రెండేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడికి క్షమాభిక్ష తిరస్కరించిన రాష్ట్రపతి
Publish Date:Dec 16, 2025
Advertisement
రెండేళ్ల బాలికను అపహరించి, ఆపై హత్యాచారానికి పాల్పడిన ఘటనలో నిందితుడి క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి దౌపది ముర్ము తిరిస్కరించారు. ఆమె దేశాధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తిరస్కరణకు గురైన వాటిలో ఇది మూడో క్షమాభిక్ష పిటిషన్‌గా నిలిచింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు.. నిందితుడైన అశోక్‌కు మరణ శిక్ష విధిస్తూ 2015 సెప్టెంబర్ 15 తీర్పునిచ్చింది. దీనిని 2016 జనవరిలో బాంబే హైకోర్టుసమర్థించింది. ఆ తర్వాత.. సుప్రీంలో ఈ కేసు విచారణకు రాగా 2019 అక్టోబర్ 03న అతడిమరణ శిక్షను ధృవీకరిస్తూ.. నిందితుడు తన లైంగిక వాంఛ తీర్చుకోవడం కోసం సామాజిక, చట్టపరమైన నిబంధలను ఉల్లంఘించాడని పేర్కొంది. ఈ విషయమై అశోక్ ఘుమారే.. క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి పిటిషన్ పెట్టుకున్నారు. అయితే ఆ పిటిషన్‌ను దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము తిరస్కరించారని అధికారులు తెలిపారు. దీంతో నిందితునికి మరణశిక్ష ఖాయమైనట్టైంది.
మహారాష్ట్ర జల్నా నగరంలోని ఇందిరానగర్ ప్రాంతంలో.. 2012లో అశోక్ ఘుమారేఅనే వ్యక్తి రెండేళ్ల చిన్నారిని చాక్లెట్ ఇస్తానని ప్రలోభపెట్టి కిడ్నాప్ చేశాడు. తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడి, చివరకు ఆ పసికందును హతమార్చాడు.
http://www.teluguone.com/news/content/president-murmu-rejects-mercy-36-211062.html





