హైదరాబాద్‌లో బాంబు బెదరింపుల కలకలం ఆల్ ఇండియా రేడియో, జేఎన్‌టీయూలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
Publish Date:Apr 7, 2026
Advertisement
హైదరాబాద్‌లో బాంబు బెదరింపులు కలకలం రేపాయి. . నగరంలోని అత్యంత కీలకమైన ప్రాంతాల్లో ఒకటైన ఆల్ ఇండియా రేడియో కార్యాలయంతో పాటు, కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అసెంబ్లీకి అతి సమీపంలో ఉన్న ఆల్ ఇండియా రేడియో కార్యాలయానికి తొలుత బాంబు బెదరింపు వచ్చింది. దీనిపై ఆల్ ఇండియా రేడియో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతోపోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను బయటకు పంపించారు. అదే సమయంలో కూకట్‌పల్లిలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కి కూడా బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఒకే రోజు రెండు ముఖ్యమైన ప్రాంతాల్లో ఇలాంటి బెదిరింపులు రావడంతో నగర పోలీసులు ఈ అంశాన్ని తీవ్రంగా తీసుకున్నారు. రేంపు ప్రాంతాలలో బాంబ్ స్క్వాడ్డాగ్ స్క్వాడ్ బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అయితే రెండు చోట్లా కూడా ఎలాంటి బాబు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నకిలీ బెదరింపులకు పాల్పడింది ఎవరు అన్న విషయాన్ని దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ బెదిరింపుల ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
http://www.teluguone.com/news/content/bomb-threats-spark-alarm-in-hyderabad-36-216882.html





