సాధార‌ణ మ‌త‌గురువు కుమారుడు ఇరాన్ నియంత ఎలా అయ్యారు?

Publish Date:Mar 2, 2026

Advertisement

ఇరాన్ సుప్రీం లీడ‌ర్ అయ‌తుల్లా అలీ ఖ‌మేనీ మ‌ర‌ణం ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా పెను సంచ‌ల‌నం సృష్టిస్తోంది.  అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఆయన హతం కావడం ప్రపంచ రాజ‌కీయాల్లో  పెను ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది.  ఈ నేపథ్యంలో ఒక సామాన్య మ‌త గురువు కొడుకుగా మొద‌లై... ప్ర‌పంచంలోనే అత్యంత శ‌క్తిమంత‌మైన నియంతల్లో  ఒక‌రిగా ఎదిగిన ఖమేనీ ప్రస్థానం ఎలా సాగిందని చూస్తే.. 
1939 ఏప్రిల్ 19న ఇరాన్ లోని ప‌విత్ర న‌గ‌రం మ‌ష‌ద్ లో జ‌న్మించారు ఖ‌మేనీ. ఆయ‌న తండ్రి ఒక సాధార‌ణ మ‌త గురువు. చిన్న‌త‌నంలోనూ అంటే, నాలుగేళ్ల వ‌య‌సులోనే  ఖురాన్ ప‌ఠ‌నం మొద‌లు పెట్టారు ఖ‌మేనీ. మ‌ష‌ద్, క్వామ్ వంటి న‌గ‌రాల్లో ఉన్న‌త చ‌దువులు చ‌దివారు. ఆయ‌న‌కు అర‌బిక్, ప‌ర్షియన్ భాష‌ల్లో  మంచి పట్టు  ఉంది.

ఖమేనీ చేసిన విప్ల‌వ పోరాటాలే ఆయన జీవితాన్ని మలుపు తిప్పాయి.  1960ల కాలంలో షా  చ‌క్ర‌వ‌ర్తి  పాల‌న‌కు వ్య‌తిరేకంగా పోరాడారు ఖ‌మేనీ. అనేక  సార్లు జైలు శిక్ష‌  అనుభ‌వించారు కూడా. 1979లో ఇస్లామిక్ విప్ల‌వం త‌ర్వాత అయ‌తుల్లా  ఖొమేనీకి రైట్ హ్యాండ్ గా మారారు. చాలా మంది అనుకుంటారు ఖొమేనీ, ఖ‌మేనీ ఒక‌రేన‌ని. ఇద్ద‌రూ వేరు వేరు. ఖ‌మేనీ  గురువు ఖొమేనీ. గురువు ఖొమేనీ తాత‌లు భార‌త్ లోని ఉత్త‌ర  ప్రదేశ్ కి చెందిన బారాబంకీ  కి చెందిన వారు. 

గురువు లాంటి పేరు క‌లిగి ఉన్న ఖ‌మేనీ.. ద‌శ తిరిగి 1981 నుంచి 1989 వ‌ర‌కూ ఇరాన్ అధ్య‌క్షుడిగా ప‌ని చేశారు. స‌రిగ్గా  1989లో ఆయ‌న గురువు ఖొమేనీ మ‌ర‌ణించారు.. దీంతో ఇరాన్ అత్యున్న‌త మండ‌లి ఖ‌మేనీని సుప్రీం లీడ‌ర్ గా ఎంపిక చేసింది. అక్క‌డి నుంచి ఆయ‌న తిరుగులేని విధంగా సుమారు 37 ఏళ్ల అప్ర‌తిహ‌తంగా ఇరాన్ కి అగ్ర నాయ‌క‌త్వం వ‌హించారు. ఒక  ర‌కంగా  చెబితే ఇరాన్ ని త‌న గుప్పెట్లో పెట్టుకున్నారు.

