జూబ్లీహిల్స్ మైనర్ బాలికల ట్రాప్ అండ్ రేప్ కేసులో..వెలుగులోకి విస్తుపోయే విషయాలు

Publish Date:May 5, 2026

Advertisement

హైదరాబాదు జూబ్లీహిల్స్ లో  మైనర్ బాలికల ట్రాప్ అండ్ రేప్ చీటింగ్ కేసులో సంచలనమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గుంటూరు జిల్లాకు చెందిన అర్జున్ అలియాస్ చంద్రశేఖర్ ఆజాద్, రాజీవ్ జూబ్లీహిల్స్ లోని బడా బాబుల కూతుర్లను టార్గెట్ గా చేసుకొని వారిని ట్రాప్ చేసి వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్న ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు ఈ  అన్నదమ్ములిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే.  అయితే ఈ  అన్నదమ్ములిద్దరూ కలిసి మొత్తం 19 మంది మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.

వీరిద్దరిని కస్టడీలోకి తీసుకొని విచారణ చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ దాదాపు మూడు గంటల పాటు నిందితులను స్వయంగా విచారించారు.  ఈ విచారణలో  విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రిచ్ కిడ్స్ను మాత్రమే టార్గెట్  చేసుకొని వారితో  మెల్లిమెల్లిగా సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయం పెంచుకుం టున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన లైఫ్ స్టైల్ చూపిస్తూ ప్రొఫైల్ తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఎస్కార్ట్ గా ఉంటూ రొమాంటిక్ మూడ్ అంటూ మైనర్లకు వల విసురుతున్నారు.  మైనర్ బాలికలు తనకు అట్రాక్ట్ అయ్యేలా అర్జున్ ఇంస్టా గ్రామ్ లో రీల్స్ పోస్ట్ చేసేవాడు.  

అలా మొదట గా స్నేహంగా ప్రారంభమై..  చాటింగ్ తర్వాత నెమ్మదిగా వ్యక్తిగత పరిచయాలు పెంచుకుంటూ వలలోకి దింపారు.  ఖరీదైన కార్లలో డ్రైవ్స్, లైఫ్ స్టైల్ చూపిస్తూ నమ్మకం పెంచుకున్నారు. ఇలా అర్జున్ ఇంస్టాగ్రామ్ ను మొత్తం 150 మంది బాలి కలు ఫాలో అవుతున్నారు. అంతటితో  ఆగలేదండోయ్ ఈ ఇద్దరు అన్నదమ్ములు లగ్జరీ కార్లలో తిప్పుతూ తమతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవా లంటూ ఒత్తిడి చేసేవారు. కొన్ని సందర్భా ల్లో మైనర్ బాలికలతో సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలు కూడా రికార్డు చేశారు.  తాము త్వరలోనే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామని అందుకు కొంత డబ్బులు అవసరం ఉన్నాయంటూ మాయ మాటలు చెప్పి డబ్బులు వసూలు చేశారు.  అలా ఒక మైనర్ బాలిక నుండి 13 లక్షల రూపా యలు వసూలు చేశారు.  మైనర్ బాలిక ఇంట్లో ఈ వ్యవహారం   తెలియ డంతో వెంటనే వారు పోలీసులను ఆశ్రయించారు.

దీంతో  ఈ ఘటన వెలుగు లోకి వచ్చింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఇద్దరు అన్నదమ్ములకు తల్లి మీనా కుమారి సహకరి స్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. గతంలో కూడా అర్జున్ ఓ మైనను బాలికను ట్రాక్ చేసిన కేసులో మూడు రోజుల పాటు జైలుకు వెళ్లి తిరిగి బయటికి వచ్చిన తర్వాత మళ్లీ అటువంటి మోసాలకే పాల్పడుతున్న ట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు ప్రస్తుతం అర్జున్ ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ లాక్ చేసి.  దర్యాప్తు ముమ్మరం చేశారు.

By
en-us Political News

  
ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్‌ను హైదరాబాద్ సీపీ సజ్జనర్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.
ఈ కొత్త జోన్ వచ్చెనెల మొదటి తేదీ నుంచీ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని నోటిఫికేషన్‌ పేర్కొంది. దీంతో, ఇండియన్ రైల్వేలో దక్షిణ కోస్తా రైల్వే 18వ జోన్‌గా అవతరించనుంది.
ఈ ఆపరేషన్‌లో మొత్తం ఆరు స్టోన్ క్రషింగ్ యూనిట్లను నేలమట్టం చేయడంతో పాటు.. 12 ఆర్‌ఎంసీ ప్లాంట్లను పూర్తిగా తొలగించారు. భవిష్యత్తులో అక్కడ మళ్లీ క్రషింగ్ కార్యకలాపాలు జరగకుండా యంత్ర సామగ్రిని స్వాధీనం చేసుకుని తరలించారు. గతంలో మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖలు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగించడంతో ఈసారి శాశ్వతంగా చెక్ పెట్టినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 21 బంతుల్లోనే ఒక ఫోరు, 8 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
డ్రోన్ దాడి జరిగిన వెంటనే పెట్రోలియం జోన్‌లోని ఒక విభాగంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ముగ్గురు భారతీయులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సహాయక బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది.
చాందీ ఉమ్మన్, తన తండ్రి పేరిట ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేరళలోని కన్నూర్ కు బయలుదేరిన ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి మళ్లీ గెలిచారు. ఎన్టీఏ కూటమి భాగస్వామిగా రెండో సారి పదవీ స్వీకారానికి సిద్దమయ్యారు.
అవి 2021 తమిళనాడు శాసన సభ ఎన్నికలు...
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.