ప్రాంతీయ పార్టీ అయినా.. తెలుగుదేశం హృదయంలో భారత దేశం.. నారా లోకేష్
Publish Date:Feb 27, 2026
Advertisement
రాజధాని పేరుతో మేము కేవలం ఒక నగరాన్ని మాత్రమే నిర్మించడం లేదన్న నారా లోకేష్.. ఎకనమిక్ క్లస్టర్లను నిర్మిస్తున్నామన్నారు. ముంబయిలో ఎబిపి నెట్ వర్క్ ఆధ్వర్యంలో ఐడియాస్ ఆఫ్ ఇండియా -2026 పేరిట నిర్వహించిన సదస్సులో మాట్లాడిన నారా లోకేష్ విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఎకనమిక్ రీజియన్ల నిర్మాణం చేపడుతున్నామనీ, ఆయా రీజియన్ల పరిధిలో పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామనీ వివరించారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అనే నినా దాన్ని బలంగా నమ్ముతున్నామన్నారు. క్లస్టర్ బేస్డ్ విధానం ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ సుసాధ్యం చేయవచ్చని చెప్పారు. కలెక్టివ్ ఫెడరలిజం గొప్పతనాన్ని విశ్వసిస్తామన్న ఆయన రాజకీయంగా తమది ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ మా హృదయంలో భారతదేశం ఉందన్నారు. కలెక్టివ్ ఫెడరలిజంలో ఒక రాష్ట్రంగా మేం మా వాటా హక్కులు, ఇన్సెంటివ్స్ పొందుతామన్నారు. 2024 ఎన్నికల్లో తెలుగుప్రజల హక్కులను కాపడతామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారమే విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడాం. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కలిసి సుమారు 16వేలకోట్ల మేర ఆర్థికసాయం అందించాయి. మేం చేపట్టిన నిర్మాణాత్మక కృషి కారణంగా ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లో పయనిస్తూ దేశాభివృద్ధికి సహకరిస్తోందని లోకేష్ వివరించారు.
http://www.teluguone.com/news/content/india-in-telugudesham-partys-heart-36-214784.html





