నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు నిర్వహణకు కసరత్తులు వేగవంతమయ్యాయి. మహానాడుకు అనువైన స్థలాల ఎంపికలో భాగంగా పార్టీ నేతలు విస్తృతంగా పరిశీలనలు చేపట్టారు. కోవూరు జాతీయ రహదారి సమీపంలోని రాజుపాలెం పరిసరాల్లో ఉన్న ఇఫ్కో భూములు, అలాగే బొడ్డువారిపాలెం వద్ద ఉన్న సుమారు 110 ఎకరాల విస్తీర్ణాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నేతృత్వంలో పరిశీలించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కాకర్ల సురేష్, కృష్ణారెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహణకు అనువైన ప్రదేశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. రాజుపాలెం సమీపంలోని ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా స్థలాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. నెల్లూరు రూరల్, సర్వేపల్లి నియోజకవర్గాల్లో కూడా అనువైన స్థలాలపై పరిశీలన కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
అన్ని ప్రదేశాలను పరిశీలించిన అనంతరం వివరాలను కేంద్ర పార్టీకి నివేదిస్తామని, అనంతరం కేంద్ర టీమ్ మరోసారి పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. మహానాడు నిర్వహణకు సరైన వసతులు, రవాణా సౌకర్యాలు, విస్తీర్ణం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని తుది స్థలాన్ని ఎంపిక చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు మరింత వేగం పుంజుకున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/inspection-of-sites-for-mahanadu-in-nellore-36-218729.html
ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్‌ను హైదరాబాద్ సీపీ సజ్జనర్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.
ఈ విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రిచ్ కిడ్స్ను మాత్రమే టార్గెట్ చేసుకొని వారితో మెల్లిమెల్లిగా సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయం పెంచుకుం టున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన లైఫ్ స్టైల్ చూపిస్తూ ప్రొఫైల్ తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఎస్కార్ట్ గా ఉంటూ రొమాంటిక్ మూడ్ అంటూ మైనర్లకు వల విసురుతున్నారు.
ఈ కొత్త జోన్ వచ్చెనెల మొదటి తేదీ నుంచీ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని నోటిఫికేషన్ పేర్కొంది. దీంతో, ఇండియన్ రైల్వేలో దక్షిణ కోస్తా రైల్వే 18వ జోన్‌గా అవతరించనుంది.
ఈ ఆపరేషన్‌లో మొత్తం ఆరు స్టోన్ క్రషింగ్ యూనిట్లను నేలమట్టం చేయడంతో పాటు.. 12 ఆర్‌ఎంసీ ప్లాంట్లను పూర్తిగా తొలగించారు. భవిష్యత్తులో అక్కడ మళ్లీ క్రషింగ్ కార్యకలాపాలు జరగకుండా యంత్ర సామగ్రిని స్వాధీనం చేసుకుని తరలించారు. గతంలో మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖలు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగించడంతో ఈసారి శాశ్వతంగా చెక్ పెట్టినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 21 బంతుల్లోనే ఒక ఫోరు, 8 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
డ్రోన్ దాడి జరిగిన వెంటనే పెట్రోలియం జోన్‌లోని ఒక విభాగంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ముగ్గురు భారతీయులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సహాయక బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది.
చాందీ ఉమ్మన్, తన తండ్రి పేరిట ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేరళలోని కన్నూర్ కు బయలుదేరిన ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి మళ్లీ గెలిచారు. ఎన్టీఏ కూటమి భాగస్వామిగా రెండో సారి పదవీ స్వీకారానికి సిద్దమయ్యారు.
అవి 2021 తమిళనాడు శాసన సభ ఎన్నికలు...
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.