Publish Date:Mar 19, 2026
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు కోయంబత్తూర్ నుంచి వైజాగ్‌కు ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వద్ద నుండి భారీ ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోయంబత్తూర్ నుంచి బయలుదేరిన ఒక ప్రయాణికుడు శంషాబాద్ విమానాశ్రయంలో ట్రాన్సిట్ సమయంలో విమానం మారాల్సి ఉంది. ఈ క్రమంలో అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అతడిని ఆపి... అతని బ్యాగ్‌ను తనిఖీ చేయగా, అందులో నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న భారీ మొత్తంలో బంగారం కనిపించింది.
దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ.1 కోటి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రయాణికుని అరెస్టు చేశారు.ఈ కేసులో మరెవరైనా ప్రమేయం ఉన్నాదా? బంగారం ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఎవరికి అందించాల్సి ఉంది? అనే కోణాల్లో అధికారులు కేసు నమోదు చేసుకొని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో బంగారం స్మగ్లింగ్ ప్రయత్నాలు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఇలాంటి ఘటనలను అడ్డుకుంటు న్నారని అధికారులు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gold-worth-rs-1-crore-seized-at-shamshabad-airport-36-215758.html
తమిళనాడు రాజకీయాలు మరోసారి హీటెక్కాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో కీలక లంచం కేసును బయటపెట్టారు.
ఉప్పల్ స్టేడియంలో లేడీ బౌన్సర్ హంగామా సృష్టించింది.
మెుహాలీలోని ఖరార్ ప్రాంతంలో ఈడీ దాడులు చేస్తుండగా సోదాలు జరుగుతున్న ప్రాంగణంలో నోట్ల కట్టలతో నిండిన బ్యాగులు దొరకడం హాట్ టాపిక్‌గా మారింది.
అదృష్టాన్ని నమ్ముకున్న ఆ అమెరికా దంపతులు దీర్ఘకాలంగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నారు.
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో టీవీకే అధినేత విజయ్‌కు ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ సినీ నటుడు విశాల్ ప్రశ్నించారు.
కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రమాదం వల్ల వారికి కలిగిన బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో శ్రీతేజ్ సోదరి చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని అల్లు అరవింద్ ప్రకటించారు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్‌పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచే సన్ రైజర్స్ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపించారు.