ఇండిగో సీఈవో రాజీనామా

Publish Date:Mar 10, 2026

Advertisement

 

భారతదేశంలోని అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌లలో ఒకటైన ఇండిగోలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సంస్థ సీఈఓగా ఉన్న పీటర్ ఎల్బర్స్ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ రాజీనామాను సంస్థ బోర్డు ఆమోదించినట్లు ఇండిగో వర్గాలు ప్రకటించాయి.

ఇండిగో ప్రకటన ప్రకారం పీటర్ ఎల్బర్స్ రాజీనామా తక్షణమే అమల్లోకి రానుంది. ఆయన స్థానంలో సంస్థ ఎండీ అయిన రాహుల్ భాటియా తాత్కాలికంగా సీఈఓ బాధ్యతలు స్వీకరించనున్నారు. కొత్త సీఈఓ నియామకం వరకు ఆయన ఈ బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉంది.

2022 సంవత్సరం నుంచి ఇండిగో సీఈఓగా పీటర్ ఎల్బర్స్ పనిచేస్తున్నారు. ఆయన నాయకత్వంలో సంస్థ విస్తరణ, కొత్త మార్గాల ప్రారంభం వంటి చర్యలు చేపట్టినప్పటికీ ఇటీవల కొన్ని సమస్యలు సంస్థను ఇబ్బందుల్లోకి నెట్టాయి. ముఖ్యంగా గత డిసెంబర్‌లో ఇండిగోకు చెందిన 2,500కు పైగా విమానాలు రద్దు కావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రయాణికులు భారీగా ఇబ్బందులు పడటంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్‌గా స్పందించింది. సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోలేదన్న కారణంతో జనవరిలో ఇండిగోపై సుమారు రూ.22 కోట్ల జరిమానా విధించింది. ఈ పరిణామాల నేపథ్యంలో పీటర్ ఎల్బర్స్ రాజీనామా చేయడం విమానయాన రంగంలో చర్చకు దారితీస్తోంది. ఇండిగో భవిష్యత్ వ్యూహాలు, సంస్థలో నాయకత్వ మార్పులు ఎలా ఉండబోతాయన్నది ఇప్పుడు పరిశ్రమలో ఆసక్తిగా మారింది.కాగా, సీఈఓ రాజీనామా వార్తల నేపథ్యంలో ఇండిగో షేర్లు ఎన్ఎస్ఈలో 3.46 శాతం పెరిగి రూ.4,383.50 వద్ద ముగియడం విశేషం. పూర్తిస్థాయి సీఈఓ కోసం అన్వేషణ ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది.


 

By
en-us Political News

  
జీవనోపాధి కోసం ఊరు వదిలి వచ్చిన ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఒక నిర్లక్ష్యపు తమాషా ప్రాణాంతకంగా మారింది
కర్ణాటక రాజకీయాల్లో ఒక మాజీ శాసనసభ్యుడి వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
పంజాబ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కింది.
మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.
శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీపై మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.
అసెంబ్లీకి అతి సమీపంలో ఉన్న ఆల్ ఇండియా రేడియో కార్యాలయానికి తొలుత బాంబు బెదరింపు వచ్చింది. దీనిపై ఆల్ ఇండియా రేడియో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతోపోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను బయటకు పంపించారు.
హైదరాబాద్ నగరంలో కల్తీ దందాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
రాజధాని ప్రాంతమైన అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు మూడు ప్రతిష్ఠాత్మక సంస్థలకు ఈ ఎస్ఐపీబీ సమావేశంలో మంజూరు చేయడం ఈ అయ్యాయి. ఈ అనుమతులతో అమరావతి కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా టెక్నాలజీ హబ్‌గా కూడా ఎదుగుతుంది.
హైదరాబాద్ బేగంపేటలో ఉన్న 145 సంవత్సరాల ప్రాచీన వారసత్వ కట్టడం చిరాన్ ఫోర్ట్ క్లబ్ చుట్టూ వివాదం రాజుకుంది.
తాడేపల్లిలోని ఆమె నివాసంతో పాటు విజయవాడ, గుంటూరు జిల్లాల్లోని ఇతర అనుమానిత ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో ఏసీబీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆమె పేరిట ఉన్న స్థిరాస్తులు, బ్యాంకు ఖాతాలు, బంగారు ఆభరణాలకు సంబంధించిన రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.