ఖ‌మేనీ పాల‌న‌లో ఇరాన్ ఎలాంటి అభివృద్ధి చ‌వి చూసింది. ఆ వివ‌రాలేంట‌ని చూస్తే.. ఇరాన్  సైనిక శ‌క్తిని ఒక రిజిన‌ల్ సూప‌ర్ ప‌వ‌ర్ గా తీర్చి దిద్దిన ఘ‌న‌త ఖ‌మేనీది.  స్వ‌దేశీ సాంకేతికత‌తో మిస్సైళ్ల త‌యారీ, డ్రోన్ అటాకింగ్, ఆపై అణు కార్య‌క్ర‌మాల‌ను అభివృద్ధి చేశారు. ఖ‌మేనీ నాయ‌క‌త్వంలోని ఇరాన్ రివ‌ల్యూష‌న‌రీ గార్డ్స్ ప్ర‌పంచంలోనే అత్యంత శ‌క్తిమంత‌మైన ద‌ళంగా త‌యారైంది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్, రోడ్లు, విద్యారంగంలో పురోగ‌తి.. ఖ‌మేనీ నాయ‌క‌త్వంలోనే సాధ్య‌మ‌య్యాయి. మ‌ధ్య ప్రాచ్యంలో లెబ‌నాన్, సిరియా, యెమ‌న్ ల‌లో ఇరాన్ ప్ర‌భావాన్ని మ‌రింత పెంచింది  కూడా ఆయ‌నే. అయితే ఇదంతా ఎలా త‌యారైందంటే.. ఇస్లామిక్ రివ‌ల్యూష‌న్లో భాగంగా.. కేవ‌లం సైనిక శ‌క్తి పెరుగుద‌ల కోస‌మే జ‌రిగింది త‌ప్ప‌.. సామాన్యుడ్ని ఆర్ధికంగా అభివృద్ధి చేయ‌డంకోసం  కాదు. ఇదే ఆయ‌న ప‌ట్ల తీవ్ర‌  వ్య‌తిరేక‌త  పెరిగేలా  చేసింది.

ఇరాన్ చ‌మురు సంప‌ద‌ను ప్ర‌జ‌ల కోసం వాడ‌కుండా..  విదేశాల్లోని హిజ్బుల్లా, హ‌మాస్ వంటి ఉగ్ర సంస్థ‌ల కోసం ఖ‌ర్చు చేయ‌డం.. చేటు తెచ్చింది. ఇటు ఇజ్రాయెల్, అమెరికా వంటి దేశాల‌తో శ‌తృత్వం కొని తెచ్చుకోవ‌డంతో పాటు.. అటు ప్ర‌జా వ్య‌తిరేక‌తా పెల్లుబికేలా చేసింది. దీంతో అంత‌ర్జాతీయ ఆంక్ష‌లు పెరిగి ద్ర‌వ్యోల్బ‌ణం 50 శాతానికి పైగా చేరింది. స్వేచ్ఛ‌ను కోరుకునే యువ‌త‌, మ‌హిళ‌ల‌ను మ‌రింత క్రూరంగా అణ‌గ‌దొక్కే య‌త్నం చేశారు. 2022లో మ‌హ్సా అమిని మ‌ర‌ణం త‌ర్వాత మొద‌లైన నిర‌స‌న‌లు.. ఖ‌మేనీపై అప్ప‌టి వ‌ర‌కూ ఉన్న గౌర‌వం, భ‌యాన్ని తుడిచిపెట్టేశాయి.

