పాక్ జట్టుకు భారత్ షేక్ హ్యాండ్ ఇస్తుందా?

Publish Date:Feb 14, 2026

Advertisement

 

ఆసియా కప్ 2025 టోర్నీ నుంచి భారత్, పాకిస్థాన్ మధ్య కరచాలన వివాదం ప్రారంభమైన సంగతి తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా టీమిండియా ప్లేయర్లు పాకిస్థాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అలానే ఆసియా కప్-2025 ట్రోఫీని సైతం ఏసీసీ ఛైర్మన్ నఖ్వీ చేతుల మీదుగా తీసుకునేందుకు టీమిండియా నిరాకరించింది. మరోవైపు టీ20 ప్రపంచ కప్-2026లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి షేక్ హ్యాండ్ అంశం తెరపైకి వచ్చింది. 

భారత ఆటగాళ్లతో కరచాలనం చేస్తారా? అంటూ ఎదురైన ప్రశ్నకు పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా సమాధానం ఇచ్చాడు. టీమిండియాతో పోరు సందర్భంగా శనివారం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సల్మాన్ అఘా పాల్గొన్నాడు. ఐసీసీ టోర్నీల్లో ఒకటైన ప్రపంచ కప్ లో మాకు భారత్‌పై మంచి రికార్డు లేదు. గతాన్ని తాము  మార్చలేమన్నాడు. టీమిండియా ప్లేయర్లను కరచలనం అడుగుతారా? అని ఓ రిపోర్టర్ అడగ్గా.. రేపు చూద్దాం అంటూ సమాధానం ఇచ్చాడు. 

'టీమిండియా ప్లేయర్లతో కరచాలనం గురించి ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నాడు. వారు ఇస్తే తప్పకుండా మేమూ షేక్‌ హ్యాండ్ ఇస్తాం. ఏం జరుగుతుందో రేపు చూద్దామన్నాడు . భారత జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మ కోలుకుని మ్యాచ్‌లో ఆడతాడని ఆశిస్తున్నాం. అత్యుత్తమ ఆటగాళ్లు ఉండాలని మేమూ కోరుకుంటాం. టాస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాచ్ ఫలితాన్ని అది నిర్ణయించదు. ఎవరు బాగా ఆడితే వారే విజయం సాధిస్తారని సల్మాన్ తెలిపాడు.
 

By
en-us Political News

  
హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో విద్యర్థుల బలవన్మరణానికి పాల్పడిన సంఘటనలు విషాదాన్ని నింపాయి. ఫలితాలు వెలువడిన గంటల వ్యవధిలోనే ఆరుగురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడటం వారి కుటుంబాలలో తీరని శోకాన్ని మిగిల్చింది. ఇలా ఆత్మహత్యకు పాల్పడిన వారిలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు ఉన్నారు.
ఈ కేంద్రాల ద్వారా క్వాంటం కంప్యూటర్ హార్డ్‌వేర్‌ను క్షుణ్ణంగా పరీక్షించి, ధృవీకరిస్తారు. ఇది అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో క్వాంటం వ్యాలీ గా మారుస్తుంది.
న్యాయ వివాదాల పరిష్కార ప్రక్రియలో, ముఖ్యంగా మధ్యవర్తిత్వ రంగంలో ఏఐ వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది
దేశ రాజకీయాల్లో ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.
హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రముఖ గాయని సత్యవతి ముడావత్ (మంగ్లీ) ఇచ్చిన ఫిర్యాదు సంచలనంగా మారింది.
విదేశాల్లో ఉన్నత చదువులు, మంచి భవిష్యత్తు కోసం వెళ్లిన ఓ యువకుడు దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోవడం కుటుంబాన్ని విషాదంలో ముంచింది.
ఆశా భోంస్లే మృతి పట్ల సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులర్పిస్తున్నారు
నాసిక్ ఐటీ కంపెనీలో లైంగిక వేధింపుల ఉదంతం దేశవ్యాప్తంగా ఐటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
భారతీయ సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ నేపథ్య గాయని ఆశా భోస్లే
పెళ్లి పీటలపై కట్నం డబ్బుల కోసం డిమాండ్ చేయడం గానీ, ఇతర వివాదాస్పద కోర్కెలతో పెళ్లి ఆగిపోవడం గానీ మనం విన్న విషయాలే.
భారతీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో కీలక అడుగు వేసింది.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి ఓ వాహనదారుడు వేసిన కొత్త ఎత్తు చివరకు పోలీసులకే షాక్ ఇచ్చింది.
అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరోసారి తన కఠిన వైఖరిని రుచిచూపించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.