Publish Date:Mar 15, 2026
ఇరాన్ , అమెరికా- ఇజ్రాయెల్‌ల పరస్పర దాడులతో పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ (సీబీఎస్ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ దేశాల్లో ఈనెల 16 నుంచి జరగాల్సిన 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సీబీఎస్ఈ ప్రకటించింది. ఈ మేరకు సీబీఎస్ఈ ఆదివారం (15-3-26న) ప్రకటన వెలువరించింది.
గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఇ విద్యార్థుల విషయంలో 2026 మార్చి 16 నుంచి 2026 ఏప్రిల్ 10 వరకు 12వ తరగతి పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఈ పరీక్షలు రద్దయ్యాయి. ఈ దేశాల్లో 12వ తరగతి విద్యార్థుల పరీక్షలు, ఫలితాల ప్రకటన విధానంపై తగిన సమయంలో విడిగా తెలియజేస్తామని సర్క్యులర్‌లో పేర్కొంది.
పశ్చిమాసియాలో మార్చి 11 వరకు నిర్వహించాల్సిన 10వ తరగతి బోర్డు పరీక్షలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే సీబీఎస్‌ఈ ప్రకటన వెలువరించిన సంగతి తెలిసిందే. పశ్చిమాసియా దేశాల్లోని సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల ప్రిన్సిపాల్‌లు ఈ మేరకు విద్యార్థులకు తెలియజేయాలని తన ప్రకటనలో పేర్కొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cbses-key-decision-36-215543.html
కుటుంబాల్లో కలహాలు పెరిగి విషాదాంతాలకు దారి తీస్తున్న ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అలాంటి దుర్ఘటన ఒకటి భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
తారామతి డ్రగ్స్ కేసులో ముంబైకి చెందిన నటుడు సహా ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశామని ఈగిల్ టీం తెలిపారు
తెలంగాణ రాష్ట్ర న్యాయవ్యవస్థ చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన డీసీఎం వాహనం బీభత్సం సృష్టించి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
శత్రువు భూభాగంలోకి వెళ్లి తమ పైలట్‌ను రక్షించుకుని చరిత్ర సృష్టించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. యుద్దం గెలిచినట్లే సంబరపడిపోతున్నారు
తెలంగాణలోని నిర్మల్ జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
ఇరాన్ అనుకూల ప్రచారం.. లాస్ ఏంజిల్స్‌లో సులేమానీ బంధువుల అరెస్ట్
దక్షిణ బ్రెజిల్‌లోని రియో గ్రాండే దో సుల్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, అగ్రరాజ్యం అమెరికా తన సైనిక నాయకత్వంలో అనూహ్య మార్పులు చేపట్టింది.
ప్రేమిస్తున్నానని వెంటప డ్డాడు... పెళ్లి చేసుకొని సంతోషంగా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. సినిమా తరహాలో యువతిని నమ్మించి ప్రేమ బుట్టలో పడేశాడు.
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శామీర్‌పేట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు రాజకీయ అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కడప జిల్లా మద్యం బాంబులు తెగ తాగేశారు. జిల్లాను మద్యం మత్తులో ముంచేశారు.
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో సంచలనం సృష్టించిన చౌడేశ్వరి పరువు హత్య కేసులో పోలీసు యంత్రాంగం దిద్దుబాటు చర్యలకు దిగింది.