ఇక  ఐఆర్జీసీ నేత‌లు, మ‌త పెద్ద‌ల చేతుల్లోనే దేశ సంప‌ద మొత్తం కేంద్రీ కృతం కావ‌డం కూడా ప్ర‌మాద‌కరంగా మారింది. మ‌త‌ప‌ర‌మైన క‌ట్టుబాట్ల‌ను బ‌ల‌వంతంగా రుద్ద‌డం కూడా విద్యావంతులైన యువ‌త దేశం వ‌దిలి వెళ్లేలా చేసింది. ప్ర‌స్తుతానికైతే ఇరాన్ ఒక చారిత్రక మ‌లుపులో ఉంది. ఒక ర‌కంగా  చెబితే ఇదొక సంధి కాలం. ఫిబ్ర‌వ‌రి చివ‌రి వారంలో ఇజ్రాయెల్, అమెరికా చేసిన సంయుక్త వైమానిక దాడుల్లో..  ఖమేనీ నివాసం, ఐఆర్జీసీ ప్రధాన కార్యాలయాలు రెండూ ధ్వంసమయ్యాయి. ఇక ఖ‌మేనీ మ‌ర‌ణించిన త‌ర్వాత ఆయ‌న రెండో కుమారుడు మ‌జ్త‌బా ఖ‌మేనీని గ‌ద్దెనెక్కించాల‌ని చాంద‌స వాద గ్రూపులు ప్ర‌య‌త్నిస్తుండ‌గా.. సామాన్యులు మాత్రం మాకు రాజ‌రిక పాల‌న , మ‌త పాల‌న వ‌ద్దంటూ రోడ్డెక్కుతున్నారు. దీంతో ప్ర‌స్తుత ఇరాన్ పాల‌న అలీరెజా అరాఫీ నాయ‌క‌త్వంలోని తాత్కాలిక మండ‌లికి అప్ప‌గించారు. ఖ‌మేనీ మ‌ర‌ణం త‌ర్వాత ఇరాన్   ముల్లా రాజ్ అంటే..  మత‌గురువుల పాల‌న‌కు స్వ‌స్తి  ప‌లికేలా క‌నిపిస్తోంది. పాశ్చాత్య దేశాలు ఇక్క‌డ కూడా ప్ర‌జ్వామ్య పాల‌న తీసుకురావాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాయి. 

 ఆయ‌నింత‌టి సైనిక శ‌క్తి త‌యారు చేయ‌డం  వెన‌క దాగిన అస‌లు నిజం ఏ పాశ్చాత్య శ‌క్తికీ ఇరాన్ లొంగి  ఉండాల‌నుకోవ‌డం లేద‌ని  చాటి  చెప్ప‌డానికే నంటూ ఖమేనీ చివరి సందేశంలో పేర్కొన్నారు.  అయ‌తుల్లా అలీ స‌య‌ద్ ఖ‌మేనీ.. ఒక్క దేవుడికి త‌ప్ప ఎవ‌రికీ విధేయ‌త ప్ర‌క‌టించ‌డన్నదే ఆయని చివ‌రి ప్ర‌సంగ  పాఠం.  ఇదే ఆయ‌న్ను ఇవాళ్టి దుస్థితికి తీసుకొచ్చి పెట్టింది. మారుతున్న ప‌రిణామ క్ర‌మాల‌కు అనుగుణంగా మార‌క పోవ‌డం ఖ‌మేనీ దుర్మ‌ర‌ణానికి  కార‌ణంగా  నిలిచింది. దేశ సంప‌ద‌నంతా ఆయ‌న ఖ‌ర్చు చేసింది.. ఇలాంటి రోజు ఒక‌టి వ‌స్తే  ఎదుర్కుందామ‌నే. కానీ ఆ సైనిక అణు శ‌క్తి.. ఇజ్రాయెల్, అమెరికా సేన‌ల ముందు తేలిపోవ‌డంతో ఇరాన్ సుప్రీం  లీడ‌ర ఖ‌మేనీ ప్రాణం అనంత వాయువుల్లో క‌లిసింది. ఇది ఒక నియంత చివ‌రి అంకం.   

