హైదరాబాదులో ఈ సిగరెట్ రాకెట్ బట్టబయలు.. ముగ్గురు అరెస్ట్

Publish Date:Apr 11, 2026

Advertisement

హైదరాబాద్‌లో నిషేధిత ఈ-సిగరెట్ల అక్రమ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు.  హైదరాబాద్ సిటీ పోలీసులు, టాస్క్ ఫోర్స్ ఖైరతాబాద్ జోన్ బృందం, నాంపల్లి  పోలీసులతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి భారీగా ఈ-సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు.

అత్యంత విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు   బజార్‌ఘాట్ ‘ఏ’ బ్యాటరీ లైన్ సమీపంలో పోలీసులు నిఘా ఉంచారు. ఈ సమయంలో ద్విచక్ర వాహనంపై నిషేధిత ఈ-సిగరెట్లు సరఫరా చేస్తున్న మొహమ్మద్ అహ్మద్‌)ను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో సరుకును స్వీకరించేందుకు వచ్చిన మొహమ్మద్ అస్జాద్ రజాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు అత్తాపూర్‌లోని వినీత్ మంత్రి  నివాసంపై దాడి జరిపి అతడిని కూడా అరెస్ట్ చేశారు.

విచారణలో నిందితులు సోషల్ మీడియాను వినియోగిస్తూ అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. వాట్సాప్,  టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా కస్టమర్లను సంప్రదించి ఆర్డర్లు స్వీకరించేవారని పోలీసులు తెలిపారు. చెల్లింపులు ఫోన్ పే ద్వారా తీసుకుని, సరుకును రాపిడో, పోర్టల్ డెలివరీ సేవలతో పంపిణీ చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఢిల్లీకి చెందిన వ్యక్తి నుంచి పార్సిల్ సర్వీస్ ద్వారా ఈ సరుకును పెద్ద మొత్తంలో తెప్పించేవారని కూడా పోలీసులు గుర్తించారు.

ఈ ఆపరేషన్‌లో పోలీసులు మొత్తం 999 ఎలక్ట్రానిక్ సిగరెట్లు, ఒక బర్గ్‌మాన్ ద్విచక్ర వాహనం, నాలుగు మొబైల్ ఫోన్లు,  ప్యాకింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ   రూ.34.03 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.  

By
en-us Political News

  
అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరోసారి తన కఠిన వైఖరిని రుచిచూపించింది.
వయసు పైబడితే చాలు విశ్రాంతి కోరుకుంటారు ఎవరైనా. 60 ఏళ్లు దాటాయంటే మోకాళ్ల నొప్పులని, ఓపిక లేదని ఇంటికే పరిమితమవుతారు.
దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణం శనివారం ఒక అరుదైన మరియు ఆత్మీయ దృశ్యానికి వేదికైంది.
డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరిస్తున్న ఈ రోజుల్లో, టెక్నాలజీ ప్రభావం సమాజంలోని ప్రతి వర్గానికీ ఎలా చేరుతోందో చూపించే ఆసక్తికర ఉదాహరణ ఇది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలను విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది.
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని గిర్నిబావి గ్రామంలో ఓ రైతు పొలం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
సాధారణంగా బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్లు కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం—ప్రాణ భద్రత.
77 ఏళ్ల గణపతి ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్యలతో అంటే డయాబెటిస్, కీళ్లనొప్పులు, ఇతర వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు పార్టీ ఆయనను అడవుల నుంచి బయటకు పంపిందని సమాచారం.
అమెరికా విధించిన రెడ్ లైన్స్ వెనుక బలమైన కారణం ఉందన్న జేడీ వాన్స్, ఇరాన్ గనుక అణ్వాయుధాన్ని సాధిస్తే, అది ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధ పోటీకి దారితీస్తుందన్నారు. ఇరాన్ అణు కార్యక్రమం ఒక్క అమెరికాకు మాత్రమే కాదు ప్రపంచ శాంతికే ముప్పన్నారు.
హైదరాబాద్ వాతావరఖ కేంద్రం విడుదల చేసిన తాజా బులిటెన్ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయి. . రానున్న పది రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకూ చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నైతొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ఆరంభం నుంచే ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 56 బంతుల్లోనే 15 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఈ దుర్ఘటనలో ప్రముఖ న్యాయవాది బొద్దులూరి శ్రీనివాస్ రావు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. ఈ వార్త న్యాయవాదుల వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పలువురు న్యాయవాదులు సంతాపం తెలిపారు.
నీతి, నిజాయితీలతో కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎథికల్ ఎకనమిక్ ఎంపవర్మెంట్ (ఈ3) కార్యక్రమం చేపడతామన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.