మీకు తెలుసా? రిలేషన్ నిలబడటానికి ఈ అబద్దాలు చెప్పినా అస్సలు తప్పు లేదట..!

Publish Date:Dec 22, 2025

Advertisement


ప్రతి విషయంలోనూ నిజం మాట్లాడితేనే రిలేషన్ బాగుంటుందని కొందరు అనుకుంటారు. నిజాయితీ ఉన్నప్పుడు, నిజం మాట్లాడినప్పుడే ఆ వ్యక్తి జెన్యూన్ అని చెబుతూ ఉంటారు కూడా. అయితే ఎప్పుడూ నిజం మాట్లాడటం వల్ల రిలేషన్స్ లో  గొడవలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. భార్యాభర్తలలో ఎవరైనా ఏదైనా నిజం చెప్పినప్పుడు.. అది గొడవకు దారితీస్తే  వెంటనే వినిపించే మాట.. నీకు నిజం చెప్పాను చూడు.. నాది బుద్ధి తక్కువ అని. దీన్ని బట్టి అన్నిసార్లు నిజం చెప్పడం అంటే గొడవలను కోరి తెచ్చుకోవడమే అని అర్థం.  కొన్ని సందర్భాల్లో అబద్దాలు చెప్పడం వల్ల రిలేషన్ లో గొడవలు రావడానికి బదులు ఆ బంధం బలపడే అవకాశం,  ఇద్దరి మధ్య అపార్థాలు రాకుండా ఉండే అవకాశం ఉంటుందని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మూడు రకాల అబద్దాలు చెప్పడం వల్ల రిలేషన్ పాడవకుండా దృఢంగా మారుతుందని అంటున్నారు. ఇంతకీ ఆ అబద్దాలేంటో ఎందుకు మేలు చేస్తాయో తెలుసుకుంటే..

పొగడ్తలు.. మెచ్చుకోలు..

 లైఫ్ పార్ట్నర్  లేదా స్నేహితుడు కొత్త హెయిర్ కట్, కొత్త పెయింటింగ్ లేదా కొత్త డ్రెస్ లేదా ఏదైనా సరే.. ఏదైనా  కొత్తగా చేసినప్పుడు ఒకవేళ అది నచ్చకపోతే..  మొహం మీద బాలేదని చెప్పడం కంటే బాగుందని మెచ్చుకుంటే మేలు. నిజం చెప్పి వారిని బాధపెట్టే బదులు,  వారికి ఒక చిన్న ప్రశంస ఇవ్వవచ్చు. "వావ్" లేదా "సూపర్" లాంటి పదాలతో పొగడ్త ఇవ్వడం వల్ల ఎదుటివారు సంతోషపడతారు. దీనివల్ల ఇద్దరి మధ్య బందం బలపడుతుంది. ఎప్పుడైనా తను చేసింది బాలేదని అర్థమైనా.. ఆ రోజు నన్ను బాధపెట్టడం ఇష్టం లేక ఇలా అన్నారు కదా.. అనే ఒక ఆలోచన ఎదుటివారి దృష్టిలో మిమ్మల్ని ఉన్నతంగా నిలబెడుతుంది.

మద్దతు..

తప్పులు అందరూ చేస్తారు. అయితే ఏదో ఒక సందర్భంలో.. ఒకరు ముందు ఒకరు వెనుక చేయవచ్చు. ఆ మాత్రం దానికి మనిషిని నిందించకూడదు. మరీ ముఖ్యంగా నలుగురిలో ఉన్నప్పుడు మాత్రం వ్యక్తిని ఎప్పుడూ నిందించకూడదు. ఒకవేళ నలుగురిలో ఏదైనా తప్పు జరిగినా, అందరి ముందు దోషిలా నిలబడే పరిస్థితి వచ్చినా మనిషిని వెనకేసుకురావాలి.  సపోర్ట్ గా నిలబడాలి. అలా సపోర్ట్ గా ఉండటానికి నలుగురిలో అబద్దం చెప్పినా తప్పు లేదు.

భరోసా..

మనకు బాగా కావలసిన వాళ్లు, మన స్నేహితులు, మనతో చనువుగా ఉండేవారు ఎప్పుడైనా జీవితం గురించి ఇబ్బందిగా, బాధగా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు వెంటే మనకు కూడా బాగా బాధ కలుగుతుంది.  భవిష్యత్తు గురించి వాళ్ల మనసులో భయం కనిపించినప్పుడో లేదా దేని గురించైనా ఏమవుతుందో అని బాధపడుతున్నప్పుడో  వారికి ఊరట కలిగే విధంగా మాటలు చెప్పడం చాలా ముఖ్యం.  అలాంటప్పుడు ధైర్యం చెప్పడం,  భవిష్యత్తు గురించి భరోసా ఇవ్వడం,  భవిష్యత్తు గురించి ఆశ కలిగేలా మాట్లాడటం చాలా ముఖ్యం. వారిలో ఆశాభావం పెరిగి వారు ఆత్మవిశ్వాసం కలుగుతుంది అంటే అలాంటి సందర్భాలలో అబద్దం చెప్పినా తప్పేం లేదు.

