదర్శనమని దుయ్యబట్టారు.
అనర్హత వేటు భయంతో పాటు.. ఇంకా అసెంబ్లీ బహిష్కరణ అంటే పార్టీ ఎమ్మెల్యేలు తన మాట వినకపోవచ్చన్న ఆందోళన కూడా జగన్ అసెంబ్లీ బాయ్ కాట్ విషయంలో తన వైఖరి మార్చుకోవడానికి కారణం కావచ్చని పరిశీలకులు అంటున్నారు.
తెలుగుదేశం చరిత్రలో ఈ రీతిగా కార్యకర్తలు రెచ్చిపోవడం ఇదే మొదటి సారని పరిశీలకులు సైతం చెబుతున్నారు. అయితే తెలుగుదేశం కార్యకర్తలు, నేతలలో ఆగ్రహం కట్టలు తెంచుకోవడానికి కారణం వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలంతో దూషించడమే కారణం అంటున్నారు. అదే సమయంలో మరో మాజీ మంత్రి జోగు రమేష్ కూడా మంత్రి నారా లోకేష్ పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా తెలుగుదేశం శ్రేణులు ఫైర్ అయ్యాయి.
అయితే వైసీపీ నేతలు మాత్రం సిట్ చార్జిషీట్ లో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు ఆనవాళ్లే లేవని పేర్కొందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్ర‌బాబు తాజాగా స్పందించారు.
అంబటి భాష సరికాదని పేర్కొంది. ఇష్టారీతిగా మాట్లాడతాం, రక్షణ కల్పించండి అంటే ఎలా అని పేర్కొంది. నేరాలను అదుపు చేయడం, శాంతిభద్రతలను పర్యవేక్షించడమే పోలీసుల పని కాదన్న కోర్టు, సమాజంలో శాంతిని, సామరస్యాన్ని పెంపొందించాల్సిన బాధ్యత కూడా పోలీసు వ్యవస్థపై ఉందని పేర్కొంది.
ఆ సందర్భంగా అంబటి రాంబాబు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసభ్య పదజాలంతో దూషించారు. ఆయన చేసిన వ్యాఖ్య వీడియో రికార్డులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వ్యాఖ్యలపై అంబటిపై తెలుగుదేశం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు అంబటి రాంబాబును ఆయన నివాసంలో శనివారం (జనవరి 31) అర్ధరాత్రి దాటిన తరువాత అదుపులోనికి తీసుకుని పోలీసు వాహనంలో నల్లపాడు పోలీసు స్టేషన్ కు తరలించారు.
ఇప్పటికే సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తెలుగుదేశం నాయకుల ఫిర్యాదు మేరకు అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ఇలా ఉండగా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు ఇంటిని తెలుగుదేశం కార్యకర్తలు, మహిళలు ముట్టడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 12,000కు పైగా గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అలాగే నియోజకవర్గ కేంద్రాలు, మునిసిపాలిటీలలో మోటార్‌సైకిల్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాలని నిర్ణయించారు.
ట్ జారీ చేసిన నోటీసులపై ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపై పలు కోణాల్లో వీరు చర్చించారు. ముఖ్యంగా సిట్ కేసీఆర్ వాంగ్మూలం రికార్డు చేయనున్న నేపథ్యంలో కేసీఆర్ తన వాంగ్మూలాన్ని ఎక్కడ, ఎలాంటి పరిస్థితుల్లో ఇవ్వాలన్న అంశంపై న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.
2023 అసెంబ్లీ ఎన్నికలలో కూడా పార్టీని విజయం దిశగా నడిపించి ముచ్చటగా మూడో సారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ తహతహలాడారు. అయితే ముచ్చటగా మూడో సారి సీఎం కావాలన్న కేసీఆర్ కలలు, ఆశలు నెరవేరలేదు. మరి ఇప్పుడు కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఏమిటనుకుంటున్నారా?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.