రచ్చ రచ్చైపోయిన... ఒబామాస్ 'ఎంటర్ ది డ్రాగన్'!

Publish Date:Sep 5, 2016

Advertisement

అమెరికా అధ్యక్షుడు అంటే ఎవరు? ఒక దేశాధినేత! ఇంతే అయితే పెద్దగా డిస్కస్ చేయాల్సింది ఏం లేదు! కాని, అమెరికన్ ప్రెసిడెంట్ అంటే దాదాపూ ప్రపంచ పరిపాలకుడు! ఇది కొంచెం ఓవర్ గా అనిపించినా ఆల్మోస్ట్ నిజం! అసలు అమెరికన్ ప్రెసిడెంట్ చాలా చిన్న చిన్న దేశాలకు వెళ్లనే వెళ్లడు. ఆయన తన పదవీ కాలంలో చాలా ప్రాధాన్యమున్న దేశాలకే వెడుతుంటాడు. వెళ్లినప్పడు కూడా ఆ దేశం మొత్తం కళ్లప్పగించి వైట్ హౌజ్ నాయకుని వైభోగం చూస్తూ వుండిపోతుంది! 


ఇండియాకి అమెరికా అధ్యక్షులు వచ్చినప్పుడు కూడా మన మీడియా హంగామా తెలిసిందే కదా! బిల్ క్లింటన్ నుంచి ఒబామా వరకూ ఎవరొచ్చినా రకరకాల కథనాలు ప్రసారం అవుతూ వుంటాయి ఛానల్స్ లో! ఒబామా కార్ మొదలు ఆయన వాడి పడేసే టిష్యు పేపర్ల వరకూ అన్నీ డైలీ పేపర్స్ లో ఇష్యూస్ అయిపోతాయి. అంతే కాదు, అమెరికన్ ప్రెసిడెంట్ ఏ దేశానికి వచ్చినా కొన్ని రోజుల ముందే వైట్ హౌజ్ సెక్యురిటీ అక్కడ వాలిపోతుంది. ఆయన బస చేసే హోటల్, ఇతర ప్రాంతాలు అన్నీ తమ ఆధీనంలోకి తీసుకుని నానా హంగామా చేసేస్తారు అమెరికన్ అఫీషియల్స్! అన్ని దేశాలు ఈ డ్రామాకి ఇష్టం వున్నా లేకున్నా సహకరిస్తాయి. అమెరికా దమ్ము, దర్పం అలాంటివి మరి!


ప్రపంచంలో ఎక్కడ కాలుమోపినా తనకు తిరుగులేదనుకునే అమెరికా ప్రెసిడెంట్ కి చైనా రీసెంట్ గా షాకిచ్చింది! అమెరికాతో పొటీపడి వాల్డ్ నెంబర్ వన్ కంట్రీ అవుదామని కలలు కంటున్న డ్రాగన్ ఒబామా వస్తే కనీస మర్యాదలు కూడా పాటించలేదు. ఆయన స్పెషల్ విమానానికి స్టెయిర్ కేస్ కూడా ఏర్పాటు చేయలేదు.  విమానానికి వుండే మెట్ల ద్వారానే దిగి వచ్చాడు ఒబామా. అంతే కాదు, ఆయన దిగి రాగానే ఎదురుగా ఏర్పాటు చేయాల్సిన రెడ్ కార్పెట్ కూడా కనిపించలేదు! ఇక ఫైనల్ గా అమెరికన్ జర్నలిస్టుల్ని ఒబామా వద్దకి అనుమతించను కూడా లేదు చైనీస్ అఫీషియల్స్! వాళ్లు , ఒబామా సెక్యురిటీ సిబ్బంది దీని పై ఆగ్రహం వ్యక్తం చేస్తే.... ఇది మా దేశం, మా విమానాశ్రయం అన్నారట చైనీస్ అధికారులు! ఎదురు సమాధానం అంటే ఏంటో తెలియని వైట్ హౌజ్ సిబ్బందికి దిమ్మ తిరిగిపోయింది!


ఒబామా తనకు జరిగిన ఈ అవమానానికి పెద్దగా ఫీలవ్వలేదు! అప్పుడప్పుడూ ఇలాంటివి జరుగుతుంటాయని లైట్ తీసుకున్నట్టు స్టేట్మెంట్ ఇచ్చాడు. కాని, మన కమల్ హసన్, షారుఖ్ ఖాన్ లాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీలను కూడా తమ ఎయిర్ పోర్టుల్లో దారుణంగా అవమానించే అమెరికాకి .... వెలక్కాయ గొంతులో పడితే ఎలా వుంటుందో ఇప్పుడు తెలిసొచ్చింది! 


ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే... ఒబామాను ఓ ఆటాడుకున్న చైనీస్ అధికారులు మన మోదీకి మాత్రం రెడ్ కార్పెట్ పరిచి ఘనంగా స్వాగతం పలికారు!

By
en-us Political News

  
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.