శశికళ సహనం నశిస్తోంది... పన్నీర్ వ్యూహం ఫలిస్తోంది!

Publish Date:Feb 11, 2017

Advertisement

 

తమిళనాడు సీఎం ఎవరు అవుతారు? శశికళనా? పన్నీర్ సెల్వమా? ఈ ప్రశ్నలకి సమాధానాలు అంత తేలిగ్గా దొరికేవి కావు. ప్రస్తుతానికి అందరూ ఒకరిని మించి ఒకరు తెలివిగా పావులు కదుపుతున్నారు. శశికళ ఎమ్మెల్యేల్ని బంధించి పట్టుబిగిస్తే... ఆమె ప్రజా ప్రతినిధుల్ని నిర్బంధించిందనే అంశమే ఆమెకు వ్యతిరేకంగా పన్నీర్ వాడుతున్నాడు. మరో వైపు గవర్నర్ విద్యాసాగర్ రావు ఏ మాత్రం తొందరపాటు లేకుండా రూల్స్ ప్రకారం అడుగులు వేస్తున్నారు. తనని ఎవ్వరి తప్పుపట్టటానికి లేకుండా చర్యలు తీసుకుంటూనే శశికళకి చెక్ పెడుతున్నారు. మధ్యలో శశి, పన్నీర్ క్యాంపుల్లో వున్న ఎమ్మెల్యేలు కూడా తమ లాభ, నష్టాలు, భవిష్యత్ అంచనా వేసుకుని స్టేట్మెంట్లు ఇస్తున్నారు!

 

చెన్నై రాజకీయం మంచి సస్పెన్స్ థ్రిల్లర్ లా సాగుతున్నా శశికళ మాత్రమే అందరికంటే ఎక్కువ ప్రభావితం అవుతోన్నట్టు కనిపిస్తోంది. ఆమె ఆశలు అంతకంతకూ అడియాసలు అవుతున్నకొద్దీ సహనం నశించి చిరాకు, కోపం, ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నట్టు కనిపిస్తోంది! పన్నీర్ సెల్వం చాలా సౌమ్యుడుగా, విధేయుడుగా కనిపిస్తూనే తన అపార రాజకీయ అనుభవం ఇంతకాలం జయ చాటు నిచ్చెలిగా వున్న శశిపై ప్రయోగిస్తున్నాడు. గడిచే ఒక్కో రోజుకీ పన్నీర్ ప్రజల నాయకుడిగా మారుతున్నాడు. అదే సమయంలో శశికళ సీఎం పదవి కోసం పాకులాడుతున్న కరుడుగట్టిన నాయకురాలిగా మారిపోతోంది! దానికి తోడు తాజాగా చిన్నమ్మ చేసిన హెచ్చరిక జనంలోకి మరింత నెగటివ్ సిగ్నల్స్ పంపినట్టే అనిపిస్తోంది!

 

శశికళ పొయెస్ గార్డెన్ లో అన్నాడీఎంకే కార్యకర్తలతో మాట్లాడుతూ ఎవరి సహనానికైనా హద్దుంటుందీ అంటూ వారెంట్ ఇచ్చారు. ఇది ఖచ్చితంగా పన్నీర్ సెల్వమ్ కి మాత్రమే కాదు. తమ సహనం నశిస్తే తీవ్ర పరిణామాలు వుంటాయని ఆమె పన్నీర్ కి, ఆయన వెనుక వున్న డీఎంకే, బీజేపి లాంటి పార్టీలకి కూడా హెచ్చరిక పంపారు. ఇదే శశికళ చేసిన తప్పు. ఎందుకంటే, ఆమె పార్టీ నుంచి సస్పెండ్ చేసిన మధుసూదనన్ లాంటి సీనియర్ నేతలు ఆమెనే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించే దాకా పరిస్థితి వెళ్లిపోయింది! ఒక్కో రోజు గడుస్తున్న కొద్దీ ఒక్కో ఎమ్మెల్యే, ఎంపీ, సీనియర్ నాయకుడు శశికళ చేజారిపోతున్నారు! ఇటువంటి సమయంలో ఆమె తగ్గి వుండాలి. కాని, అలా కాకుండా గవర్నర్ తో సహా అందరికీ వర్తించేలా సహనం నశిస్తుంది అంటూ చెప్పటం దురుసుతనమే అవుతుంది! ప్రజల్లో మిగిలిన మద్దతు కూడా ఇంకిపోయే అవకాశం వుంది!

 

అవినీతి కేసులు, సుప్రీమ్ తీర్పు, జయ మృతిపై చాలా మందికున్న అనుమానాలు, మన్నార్ గుడి మాఫియా అనే ముద్ర ... ఇన్నీ వున్న శశికళ సీఎం అవ్వటం చాలా కష్టం. అలాంటప్పుడు దురుసుగా, దూకుడుగా ప్రత్యర్థులపై విరుచుకుపడితే ముందుకు సాగటం మరింత కష్టమవుతుంది. అసాధ్యం కూడా అవ్వచ్చు. ఎందుకంటే, మొండితనం జయలలిత లాగా జనంలో ఫాలోయింగ్ వున్న వారికి చెల్లుతుంది కాని... అందరికీ కాదు!

By
en-us Political News

  
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు.
పెద్దిరెడ్డి కి వ్యతిరేకంగా చెవిరెడ్డి పావులు కదుపుతున్నట్లు వైసీపీలోనే ప్రచారం నడుస్తోంది. కుప్పంలో చంద్రబాబుని, హిందూపురంలో బాలకృష్ణని ఓడించడానికి అప్పట్లో పెద్దిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. జగన్ ఫుల్ సపోర్ట్ ఆయనకి ఉండటంతో అప్పట్లో జిల్లా నేతల్లో ఎవరూ అయన్నివ్యతిరేకించే సాహసం చేయలేకపోయారు.
తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోడీ కేబినెట్ ప్రక్షాళనలో డీకే అరుణకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వైసీపీ తరపున గవర్నర్ కోటాలో నామినేట్ అయిన జకియా ఖానం, పందుల రవీంద్రబాబుల పదవీ కాలం నెల రోజుల్లో ముగియనుంది. దీనితో ఖాళీ అవుతున్న ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం కూటమి దక్కించుకోనుంది.
ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్నో ఆలయాలు నిధులు లేక, ధూపదీప నైవేద్యాలు కరవై శిథిలావస్థకు చేరుకుంటుంటే.. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఆలయాలకు శ్రీవాణి నిధులు కేటాయించడమేంటన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో కొండగట్టు వంటి తెలంగాణ ఆలయాలకు టిటిడి నిధులు ఇవ్వడంపై అక్కడి కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ఆలయాల అభివృద్ధికి ఏపీ నిధులు ఎందుకు కేటాయించాలంటూ సోషల్ మీడియాలో విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన రాష్ట్రంలో మరింత బలోపేతం కావడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రణాళికా బద్ధంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే గత ఎన్నికలలో ఘోర పరాజయంతో కుదేలై ఉన్న వైసీపీని మరింత బలహీన పరిచే దిశగా వ్యూహాలు రచిస్తోంది.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు పార్టీ శ్రేణులతో పాటు.. ఆయన పార్టీకే చెందిన సొంత సామాజిక వర్గ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాలు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.