By
en-us Political News

  
నారాయణ్‌పూర్ జిల్లాకు ఆనుకుని ఉన్న ఛోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌‌ని మార్చి 31న సాయుధ మావోయిస్టులు లేని రాష్ట్రంగా ప్రకటించారు. సాయుధ మావోలు లేని రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి పేలుడు ఇదే కావడం గమనార్హం.
సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో సూత్రధారిగా ఏకసభ్య కమిషన్ తేల్చిన ఈవో ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
గత కొద్ది కాలంగా మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితమే ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. అక్కడి సైన్స్ సెంటర్లు, ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. పుస్తకాల్లోని జ్ఞానానికి తోడుగా విద్యార్థులకు వాస్తవిక ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు ఆ యాత్ర ఎంతో దోహదపడింది. ఇప్పుడు ఉపాధ్యాయులను కూడా విదేశాలకు పంపడం ద్వారా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ల్లభనేని బాబూరావు మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాబూరావు మృతి పార్టీకి తీరని లోటని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. బాబూరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
వివాహం అనంత రం ఈ ప్రేమికులు అదే కాలనీలో నివాసం ఉంటున్నారు. కావ్య తల్లిదండ్రులు కూడా అదే కాలనీలో మరో వీధిలో నివాసం ఉంటున్నారు. గత నెల 28న కావ్య అక్క తన తల్లి ఇంటికి వచ్చింది. దీంతో తల్లి కొల్లా అరుణ తన చిన్న కూతురు కావ్యను కూడా ఇంటికి పిలిచింది. అదే రోజు మధ్యాహ్నం సమయంలో కావ్య తన పుట్టింటికి వెళ్ళింది.
ఏం జరిగిందో ఏమో కానీ కార్తీక్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా, మంజుల విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. వీరు ఉదయం నుంచి తలుపులు తెరవ కపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి. . కిటికీలోంచి చూడగా నవ దంపతులు విగతజీవులుగా కనిపించారు.
చిన్న తనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలిచివేసింది. ఆ విషాదమే ఆయనలో డాక్టర్ కావాలనే ఆలోచనకు బీజం వేసిందని సన్నిహితులు చెప్తుంటారు. మొదటి సారి మెడికల్ ఎంట్రన్స్‌లో మంచి మార్కులు రాకపోవడంతో.. తరువాత గుంటూరు ఎ.సి కళాశాలలో చేరి మళ్ళీ పీయూసీ చదివి మంచి మార్కులు తెచ్చుకుని కర్నూలు వైద్య కళాశాలలో చేరారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు ఒక్కొక్కరికి మూడు సెంట్ల భూమి బహుమతిగా ఇవ్వనున్నట్టు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు.
ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ఇన్‌స్టా గ్రామ్‌లో రీల్స్, ఫేక్ ప్రొఫైల్స్ ద్వారా పరిచయాలు పెంచుకుని యువతులను ప్రేమ, పెళ్లి పేరుతో ట్రాప్ చేసి భారీగా డబ్బులు దోచుకున్నట్లు వెల్లడైంది.
ప్రాథమిక సమాచారం ఆధారంగా ఐటి అధికారులు పలువురు నిందితులకు నోటీసులు జారీ చేయనున్నారు. దర్యాప్తులో భాగంగా ఈ అక్రమ డబ్బు మార్గాలను ట్రాక్ చేయడంపై ఐటీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉంచేందుకు.. డబ్బును ఒకచోట నుండి మరొక చోటకు తరలించేందుకు హవాలా మార్గాన్ని ఉపయోగించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తెలుగు ప్రజలు మంచి పారిశ్రామికవేత్తను కోల్పోయారని, రీజెన్సీ స్థాపనతో యువతకు ఉపాధి కల్పనలో జీఎన్ నాయుడు కృషి ఎనలేనిదని సీఎం అన్నారు.
విమాన టికెట్ బుక్ చేసుకుని విదేశీ ప్రయాణానికి సిద్ధమయ్యాడన్న సమాచారం అందడంతో వెంటనే రంగం లోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు అతని ప్రయా ణాన్ని అడ్డుకున్నారు. కేసు విచారణ కొనసాగుతున్నం దున దేశం విడిచి వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టంగా తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.