పండుగలతో ప్రజల జీవనశైలి ఆరోగ్యకరం : సీఎం చంద్రబాబు

Publish Date:Mar 19, 2026

Advertisement

 

విజయవాడలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం పండుగ వాతావరణంలో కళకళలాడింది. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై సందడి చేశారు.మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి సీఎం ఉగాది పచ్చడి రుచి చూశారు. జీవితంలో తీపి, చేదు, పులుపు వంటి అనుభవాల సమ్మేళనం అనే సందేశాన్ని గుర్తు చేస్తూ పచ్చడి ప్రాధాన్యతను వివరించారు. 

 

 

అనంతరం పండితుడు మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం వినిపించగా సభలోని అందరూ ఆసక్తిగా విన్నారు.తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం… కొత్త సంవత్సరంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లో సంతోషం, సుభిక్షం నెలకొనాలని కోరుకున్నారు. 

 

 

పండుగలు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుస్తాయని సీఎం అన్నారు. పరాభవ నామ సంవత్సరం అన్ని విధాలుగా బాగుంటుందని తెలిపారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి 6,787 మందికి రూ. 55.63 కోట్లు ఫైల్‌పై సంతాకం చేసి నిధులు విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కందుల దుర్గేశ్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమా తదితర ప్రముఖులు పాల్గొని వేడుకలకు మరింత ఉత్సాహాన్ని తెచ్చారు.

 


 

By
en-us Political News

  
ముందుగా ఇరాక్ పార్లమెంటరీ కూటమి కోఆర్డినేషన్ ఫ్రేమ్‌వర్క్ మాజీ ప్రధాని నూరి అల్ మాలికిని ఆ పదవిలో కూర్చోబెట్టాలని భావించింది. అయితే, మాలికికి ఇరాన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు.
మాజీ సీఎం జగన్ మెప్పు కోసం సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టిన ఆయన మాజీ సీపీఆర్వో పూడి శ్రీహరికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది
విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదని.. ఒక కొత్త యుగానికి పునాదని అదానీ గ్రూప్‌ ఛైర్మన్ జీత్‌ అదానీ పేర్కొన్నారు.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓపీఎల్) ఏకపక్ష వైఖరి కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డిజిల్ సంక్షోభం తలెత్తిందని తేలింది.
ములుగు అడవి ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధికి పోలీసులు కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు.
హైదరాబాద్ నగరంలో మరోసారి అగ్నిప్రమాదం కలకలం రేపింది.
సెర్చ్ ఇంజిన్‌గా మొదలైన గూగుల్.. విశాఖలో ఏర్పాటు చేయబోతున్న సెంటర్ ద్వారా దేశానికే గ్రోత్ ఇంజిన్ కాబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
అమరావతి నుంచి హైదరాబాద్‌, చెన్నైల మధ్య బుల్లెట్ ట్రైన్‌‌ను ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది
ధర్మేంద్ర నుంచి అషు రెడ్డి సుమారు 5 కిలోల బంగారం, ఖరీదైన కార్లు, స్థిరాస్తులను పొందారు. ఈ మొత్తం విలువ రూ. 9.35 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అయితే, పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి అషు రెడ్డి మొహం చాటేయడమే కాకుండా.. తనపైనే తప్పుడు కేసులు పెడతానని బెదిరించినట్లు బాధితుడి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పల్నాడులో ఇంధన విక్రయాలలో అక్రమాలకు పాల్పడుతున్న మూడు పెట్రోల్ బంకులను కలెక్టర్ సీజ్ చేశారు. నరసరావుపేట, చిలకలూరిపేట, పిడుగురాళ్ల లో నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరుపుతున్న మూడు ఫిల్లింగ్ స్టేషన్లను సీజ్ చేశారు.
శివారు అమ్మాపురం గ్రామానికి చెందిన కిన్నెర గుంశావలి కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురై తన ఇద్దరు కుమారులను స్థానిక వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ఉన్న కాలీఫ్లవర్ పొలంలోని వేప చెట్టుకు ఉరేసి చంపేసి అనంతరం తానుకూడా ఆ చెట్టుకే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఈ ముగ్గురిలో బెయిల్ కోసం రోహిత్ రెడ్డి ఒక్కరే హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసులో అరెస్టైన ముగ్గురిలో మొదటిగా రోహిత్ రెడ్డి బెయిలుపై బయటకు వచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.