పట్టాలు తప్పిన ప్రయాణం

Publish Date:Nov 21, 2016

Advertisement

నిన్న ఉదయం ఇండోరు నుంచి పట్నాకు వెళ్తున్న రైలు, ఘోర ప్రమాదానికి గురి కావడంతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆదివారం తెల్లవారుజామున ఆదమరచి నిద్రపోతున్న వంద మందికి పైగా ప్రయాణికులు నిద్రలోనే ప్రాణాలను కోల్పోయారు. ప్రమాదం జరిగిన తీవ్రత దృష్ట్యా... గత పదేళ్లలో ఇదే భారీ రైలు ప్రమాదంగా భావిస్తున్నారు. ఇంతమంది ప్రాణాలను బలిగొన్న ఈ భారీ ప్రమాదానికి కేవలం మానవ నిర్లక్ష్యమే కారణం అన్న విశ్లేషణ మరింత బాధకి గురిచేస్తోంది.

 

రోజూ లక్షలాదిమందిని గమ్యస్థానానికి చేర్చడంలో భారతీయ రైల్వేకు ప్రపంచంలో మరే ప్రయాణ సంస్థా సాటిరాదు. కానీ భద్రతాపరంగా తన ముందు ఉన్న సవాళ్లను రైల్వేశాఖ ఇప్పటికీ ఛేదించలేకపోతోందన్న ఆరోపణకు తాజా సంఘటను ఉదాహరణగా నిలుస్తోంది. ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు నేతలంతా హుటాహుటిన అక్కడికి చేరుకోవడం, సహాయక చర్యలను చేపట్టడం, భారీ నష్టపరిహారాన్ని అందించడం వరకూ అంతా బాగానే ఉంటుంది. కానీ అసలు ప్రమాదం జరగకుండా ఎలాంటి చర్యలు సాగుతున్నాయి అన్నదానికి తగిన జవాబులు లభించడం లేదు.

 

గత రైల్వే బడ్జెటుని మినహాయిస్తే ప్రతిసారీ రైల్వే మంత్రులు ఇన్ని కొత్త రైళ్లను ప్రవేశపెట్టాము, ఇన్ని ప్రాజెక్టులను చేపట్టాము అంటూ ఊదరగొట్టేవారు. చేతిలో రైల్వే శాఖ ఉంది కదా అని పుట్టింటికీ, అత్తవారింటికీ మధ్య రైలుని ఏర్పాటుచేసుకున్న మహానుభావులూ లేకపోలేదు. కానీ భద్రత విషయంలోనూ, సౌకర్యాల విషయంలోనూ రైల్వే వ్యవస్థను ప్రక్షాలను చేసే సాహసాన్ని మాత్రం ఎవ్వరూ చేయలేకపోయారు. ఒకరకంగా నిన్న జరిగిన రైల్వే ప్రమాదం అలాంటి నిర్లక్ష్యపు ఫలితమే అని చెప్పుకోవచ్చు.

 

ప్రమాదం జరిగిన మార్గంలో పట్టాల నిర్వహణ సరిగా లేదని చెబుతున్నారు. ఈ 21వ శతాబ్దంలో రైలు పట్టాలు పగులుబారడం వల్ల వందమంది ప్రాణాలు కోల్పోయారని చెప్పుకోవడంకంటే సిగ్గుచేటు ఉండదు. ఒకవేళ ప్రమాదవశాత్తూ పట్టాలలో పగుళ్లు ఏర్పడ్డాయనుకున్నా లేదా ఏదో ఒక బోగీ చక్రాలు విరిగిపోయాయని అనుకున్నా... కాలం చెల్లిన సాంకేతికత కారణంగానే బోగీలన్నీ ఒకదానిలోకి ఒకటి దిగబడిపోయి నుజ్జునుజ్జయిపోయాయన్నది మాత్రం కాదనలేని వాస్తవం.

 

అయిపోయిందేదో అయిపోయింది అనుకోవడానికి పోయిన ప్రాణాలు తిరిగి వచ్చేవి కావు. కానీ మరింతమంది అభాగ్యులు ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వంతెనలు, క్రాసింగులు, పట్టాలు, బోగీలు, సిగ్నలింగ్... ఇలా వ్యవస్థలోని ప్రతి అంశాన్నీ ప్రక్షాళన చేయవలసి ఉంటుంది. అది వదిలేసి ఈ ప్రమాదం మోదీని అప్రదిష్టపాలు చేయడానికి పన్నిన కుట్రగా కొందరు భాజపీ ఎంపీలు విరుచుకుపడటం హాస్యాస్పదంగా ఉంది.

