హైడ్రాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్న స్థానికులు

Publish Date:Mar 15, 2026

Advertisement

 

హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా కొనసాగు తున్న భూ వివాదానికి చివరికి అధికారులు చెక్ పెట్టి... సమస్యను పరిష్కారించారు. ప్రభుత్వానికి, దేవాదాయ శాఖకు చెందిన భూమిని ఒక వర్గానికి చెందిన వ్యక్తులు రాత్రికి రాత్రే కబ్జా చేసిన ఘటన స్థానికంగా ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ విషయంపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో హైడ్రా అధికా రులు రంగంలోకి దిగి కబ్జాను తొలగించారు. అత్తాపూర్ పరిసర ప్రాంతాలైన రాంబాగ్,  హైదర్ గూడ ప్రాంతాలకు చెందిన స్థానికులు కబ్జాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమిపై అక్రమంగా రేకుల ప్రహరీ షెడ్ నిర్మించి ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ ఎమ్మార్వో, ఆర్డీఓ, పోలీసు అధికా రులు, జిల్లా కలెక్టర్ వరకు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. 

అయినప్పటికీ వెంటనే చర్యలు తీసుకోకపో వడంతో స్థానికులు మరోసారి కబ్జా చేసిన స్థలం వద్దే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.ఈ విషయం కాస్త తెలుసుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. రెవెన్యూ అధికారులతో కూడా చర్చించి భూమి యాజమా న్యానికి సంబంధించిన వివరాలను సేకరించారు. సమస్యను సమగ్రంగా పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇవ్వడంతో స్థానికులు ఆందోళన విరమించారు.

తదుపరి విచారణలో భూమి ప్రభుత్వానికి మరియు దేవాదాయ శాఖకు చెందినదేనని ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో హైడ్రా అధికారులు తక్షణ చర్యలకు దిగారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆదివారం ఉదయం భారీ పోలీస్ బందోబస్తుతో హైడ్రా బృందం సంఘటన స్థలానికి చేరుకుంది. కబ్జా చేసిన వర్గం నిర్మించిన రేకుల ప్రహరీ షెడ్డును తొలగించి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అక్కడ పెనిషింగ్ నిర్వహించి భూమిని రక్షించారు. అయితే షెడ్ తొలగింపు సమయంలో కబ్జా చేసిన వర్గానికి చెందిన కొందరు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. 

దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని అక్కడ ఉన్న వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రభుత్వ, దేవాదాయ శాఖకు చెందిన విలువైన భూమిని కాపాడిన హైడ్రా అధికారుల చర్యలను స్థానికులు స్వాగతించారు. సమస్యను తక్షణం పరిష్కరించి అక్రమ కబ్జాను తొలగించినందుకు హైడ్రా బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అధికారులు ఇలాంటి చర్యలు కొనసాగిస్తే నగరంలో భూ కబ్జాలకు చెక్ పడుతుందని స్థానికులు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా స్థానికులు హైడ్రాధికారులు చేసిన చర్యలకు సంతోషపడుతూ హైడ్రా కమిషనర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

By
en-us Political News

  
పొరుగు దేశం పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది.
తాడిపత్రిలో సీఎం చంద్రబాబు క్షేత్ర పర్యటన… రైతులతో ముఖాముఖి
2025 డిసెంబర్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు జరిగిన 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం యొక్క ఫలితాల అమలులో పురోగతిని కూడా ఈ చర్చలు సమీక్షించాయి. ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు 2030 నాటికి వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచడానికి ఆ శిఖరాగ్ర సమావేశం ఒక ఐదేళ్ల రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించింది.
నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో ఉన్న కోమటిరెడ్డి ప్రతీక్ ఉన్నత పాఠశాల వద్ద ఈరోజు సోమవారం ఉదయం అరుదైన దృశ్యం కనిపించింది.
తండ్రి కొడుకులను లాకప్‌లో చంపిన కేసులో అసలేం జరిగింది?
అమెరికాలో స్థిరపడి, ట్రక్కు డ్రైవింగ్‌ను వృత్తిగా ఎంచుకున్న వేలాది మంది భారతీయులకు అక్కడి ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది.
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి కుమారుడుకి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
జలమే సంపద... దాన్ని ఎంత పొదుపుగా వినియోగించుకుంటే అంత సంపదను సృష్టించవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు.
దేశ రాజధానిలోని అత్యంత సున్నిత ప్రాంతాల్లో ఒకటైన ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం మధ్యాహ్నం సంచలన ఘటన చోటుచేసుకుంది.
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది.
ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సాధించిన ఘటన వెలుగులోకి రావడంతో విద్యుత్ శాఖలో కలకలం రేగింది.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.