అంతర్జాతీయ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు.. తెలంగాణ పోలీసులకు మెస్సీ బృందం అభినందనలు

Publish Date:Dec 13, 2025

Advertisement

హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ స్థాయి ఫుట్‌బాల్ మ్యాచ్‌కు పోలీసులు కల్పించిన పకడ్బందీ భద్రతా ఏర్పాట్లపై ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్‌ మెస్సీ మేనేజర్‌,  ఆయన భద్రతా బృందం కూడా  ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భం గా రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ)  బి. శివధర్‌రెడ్డి, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌   సుధీర్‌బాబులను వారు ప్రత్యేకంగా అభినందించారు. మ్యాచ్ అనంతరం, మెస్సీ బృందం సంతృప్తి  వ్యక్తం చేసింది. అంతర్జా తీయ స్థాయిలో జరిగిన ఈ హైప్రొఫైల్‌ క్రీడా కార్యక్రమానికి పోలీసులు చేపట్టిన భద్రతా చర్యలు అత్యుత్తమంగా ఉన్నాయని పేర్కొంది. స్టేడియం లోపలా బయటా కట్టుదిట్టమైన భద్రత, ట్రాఫిక్‌ నియంత్రణ, వేలాది మంది ప్రేక్షకుల రాకపోకలను సజావుగా నిర్వహించడం ప్రశంసనీయమని తెలిపింది.

ముఖ్య అతిథులు, మెస్సీ బృందం రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలె త్తకుండా పోలీసులు తీసుకున్న జాగ్రత్తలు తమను ఎంతగానో ఆకట్టుకున్నా యని మెస్సీ మేనేజర్‌ పేర్కొన్నారు. భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చినా, ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకో కుండా, ప్రశాంత వాతావరణంలో మ్యాచ్‌ ముగియడం పోలీసుల ప్రొఫెషనల్ ఎఫిషియెన్సీకి నిదర్శనమని పొగడ్తల వర్షం కురిపించారు. మెస్సీ, ఆయన బృందానికి కల్పించిన ఎస్కార్ట్‌ సేవలు, భద్రతా ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా ఉన్నాయని తెలిపారు. మెస్సీ బృందం నుంచి వచ్చిన ఈ అభినందనలు రాష్ట్ర పోలీసు శాఖకు గర్వకారణంగా నిలవడమే కాకుండా, వారి సామర్థ్యానికి అంతర్జాతీయ గుర్తింపుగా మారాయని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శనివారం  ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ మ్యాచ్ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, పోలీసు అధికారులు, సిబ్బందిని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్    బి. శివధర్ రెడ్డి అభినందించారు.
ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్ సందర్భంగా  చిన్న లోటుపాట్లకు కూడా అవకాశం ఇవ్వకుండా విజయవంతంగా ముగిసేలా పకడ్బందీగా భద్రతా చర్యలు చేపట్టారని డీజీపీ ప్రశంసించారు. భద్రతా ఏర్పాట్లను డీజీపీ  బి. శివధర్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మెస్సీ మ్యాచ్ నేపథ్యంలో భారీ భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.

శనివారం (డిసెంబర్ 13) ఉదయం కోల్‌కతా లో జరిగిన ఘటనను దృష్టి లో పెట్టుకుని అప్రమత్తమై, అక్కడ చోటుచేసుకున్న లోపాలను విశ్లేషించి, ఉప్పల్ స్టేడియంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు వివరించారు. అభిమానులు ఎవరూ గ్రౌండ్‌లోకి ప్రవేశించ కుండా ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నామని చెప్పారు.మ్యాచ్ ప్రశాంతం గా, విజయవంతంగా ముగియడంలో సహ కరించిన ఫుట్‌బాల్ క్రీడాభిమానులు, మెస్సీ అభిమానులకు డీజీపీ శ్రీ బి. శివధర్ రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. 

