లోకేష్ పనితీరు భేష్.. హైకోర్టు ప్రశంసలు

Publish Date:Feb 25, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పనితీరుపై కోర్టులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నాయి. ముఖ్యంగా  ముఖ్యంగా విద్యాశాఖలో ఆయన తీసుకువచ్చిన, తీసుకువస్తున్న సంస్కరణలు, విద్యారంగంలో సమస్యల పరిష్కారం విషయంలో చూపుతున్న చొరవ పట్ల ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం అభినందించింది.   కస్తూర్బా పాఠశాలల సిబ్బంది జీతాలు పెంచుతామంటూ ఆయన చేసిన ప్రకటనను మెచ్చుకుంది.  పెండింగ్‌లో ఉన్న అనేక అంశాలను లోకేష్ బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలోనే ఒక కొలిక్కి తీసుకురావడాన్ని హైకోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించి మరీ ప్రశంసించింది.  విద్యాశాఖకు సంబంధించి కోర్టులో పెండింగ్‌లో ఉన్న వి  వివాదాల పరిష్కారానికి లోకేష్ చొరవ తీసుకోవడాన్ని కోర్టు అభినందించింది.  

ప్రజా సమస్యలపై మంత్రి లోకేష్ వేగంగా స్పందిస్తున్నారని.. హాస్టల్ విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటనపై వెంటనే చర్యలు తీసుకున్నారని ప్రశంసించింది. అదే సమయంలో  అధికారుల పనితీరుపై  అసంతృప్తి వ్యక్తం చేసింది.   ప్రజాప్రతినిధి క్షేత్రస్థాయి సమస్యల పట్ల ఎంతటి నిబద్ధతతో ఉండాలో లోకేష్ తీరు నిరూపించిందని హైకోర్టు అభిప్రాయపడింది.

 ఒక మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని సాక్షాత్తూ హైకోర్టు కొనియాడటం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి అరుదైన ప్రశంసను  లోకేష్ హైకోర్టు నుంచి అందుకున్నారు.  కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కొరత, విద్యార్థినుల భద్రతపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సందర్భంగా హైకోర్టు లోకేష్ పనితీరును ప్రత్యేకంగా ప్రశంసించింది.

By
en-us Political News

  
రాబోయే కాలంలో చ‌రిత్ర సృష్టించేది నేటి విద్యార్థులేన‌ని, ఇంగ్లీషులో చ‌దువుకుంటున్నా, అమ్మ‌లాంటి తెలుగుభాష‌ను మ‌రువొద్ద‌ని విద్యా మంత్రి నారా లోకేష్ సూచించారు.
తాజాగా మరో సారి తెలంగాణలోని నాంపల్లి కోర్టు, విశాఖ జిల్లా కోర్టులకు బాంబు బెదరింపు లేఖలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ లు ఆయా కోర్టుల ఆవరణల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. కోర్టులను ఖాళీ చేయించి ఈ తనిఖీలు నిర్వహించారు.
బీహార్‌లో ప్రేమ విఫలం కావడంతో పెళ్లి వేడుకలో కాల్పుల ఘటన సంచలనం రేపింది.
మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే అంటే శనివారం (ఫిబ్రవరి 28) పంపిణీ చేయనుంది. పెన్షన్ పంపిణీలో ఎలాంటి అంతరాయం రాకుండా ఫిబ్రవరి 28న చెల్లింపులు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలకు అధికారిక ఉత్తర్వులు అందాయి.
జీడిమెట్ల భూ సర్వేకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మల్లారెడ్డి, ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డిలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
నిందితుడు పారిపోవాలని ప్లాన్ చేసినా… పోలీసుల ఎల్ఓసి ముందే వచ్చింది. ఎయిర్‌ పోర్ట్‌కు వెళ్లేలోపే బోర్డింగ్ పాస్ కు బదులు అరెస్ట్ మెమో చేతికి అందించిన పోలీసులు అక్కల రామకృష్ణ ప్రసాద్ ను అరెస్టు చేశారు.
కోమలి మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతోంది. చదువుతో పాటు పార్ట్‌ టైమ్‌గా యూట్యూబ్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రత్యేక మైన గుర్తింపు పొందింది.
శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియం వేదికగా జరిగిన మాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో ఓపెనర్ ఫర్హాన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. కాగా 165 పరుగుల విజయ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి చేధించింది.
ఢిల్లీలోని కశ్మీరీ గేట్ ప్రాంతంలో లారెన్స్ బిష్ణోయ్ న్యాయవాది రజనీ ఖత్రీ భర్త ప్రయాణిస్తున్న కారుపై జరిగిన కాల్పులలో ఒకరు గాయపడ్డారు. బిష్ణోయ్ న్యాయవాది రజనీ ఖత్రీ భర్త దీపక్ ఖత్రీ, తన స్నేహితులతో కలిసి కారులో వెడుతుండగా, బైక్‌పై దుండగులు కారును వెంబడించి వెనుక నుంచి ఐదు రౌండ్ల కాల్పులు జరిపి పరారయ్యారు.
ట్రంప్ టారిఫ్‌లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో.. ట్రంప్ సర్కార్ ట్రేడ్ యాక్ట్ 1974లోని మరో సెక్షన్‌ను ఉపయోగించి అన్ని దేశాల దిగుమతులపై 15 శాతం గ్లోబల్ టారిఫ్ విధించిన సంగతి తెలిసిందే. తన తాజా ప్రసంగంలో ఆ నిర్ణయాన్ని సమర్ధించుకున్న ట్రంప్ ట్రంప్ అమెరికా పౌరులపై ఆదాయపు పన్ను భారం తగ్గించి విదేశీ దిగుమతులపై సుంకాల ద్వారానే ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాలన్నది తన లక్ష్యమని చెప్పారు.
హైదరాబాదు నగరంలో దోమల నియంత్రణ కోసం చేపడుతున్న ఫాగింగ్ కార్యక్రమంలో భారీ అవినీతి వ్యవహారం బట్టబయలు అయింది.
ర‌సాయ‌నం- ర‌సాయ‌నం- ర‌సాయ‌నం. తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో ర‌సాయ‌నం. ఇప్పుడు రాజ‌మండ్రి పాల‌లో ర‌సాయ‌నం.
జ‌గ‌న్ ప‌త‌నం మొద‌లైందే వెంక‌న్న స్వామి కార‌ణంగా. ఈ విష‌యంలో ర‌ఘురామ‌కృష్ణ‌మ‌రాజు మ‌న‌కు ఒక ఉదాహ‌ర‌ణ‌.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.