చివరగా చెప్పేది ఏంటంటే.. అబద్దం అనేది ఎవరినీ మోసం చేయాలని,  బాధపెట్టాలని కాదు.. ఇతరులు సంతోషిస్తారని, బాధ నుండి బయటకు రాగలుగుతారని అనిపిస్తే అబద్దం చెప్పడంలో తప్పేం లేదనేది పెద్దలు కూడా చెప్పే మాట. కానీ మనిషి జీవితాన్ని ఇబ్బందులలోకి తోసేలా.. నమ్మించి మోసం చేసేలా అబద్దాలు ఎప్పటికీ ఆడకూడదు.

                               *రూపశ్రీ.

By
en-us Political News

  
మనిషి జీవితం సక్సెస్ గా ఉండటానికి, కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగడానికి ఆచార్య చాణక్య చెప్పిన విషయాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
చర్మ సౌందర్యానికి డ్రాగన్ ఫ్రూట్ ఎలా ఉపయోగపడుతుంది? మెరిసే, మృదువైన చర్మాన్ని సొంతం చేసుకోవడానికి సింపుల్ DIY ఫేస్ మాస్క్‌లు మరియు అద్భుతమైన బ్యూటీ బెనిఫిట్స్ పూర్తి వివరాలు.
ప్రతిరోజూ తలస్నానం చేయడం వల్ల జలుబు వస్తుందనే అపోహ నిజమేనా? చల్లటి నీరు, తడి జుట్టు మరియు రోజూ షాంపూ వాడకం గురించి ఆరోగ్య నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి.
కాలుష్య గాలిలో ఒక గంటపాటు ఆరుబయట వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులు, గుండె మరియు మెదడుపై పడే తీవ్ర ప్రభావం గురించి నిపుణులు ఏమి చెబుతున్నారో తెలుసుకోండి.
చలికాలంలో గాలిలో తేమ తగ్గి పెదవులు పగిలిపోవడం సర్వసాధారణం. పెదవులను మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మరియు పొడిబారకుండా కాపాడుకోవడానికి 7 సులభమైన దినచర్య అలవాట్లు మరియు నిపుణుల చిట్కాలను తెలుసుకోండి.
షుగర్ పేషెంట్లు రాత్రి పూట డిన్నర్ లోకి రైస్ తినాలా లేదా చపాతీ తినాలా? ప్రముఖ డాక్టర్ దీప్తి కరేటి చెప్పిన ఆరోగ్యకరమైన చిట్కాలు మరియు కార్బోహైడ్రేట్ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
మాంసం కూరలను తలదన్నే రుచితో, రైతన్నల బలానికి రహస్యమైన పచ్చి కూరగాయల రోటి పచ్చడిని ఎలా తయారు చేయాలో తెలుసుకోండి. సులభమైన పదార్థాలతో విలేజ్ స్టైల్ పచ్చడి తయారీ విధానం.
విద్య లేని వాడు వింత పశువు అన్నారు. కానీ నేటికాలంలో చదువు ప్రతి వ్యక్తికి ప్రాథమిక హక్కుగా మారింది
జపాన్‌కు చెందిన ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ హిదేకి వాడా రచించిన ది 80 ఇయర్ వాల్ పుస్తకం ఆధారంగా వృద్ధుల మానసిక మరియు శారీరక ఆరోగ్యం కోసం అందించిన 44 విలువైన సూచనలు, ఆరోగ్య చిట్కాలు మరియు విశేషాల పూర్తి సమాచారం.
భారతీయ వంటింట్లో కొబ్బరి ప్రధాన ఆహార పదార్థం. కూరలో వేయడమే కాకుండా పచ్చళ్ళు, పొడులు, స్వీట్లు .. ఇలా చాలా రకాలుగా కొబ్బరిని వినియోగిస్తారు.
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తులు కలసి ఒకే ఇంట్లో ఉండటం మాత్రమే కాదు. కాలంతో పాటు ఉద్యోగ బాధ్యతలు,
పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే పవిత్రమైన బంధం. ఈ బంధం ప్రేమ, నమ్మకం మీద గట్టిగా నిలబడుతుంది.
జీవితంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఏ విషయాలను ఎవరితో పంచుకోవాలి అనే అంశంపై ఆచార చాణక్యుడు చెప్పిన విషయాలు ఎప్పటికీ ఎంతో విలువైనవిగా నిలుస్తాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.