By
en-us Political News

  
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్ష‌త‌న తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం నిర్వహించారు.
నిందితుడైన సాజిత్ అక్రమ్ వద్ద ఇండియన్ పాస్‌పోర్ట్ ఉన్నట్లు దర్యాప్తు అధికారులు నిర్ధారించారు.సాజిత్ అక్రమ్ హైదరాబాద్ నుంచి పాస్‌పోర్ట్ పొందినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అంతే కాకుండా, అతడు హైదరాబాద్ నుంచి ఫిలిప్పీన్స్, పాకిస్తాన్‌కు ప్రయాణించినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తు న్నాయి.
మోనాలిసా అనే మహిళ తన ఏడేళ్ల కుమార్తె షారోని మేరిని ఒక్కసారిగా బిల్డింగ్ మూడో అంతస్తు పైనుంచి కిందకు తోసివేసింది‌. పెద్ద ఎత్తున శబ్దం రావడంతో స్థానికులు బయటికి వచ్చి చూడగా చిన్నారి రక్తమడుగులో పడి ఉంది.
చాకలి ఐలమ్మ మ‌హిళా యూనివ‌ర్సిటీ మెస్ ఇంఛార్జ్ వినోద్ స‌స్పెండ్‌ను ప్రిన్సిపాల్ సస్పెండ్ చేశారు.
బ్రెజిల్ ను తుపాను అతలాకుతలం చేసింది. రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలో గుయైబా నగరంలో సంభవించిన తీవ్ర తుఫాను ధాటికి స్థానిక రిటైల్ స్టోర్ హవాన్ మెగాస్టోర్ బయట ఏర్పాటు చేసిన 79 అడుగుల ఎత్తైన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం నెమ్మదిగా ముందుకు వంగి చూస్తుండగానే ఖాళీ పార్కింగ్ స్థలంలో పడిపోయింది.
ఆయన నికర సంపద ఫోర్బ్స్, బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 600 బిలియన్ డాలర్లు దాటేసింది. ఐపీఓకు రాబోతున్న స్పేస్ ఎక్స్ విలువ అమాంతం పెరగడంతో దాంట్లో మెజార్టీ వాటా ఉన్న మస్క్ సంపద విపరీతంగా పెరిగింది. ఒక్కరోజులోనే ఏకంగా రూ. 15 లక్షల కోట్లకుపైగా సంపద పెరగడంతో ప్రస్తుతం మస్క్ గురించే అంతా చర్చించుకుంటున్నారు.
బ్రిటన్‌లో చట్టాన్ని అతిగా అమలు చేసిన ఆ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 86 ఏళ్ల వృద్ధుడు రాయ్ మార్ష్.. తన నోట్లోకి గాలికి వెళ్లిన ఒక ఆకును ఉమ్మేసినందుకు గానూ స్థానిక అధికారులు ఏకంగా 250 పౌండ్లు జరిమానా విధించారు.
భాను ప్రకాష్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుచేశాయి. భాను ప్రకాష్ సర్వీస్ రివాల్వర్ మే నెల నుంచే మిస్సైందని తేలింది. అంతే కాకుండా భాను ప్రకాష్ సర్వీస్ రివాల్వర్ చోరీకి గురి కాలేదనీ, స్వయంగా భాను ప్రకాషే తన గన్ ను దొంగతనంగా బయటకు తీసుకువెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో రూఢీ అయ్యింది.
మహిళల వన్డే వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీలో టీమ్ ఇండియా విజేతగా నిలవడంలో శ్రీచరణ్ రెడ్డి కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. డప జిల్లాకు చెందిన 21 ఏళ్ల శ్రీచరణి, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తున్నారు.
అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్) కాంగ్రెస్‌ పార్టీ రూ.90 కోట్ల రుణం అందించి దాని ఆస్తుల్ని ఆధీనంలోకి తీసుకోగా.. రాహుల్‌, సోనియాకు మెజార్టీ వాటా ఉన్న యంగ్‌ ఇండియా రూ.50 లక్షలు మాత్రమే కాంగ్రెస్‌ పార్టీకి చెల్లించి ఏజేఎల్‌ను సొంతం చేసుకొన్నట్లు ఈడీ చెబుతోంది.
రెండేళ్ల బాలికను అపహరించి, ఆపై హత్యాచారానికి పాల్పడిన ఘటనలో నిందితుడి క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి దౌపది ముర్ము తిరిస్కరించారు.
గత రెండు దశాబ్దాలుగా అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. ఈ చట్టంలో మహాత్మాగాంధీ పేరును తొలగించి వికసిత భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) బిల్లు, 2025 ను లోక్ సభలో ప్రవేశ పెట్టనుంది.
విమానం కూలిపోగానే మంటలు చెలరేగి, ఆ ప్రాంతమంతా దట్టమైన పోగకమ్ముకుంది. విమానం క్రాష్ కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.