By
en-us Political News

  
లోక్‌సభ స్థానాలను 50 శాతం మేర పెంచే ప్రతిపాదనకు మద్దతు ఇవ్వడానికి ఇప్పటికే వైసీపీ అంగీకారం తెలిపింది.  కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే పునర్విభజన జరిగితే జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రాతినిధ్య పరంగా నష్టపోయే ప్రమాదం ఉందనీ, అందుకు భిన్నంగా 50శాతం పెంపునకు కేంద్రం ఓకే అంటే డీలిమిటేషన్ బిల్లుకు ఓకే అని వైసీపీ అధినేత ఇప్పటికే వెల్లడించారు.
ఈ సమావేశాలలో  రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టి  ఆమోదింపజేసుకోవాలన్న పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం ఉంది. అయితే రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం లభిస్తుందా? అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే సభలో మూడింట రెండొంతుల మంది సభ్యుల మద్దతు ఉంటేనే రాజ్యాం సవరణ బిల్లు ఆమోదం పొందుతుంది. అయితే సభలో ఎన్డీయే కూటమికి అందుకు అవసరమైనంత సంఖ్యా బలం లేదు.
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 1989 వరకు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆ కాలంలో కాంగ్రెస్‌కు చెందిన 11 మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు. అలాంటి బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కాంగ్రెస్ పార్టీ, నేడు ప్రాంతీయ పార్టీ అయిన ఎస్పీ కేటాయించే పరిమిత స్థానాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడటంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు పెచ్చరిల్లేలే చేయడానికి, తద్వారా తెలంగాణలో బీఆర్ఎస్ లబ్ధి పొందడానికి నానా కష్టాలూ పడ్డారు. అయితే అవేం ఫలించలేదు అది వేరే సంగతి. ఈ విషయం ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే.. జగన్, బీఆర్ఎస్ అధినాయకత్వం మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయనడానికే.
దీంతో ఆస్తిపై హక్కు కోరుతున్న షర్మిలే ఇది తమ కుటుంబ ఆస్తి అని నిరూపించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.  తనకు ఆ ఆస్తిపై హక్కు ఉందని షర్మిల నిరూపించుకోవాలంటే, ఆస్తి మూల యాజమాన్యం  నిధుల సమీకరణకు సంబంధించిన   ఆధారాలను సమర్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వైఎస్ తరువాత ఆ కుటుంబానికి పెద్దగా ఉండాల్సిన జగన్ ఆ బాధ్యతను మరచి తోడబుట్టిన చెల్లితో  ఆస్తుల కోసం పంచాయతీలు పెట్టడం, కోర్టులను ఆశ్రయించడం,   బహిరంగ విమర్శలు చేయడం ఆయన ప్రతిష్ఠను మసకబార్చిందని అంటున్నారు.
తాజాగా గురువారం జరిగిన ఎంపీపీ ఎన్నికలలో జిల్లాలోని మొత్తం 27 స్థానాలలో వైసీపీ పాతిక స్థానాలను తెలుగుదేశం కు కోల్పోయింది. వైసీపీ కేవలం గురివిడి ఎంపీపీ స్థానాన్ని మాత్రమే దక్కించుకోగలిగింది. మిగిలిన ఒక్క స్థానాన్ని తెలుగుదేశం కూటమి భాగస్వామ్యపార్టీ అయిన జనసే గెలుచుకుంది. 
జగన్ తన పాదయాత్రను వచ్చే ఏడాది మార్చి నుంచే ఆరంభించే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.   అన్ని అనుకున్నట్లు జరిగితే 2027 మార్చి నుంచే జగన్ తన పాదయాత్రకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ పుస్తకం కేవలం ఆమె ఆత్మకథగానే కాకుండా,   దేశ రాజకీయాలలో కీలకమైన మలుపులు, కుటుంబ బంధాలు, అంతర్గత సంఘర్షణలను సైతం బహిర్గతం చేసింది.  ఈ నేపథ్యంలో ఆమె ఆత్మకథ పుస్తకంలోని అంశాలపై, అందులో ప్రస్తావించిన వివాదాస్పద విషయాలు, అప్పటి రాజకీయాలలో వాటి ప్రభావంపై ఎడతెగని చర్చ జరుగుతోంది.  
రోజుల వ్యవధిలో రాష్ట్రంపై దాడి చేసిన అర్నాబ్, మురసు తుపానులను ఎదుర్కొనడంలోనూ చంద్రబాబు వినూత్న  ఆలోచనలు, వేగవంతమైన నిర్ణయాలు ప్రమాద తీవ్రతను గణనీయంగా తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయి.   ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఏమాత్రం తడబాటు లేకుండా, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం ద్వారా ఆయన తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. 
2019 ఎన్నికలు, ఆ తరువాత 2021 స్థానిక ఎన్నికలలో తిరుగులేని విజయాలను దక్కించుకున్న వైసీపీ, ఆ తరువాత 2024 ఎన్నికలలో ఘోర పరాజయం పాలైంది. ఈ పరాజయానికి కొనసాగింపు అన్నట్లుగా తాజాగా జరిగిన మునిసిల్, పరిషత్ ఎన్నికలలో కూడా ఘోరాతి ఘోరంగా పరాజయం పాలైంది.
రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తి.. రాష్ట్రంలో మాత్రం వారిని ఒక రోజే, మహా అయితే రెండు రోజులకు మించి మకాం వేయరు. ఇలా వచ్చి అలా బెంగళూరు వెళ్లిపోతుంటారు.  
ఈ ఎన్నికల సంగ్రామంలో ఒకప్పుడు రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం వహించిన కాంగ్రెస్ పార్టీ  సోదిలోకి కూడా కనిపించకపోవడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ దయనీయ పరిస్థితిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మౌనంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.