14న వరల్డ్ క్వాంటం డే.. ఏపీలో క్వాంటం టెస్ట్ బెడ్లకు ప్రారంభోత్సవం

Publish Date:Apr 12, 2026

Advertisement

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబా బునాయుడుఎప్పుడూ ముందుంటారు.  క్వాంటం మంగళవాకం (ఏప్రిల్ 14)  ప్రపంచ క్వాంటం దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో రెండు అత్యాధునిక క్వాంటం టెస్ట్ బెడ్లను ప్రారంభించనున్నారు. తద్వారా దేశంలోనే క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేసిన  తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చిరిత్ర సృష్టించనుంది. 

ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగంగా గన్నవరంలోని మేధా టవర్స్, రాజధాని ప్రాంతంలోని ఎస్ఆర్ఎం  యూనివర్సిటీ క్యాంపస్‌లలో రెండు ప్రత్యేక కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  1ఎస్ మరియు , 1క్యూ  పేర్లతో వీటిని చంద్రబాబు జాతికి అంకితం చేయనున్నారు. ఈ కేంద్రాల ద్వారా క్వాంటం కంప్యూటర్ హార్డ్‌వేర్‌ను క్షుణ్ణంగా పరీక్షించి, ధృవీకరిస్తారు. ఇది అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో  క్వాంటం వ్యాలీ గా మారుస్తుంది. 

 ఈ మినీ క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్లు మైనస్ 273 డిగ్రీల సెంటీగ్రేడ్ వంటి అత్యంత శీతల ఉష్ణోగ్రతల వద్ద పనిచేస్తాయి. మేధా టవర్స్‌లో క్యూబిటెక్ సంస్థ భాగస్వామ్యంతో ఒక కేంద్రం ఏర్పాటు కాగా, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో సూపర్ కండక్టింగ్ టెక్నాలజీతో మరొకటి సిద్ధమైంది.  ఎస్ఆర్ఎంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని  ఓపెన్ యాక్సెస్  పద్ధతిలో ఉంచడం వల్ల పరిశోధకులు, స్టార్టప్‌లకే కాకుండా విద్యార్థులకు కూడా ఈ టెక్నాలజీ సులభంగా అందుబాటులోకి వస్తుంది.

ఈ ప్రాజెక్టులో మరో విశేషం కూడా ఉంది. ఇందులో వినియోగించిన ఉపకరణాలన్నీ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనవే.  దేశంలోని ప్రముఖ సంస్థలైన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సి), డీఆర్డీవో (డీఆర్డీవో) వంటి అగ్రశ్రేణి సంస్థల సహకారంతో ఇది రూపుదిద్దుకుంది. జాతీయ క్వాంటం మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ఈ అడుగులు వేస్తున్నది.

కాగా ఈ  క్వాంటం వ్యాలీ  ప్రారంభోత్సవ కార్యక్రమానికి  దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తలు, ఐఐటీ ప్రొఫెసర్లు, క్వాంటం రంగ నిపుణులు హాజరౌతున్నారు.  అలాగే రాష్ట్ర వ్యాప్తంగా  1.5 లక్షల మంది విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో వీక్షించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.  

By
en-us Political News

  
ఈ సంక్షోభం మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తోంది. ఆధునిక యుద్ధాలు కేవలం యుద్ధభూముల్లోనే జరగవు. అవి వ్యూహాలు, కూటములు, సాంకేతిక మార్గాల్లో కూడా జరుగుతాయి. ప్రపంచ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అందులో ప్రతి దేశం తన స్థానం కోసం పోరాడుతోంది.
రాష్ట్రంలోని నదీపరివాహక ప్రాంతాల్లో అవేర్ సంస్థ ద్వారా జల వనరుల వివరాలు రియల్ టైమ్‌లో నమోదు చేస్తున్నట్టు తెలిపారు. వరద జలాలను సద్వినియోగం చేసుకుంటున్న తీరును, నదుల అనుసంధానంపై రూపొందించిన ప్రణాళికల గురించి వెల్లడించారు. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్టు సమస్యపై చర్చించారు.
ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసి ముంబై ఇండియన్స్‌కు 241 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో విద్యర్థుల బలవన్మరణానికి పాల్పడిన సంఘటనలు విషాదాన్ని నింపాయి. ఫలితాలు వెలువడిన గంటల వ్యవధిలోనే ఆరుగురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడటం వారి కుటుంబాలలో తీరని శోకాన్ని మిగిల్చింది. ఇలా ఆత్మహత్యకు పాల్పడిన వారిలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు ఉన్నారు.
న్యాయ వివాదాల పరిష్కార ప్రక్రియలో, ముఖ్యంగా మధ్యవర్తిత్వ రంగంలో ఏఐ వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది
హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రముఖ గాయని సత్యవతి ముడావత్ (మంగ్లీ) ఇచ్చిన ఫిర్యాదు సంచలనంగా మారింది.
విదేశాల్లో ఉన్నత చదువులు, మంచి భవిష్యత్తు కోసం వెళ్లిన ఓ యువకుడు దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోవడం కుటుంబాన్ని విషాదంలో ముంచింది.
ఆశా భోంస్లే మృతి పట్ల సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులర్పిస్తున్నారు
నాసిక్ ఐటీ కంపెనీలో లైంగిక వేధింపుల ఉదంతం దేశవ్యాప్తంగా ఐటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
భారతీయ సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ నేపథ్య గాయని ఆశా భోస్లే
పెళ్లి పీటలపై కట్నం డబ్బుల కోసం డిమాండ్ చేయడం గానీ, ఇతర వివాదాస్పద కోర్కెలతో పెళ్లి ఆగిపోవడం గానీ మనం విన్న విషయాలే.
భారతీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో కీలక అడుగు వేసింది.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి ఓ వాహనదారుడు వేసిన కొత్త ఎత్తు చివరకు పోలీసులకే షాక్ ఇచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.